breaking news
Geetika Sharma
-
గీతికా శర్మ కేసులో సంచలన తీర్పు
ఢిల్లీ: హర్యానాలో సంచలనం సృష్టించిన ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోపాల్ గోయల్ కందాకు భారీ ఊరట లభించింది. 11 ఏళ్ల కిందటి నాటి ఈ కేసులో.. కందాని నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ప్రముఖ వ్యాపారవేత్త అయినా కందాకు చెందిన ఎండీఎల్ఆర్ ఎయిర్‌లైన్స్‌లో గీతికా శర్మ ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. అదే సమయంలో కందాకు చెందిన ఓ కంపెనీకి ఆమె డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టింది. అయితే.. 2012, ఆగష్టు 5వ తేదీన ఢిల్లీ అశోక్ విహార్‌లోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో సిస్రా ఎమ్మెల్యే అయిన కందా.. కాంగ్రెస్ భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోని ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి హోదాలో ఉన్నారు. ► అయితే తన సూసైడ్ నోట్లో కందాతో పాటు ఆయన దగ్గర పని చేసే ఉద్యోగి అరుణ్ చందా తనను వేధించారంటూ గీతిక పేర్కొంది. అంతేకాదు ఆయనకు అంకిత అనే మరో మహిళతో సంబంధం ఉందని, వాళ్లకు ఓ బిడ్డ పుట్టిందని ఆరోపించింది. తన ఆత్మహత్యకు కందా వేధింపులే కారణమని పేర్కొందామె. ► దీంతో భారత్ నగర్ పోలీస్ స్టేషన్లో గోపాల్‌తో పాటు అరుణ్‌పైనా ‘ఆత్మహత్యకు ఉసిగొల్పారనే’ నేరం కింద అభియోగాలు నమోదు అయ్యాయి. అంతేకాదు అత్యాచారం, అసహజ శృంగారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ► ఆ సమయంలో.. కేసు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కందా తన పదవికి రాజీనామా చేసి.. పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. అంతకు ముందు అరుణ్ చందాను పోలీసులు గాలించి మరీ అరెస్ట్ చేశారు. అదే ఏడాది పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ► అయితే కందా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. గీతిక ఎంబీఏ చదవడానికే తానే సాయం చేశానని, సిస్రాలోని తన ఇంటర్నేషనల్ స్కూల్‌కు చైర్మన్‌ను సైతం చేశానని చెప్పుకొచ్చాడు. ► ఇదిలా ఉంటే.. న్యాయం దక్కదనే ఆవేదనతో 2013 ఫిబ్రవరి 15వ తేదీన గీతిక తల్లి అనురాధా శర్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. కూతురిలాగే ఆమె సైతం సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ► 2014 మార్చి 4వ తేదీన కందాకు బెయిల్ లభించింది. అలాగే.. ఆయనపై దాఖలైన అత్యాచారం, అసహజ శృంగారం ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ► ఈలోపే హర్యానా లోక్‌హిత్ పార్టీని స్థాపించిన కందా.. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసి సిస్రా ఎమ్మెల్యేగా నెగ్గాడు. ► అయితే.. ఇన్నేళ్లు గడిచినా అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌వాళ్లు విఫలమయ్యారంటూ స్పెషల్ జడ్జి వికాస్ ధూల్ గోపాల్‌ను, అరుణ్‌ను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇవాళ సంచలన తీర్పు వెల్లడించారు. ► గోపాల్ కుమార్ గోయల్ అలియాస్ గోపాల్ గోయల్ కందా అస్సలు చదువుకోలేదు. వ్యాపారాలతో ఎదిగి.. భారీగా ఆస్తులు సంపాదించాడు. ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గోపాల్‌పై గీతికా శర్మ కేసు ఒక్కటే కాదు.. ఇంకా చాలానే కేసులు నమోదు అయ్యాయి. ► గీతిక శర్మ సూసైడ్ కేసులో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తాజా తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమని ఆమె సోదరుడు చెబుతున్నారు. #WATCH | After Delhi's Rouse Avenue Court acquitted former Haryana Minister Gopal Goyal Kanda in air hostess Geetika Sharma suicide case, he says, "There was no evidence against me, this case was made against me and today the court has given its verdict." pic.twitter.com/rG9gE6EZ86 — ANI (@ANI) July 25, 2023 -
గోపాల్ కందాకు ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాకు ఊరట లభించింది. హర్యానా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో పాటు శిర్సా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వెచ్చించేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్థనను మన్నించింది. ప్రత్యేక పరిస్థితుల్లో కందా అభ్యర్థనను పరిశీలించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నామని అదనపు సెషన్స్ జడ్జి ఎంసీ గుప్తా మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.ఐదు లక్షలతో పాటు ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే దేశం విడిచి బయటకు వెళ్లరాదని, న్యాయం నుంచి తప్పించుకోవొద్దనే వివిధ షరతులను విధించారు. ఈ బెయిల్‌పై బుధవారమే వాదనలు జరగగా కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయిన అరుణ చద్దాకు పండుగలు, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నవంబర్ 15 వరకు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈమె మధ్యంతర బెయిల్ కాల పరిమతిని తగ్గించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఇదిలావుండగా హర్యానాలోని సిర్సా నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కందా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అతడి తరఫు సీనియర్ న్యాయవాది రమేశ్ గుప్తా బుధవారం వాదించారు. అతి పెద్ద నియోజకవర్గమైన శిర్సా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేరవేయాల్సిన బాధ్యత కందాపై ఉందని అన్నారు. తన నియోజకవర్గ నిధులను ఉపయోగించకపోవడంతో ప్రజలు బాధ పడాల్సి వస్తోందని తెలిపారు. గత 14 నెలల నుంచి పోలీసు కస్టడీలో కందా ఉన్నాడని, పోలీసుల దర్యాప్తు కూడా పూర్తయిందని, దీంతో ఈ కేసుకు హాని కలిగించే అవకాశమే లేదని అన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కోర్టు కందాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే దీన్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ తోసిపుచ్చారు. సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశముండటంతోనే పోలీసు కస్టడీలో ఉంచుతున్నారని అన్నారు. 2013, ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బెయిల్ మాత్రం అడగలేదు. అయితే ఇప్పుడు ఈ సభల కోసం మధ్యంతర బెయిల్‌ను ఎందుకు అడుగుతున్నాడు? సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశముందని, అతనికి బెయిల్‌ను ఇవ్వొద్దని వాదించారు. అయితే దీనిపై నిర్ణయాన్ని బుధవారం రిజర్వ్‌లో ఉంచిన కోర్టు కందాకు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, గతేడాది ఆగస్టు 8, 18న చందా, కందాలను పోలీసులు అరెస్టు చేశారు. మే 27 ప్రారంభమైన ఈ కేసు విచారణలో ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఇప్పటివరకు నమోదు చేసింది. వీరిలో పోలీసు అధికారితో పాటు బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు కూడా ఉన్నారు. కందా ఎండీఎల్ఆర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఉద్యోగి ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకునేలా కందా, అరుణ చద్దా ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ నివాసంలో 2012 ఆగస్టు 5న ఎయిర్‌హోస్టెస్ మరణించింది. అయితే కందా, చద్దాల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. -
గోపాల్ కందాకు ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాకు ఊరట లభించింది. హర్యానా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో పాటు శిర్సా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వెచ్చించేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్థనను మన్నించింది. ప్రత్యేక పరిస్థితుల్లో కందా అభ్యర్థనను పరిశీలించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నామని అదనపు సెషన్స్ జడ్జి ఎంసీ గుప్తా మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.ఐదు లక్షలతో పాటు ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే దేశం విడిచి బయటకు వెళ్లరాదని, న్యాయం నుంచి తప్పించుకోవొద్దనే వివిధ షరతులను విధించారు. ఈ బెయిల్‌పై బుధవారమే వాదనలు జరగగా కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయిన అరుణ చద్దాకు పండుగలు, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నవంబర్ 15 వరకు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈమె మధ్యంతర బెయిల్ కాల పరిమతిని తగ్గించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఇదిలావుండగా హర్యానాలోని సిర్సా నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కందా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అతడి తరఫు సీనియర్ న్యాయవాది రమేశ్ గుప్తా బుధవారం వాదించారు. అతి పెద్ద నియోజకవర్గమైన శిర్సా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేరవేయాల్సిన బాధ్యత కందాపై ఉందని అన్నారు. తన నియోజకవర్గ నిధులను ఉపయోగించకపోవడంతో ప్రజలు బాధ పడాల్సి వస్తోందని తెలిపారు. గత 14 నెలల నుంచి పోలీసు కస్టడీలో కందా ఉన్నాడని, పోలీసుల దర్యాప్తు కూడా పూర్తయిందని, దీంతో ఈ కేసుకు హాని కలిగించే అవకాశమే లేదని అన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కోర్టు కందాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే దీన్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ తోసిపుచ్చారు. సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశముండటంతోనే పోలీసు కస్టడీలో ఉంచుతున్నారని అన్నారు. 2013, ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బెయిల్ మాత్రం అడగలేదు. అయితే ఇప్పుడు ఈ సభల కోసం మధ్యంతర బెయిల్‌ను ఎందుకు అడుగుతున్నాడు? సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశముందని, అతనికి బెయిల్‌ను ఇవ్వొద్దని వాదించారు. అయితే దీనిపై నిర్ణయాన్ని బుధవారం రిజర్వ్‌లో ఉంచిన కోర్టు కందాకు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, గతేడాది ఆగస్టు 8, 18న చందా, కందాలను పోలీసులు అరెస్టు చేశారు. మే 27 ప్రారంభమైన ఈ కేసు విచారణలో ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఇప్పటివరకు నమోదు చేసింది. వీరిలో పోలీసు అధికారితో పాటు బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు కూడా ఉన్నారు. కందా ఎండీఎల్ఆర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఉద్యోగి ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకునేలా కందా, అరుణ చద్దా ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ నివాసంలో 2012 ఆగస్టు 5న ఎయిర్‌హోస్టెస్ మరణించింది. అయితే కందా, చద్దాల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది.