breaking news
full state honour
-
AP: అధికారిక లాంఛనాలతో పింగళి కుమార్తె అంత్యక్రియలు
సాక్షి, అమరావతి: జాతీయ పతాకరూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతా మహాలక్ష్మి (100) కన్నుమూసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే.. ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిందటి ఏడాది స్వయంగా మాచర్లకు వెళ్లి ఆమెను సత్కరించి ఆప్యాయంగా పలకరించారు సీఎం జగన్. ఆపై సాయం కింద రూ.75 లక్షల చెక్కును అందజేశారు కూడా. -
స్వగ్రామానికి చేరుకున్న మస్తాన్ బాబు మృతదేహం
-
ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్బాబు అంత్యక్రియలు
ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు మృతదేహం నెల్లూరు జిల్లాలోని స్వగ్రామమైన గాంధీ జనసంఘానికి చేరుకుంది. ఆయన మృతదేహాన్ని నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు మస్తాన్ బాబు ఇంటికి వెల్లువెత్తారు. శనివారం నాడు ఆయన స్వగ్రామంలోనే పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు జరుగుతాయి. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు తదితరులు శుక్రవారం సాయంత్రమే వెళ్లి మస్తాన్బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. అర్జెంటీనాలోని పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ప్రమాదవశాత్తు మంచులో కూరుకుపోయి మస్తాన్బాబు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని బయటకు తీసేందుకు అర్జెంటీనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా తొలుత సాధ్యం కాకపోయినా.. తర్వాత జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చి వెంటనే భారతదేశానికి పంపారు. చెన్నై విమానాశ్రయం నుంచి సంగం మండలంలోని గాంధీ జనసంఘానికి మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకొచ్చారు.