breaking news
Game toys
-
పంచుకోవటం నేర్పండి
కేరెంటింగ్ సాధారణంగా పిల్లలు తమ వస్తువులు, ఆట బొమ్మలు అన్నీ తమవే అని, అలానే తల్లి, తండ్రి ప్రేమ తమకు మాత్రమే సొంతమని భావిస్తారు. వారిని ఎవరైనా ముట్టుకున్నా ఏడ్చేస్తారు. గొడవ చేస్తారు. అంతవరకు తప్పు లేదు కానీ, దానిని వస్తువులు, పుస్తకాలు, తినుబండారాలు, దుస్తులు వంటి వాటికి కూడా వర్తింప జేస్తేనే ఇబ్బంది. అలా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కూడా ఎవరికీ, ఏమీ ఇవ్వడానికి ఇష్టపడరు. అలా కాకుండా ఉండాలంటే చిన్నప్పటినుంచే పిల్లలకు అన్నింటినీ పంచుకోవటం నేర్పించాలి. తన వస్తువులను తాను ప్రాణప్రదంగా చూసుకోవడంలో ఏవిధమైన ఇబ్బందీ లేదు. అది మంచి పరిణామమే. అయితే, ఎవరికైనా ఏమైనా అవసరమై, అడిగినప్పుడు దానిని అవతలి వారికి ఇవ్వడంలో తప్పులేదని చెప్పాలి. వారు తినే కుకీస్ లాంటి తినుబండారాలను కూడా ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం నేర్పించాలి. ఇందులో ఒక చిన్న చిట్కాను పాటించాలి. అదేమంటే, మన పిల్లలను వారి వస్తువులు కానీ, తినుబండారాలను కానీ ముందుగా ఎదుటివారికి ఇవ్వమని చెప్పకూడదు. ముందు అవతలి వారి నుంచి వీరికి ఇప్పించినట్లయితే వాళ్లుముందుగా ఇచ్చారు కాబట్టి తనూ ఇవ్వాలనే భావం కలుగుతుంది. అప్పుడు తమ వద్ద ఉన్న వాటిని అవతలి వారికి ఆనందంగా ఇస్తారు. ఆ విధంగా వారికి పంచుకోవటంలోని ఆనందాన్ని నే ర్పించాలి. అవేకాదు, సామాజిక నైపుణ్యాలూ నే ర్పించాలి. ఇతర పిల్లలతో కలిసి మెలసి ఉండటం, వారిని ప్రేమించటం, వాళ్లతో ఆడుకోవడం అలవాటు చేయాలి. -
వెలుగుపూలు
చూసే ప్రతి వస్తువులోనూ.. చేసే ప్రతి పనిలోనూ కొత్తదనం ఉంటేనే పిల్లలకు ఆనందం. అందుకే తమ చిన్నారులను ప్రతిక్షణం హ్యాపీగా ఉంచాలనే శ్రద్ధ పేరెంట్స్‌లో పెరుగుతోంది. పిల్లలు పుట్టిన నాటి నుంచి ప్రతి దశలోనూ వీలైనన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పిల్లల టేస్ట్‌కు చిల్డ్రన్ రూమ్‌ను డిజైన్ చేస్తున్నారు. ఆట బొమ్మల నుంచి ఇంటీరియర్ వరకు చాయిస్‌ను వారికిస్తున్నారు. ఈ శ్రద్ధనే వ్యాపార సంస్థలు అవకాశంగా మలుచుకుంటున్నాయి. చిన్నారులను దృష్టిలో ఉంచుకుని వారి కోణంలోనే ప్రతి వస్తువునూ డిజైన్ చేస్తున్నాయి. అలా మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండే కిడ్స్ ల్యాంప్స్! చిన్నారుల మోములో వెలుగుపూలు!! - ఎల్.సుమన్‌రెడ్డి చిన్నపిల్లల బల్బులు ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతున్నాయి. చిన్నారుల మెప్పు కోసం పెద్ద పెద్ద కంపెనీలు డిఫరెంట్ లుక్‌లో ల్యాంప్‌లు డిజైన్ చేస్తున్నాయి. దేశ, విదేశీ డిజైనర్లు తయారు చేసిన రకరకాల ల్యాంప్స్ మార్కెట్లో ఇపుడు సందడి చేస్తు న్నాయి. ఆట వస్తువుల్లాంటి బల్బులను చూడగానే చిన్నారుల ముఖాలు వెలిగిపోతున్నాయి. ఇలాంటి ల్యాంప్స్ ఉన్న గదిలో పిల్లలు మరింత ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటున్నారని కొన్ని సర్వేలు తేల్చాయి. దీంతో కిడ్స్ ల్యాంప్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. బల్బు వినోదం చిన్నపిల్లల హోం వర్క్, డ్రాయింగ్, బెడ్ రూం, ప్లే గ్రౌండ్, బాత్రూం, పెట్ రూం.. ఇలా ప్రతి అంగుళానికి ప్రత్యేక డిజైన్లతో ల్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి. పువ్వులు, పక్షులు, సీతాకోకచిలుకలే కాదు.. విమానాలు, కార్లు, తుపాకులు.. ఇలా రకరకాల డిజైన్లలో ఉన్న బల్బులు వెలుగులు విరజిమ్ముతూ వినోదాన్ని కలగజేస్తున్నాయి. టేబుల్ ల్యాంప్స్, వాల్ ల్యాంప్స్, సీలింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ డిజైన్ ల్యాంప్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. టెడ్డీ బేర్స్ రూపంలోని లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏ ఫర్ యాపిల్.. బీ ఫర్ బాల్ వంటి బల్బులు చిట్టి బుర్రల్లో అక్షర జ్ఞానాన్ని వెలిగిస్తున్నాయి. అమ్మ ఒడి, నాన్న సహచర్యం, కుక్క పిల్లలు, మేక పిల్లల రూపాల్లో డిజైన్ చేసిన ల్యాంప్స్‌కు డిమాండ్ బాగా ఉంది. వెలుగు జిలుగులు బల్బుల స్విచ్‌లను అదేపనిగా ఆన్, ఆఫ్ చేయడమంటే పిల్లలకు భలే సరదా. అందుకనే ఆన్ చేసిన ప్రతిసారి కొత్త కలర్లో వెలుగులు వచ్చేలా కూడా బల్బులు మార్కెట్లో ఉన్నాయి. కొన్ని రొటేటింగ్ బల్బులు ఆకర్షణీయ రంగులు, డిజైన్లలో వెలుగు కిరణాలు వ్యాప్తి చేస్తాయి. ఇవి పిల్లల ఆరోగ్యం, సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఆహ్లాదాన్ని కూడా పంచుతాయంటున్నారు డిజైనర్లు. ధర కొద్దీ ధగధగలు పిల్లల గదిలో లైటింగ్ డెకరేషన్లో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దేశ, విదేశీ హోం డెకార్ డిజైనర్లు రూపొందించిన ల్యాంప్స్ నగరంలో లభ్యమవుతున్నాయి. తూర్పు, దక్షిణాసియా దేశాల నుంచి ఇవి దిగుమతి అవుతున్నాయి. కిడ్స్ ల్యాంప్స్ ధరల రేంజ్ రూ. 2,500 నుంచి రూ. 15 వేల వరకు ఉంటోంది. ఖరీదైన ల్యాంప్స్‌ను కిడ్స్ గదుల్లో పొందికగా అమర్చేందుకు కూడా డెకరేషన్ నిపుణులను ఆశ్రయిస్తున్నారు. బిజినెస్ రెండింతలైంది ‘ల్యాంప్స్ అండ్ లైటింగ్ వ్యాపారంలో ఇప్పుడు కిడ్స్ ల్యాంప్స్ షేర్ రెండింతలైంది. దీంతో మరింత ఆకర్షణీయ డిజైన్ల ల్యాంప్ తయారీ, దిగుమతులపై వ్యాపారులంతా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పిల్లలకు అక్షరాలు నేర్పించడం నుంచి ప్రతి విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా ల్యాంప్‌లను డిజైన్ చేయిస్తున్నారు’ - నిధి మాలిక్, ‘తిస్వ’ మార్కెటింగ్ హెడ్