breaking news
former village sarpanch house
-
జీఎం వలసలో పట్టపగలే చోరీ
మారేడుమిల్లి: మండలంలోని గుజ్జుమామిడి వలస (జీఎంవలన) గ్రామంలో మాజీ సర్పంచ్ పల్లాల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో గురువారం మధ్యాహ్నం సమయంలో దొంగతనం జరిగింది. దొంగలు సుమారు రెండు లక్షలు విలువ గల బంగారం, డబ్బును అపహరించుకుని పోయినట్టు తెలిసింది. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం మాజీ సర్పంచ్ పల్లాల సూర్యానారాయణ రెడ్డి, అతని భార్య గ్రామ శివారులో గల ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఇరువురూ గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి వెనుక వైపు తలుపు తాళం పగులకొట్టి ఉంది. దీంతో ఆందోళనతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపుల తాళాలు, బీరువా తాళం పగులకొట్టి బీరువాలోని దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉంచిన నగదు, బంగారం కనిపించలేదు. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. వచ్చే నెలలో ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నామని దానికోసం దాచి ఉంచిన నగదు, బంగారాన్ని దొంగలు అపహరించుకుపోయారని వారు బోరున విలపించారు. శుక్రవారం స్ధానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాము సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. (చదవండి: పోలీసు ఇంటికే కన్నం) -
మాజీ సర్పంచ్ ఇంట్లో చోరీ
అనంతపురం: అనంతపురం జిల్లాలో గురువారం రాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాడిమర్రి మండలం పెద్దకోట గ్రామ మాజీ సర్పంచ్ పాటిల్ ప్రకాశ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ప్రకాశ్ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారం, రూ.40 వేల నగదును ఎత్తికెళ్లారు. ప్రకాశ్ కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చిన పక్రాశ్ ఇంట్లో వస్తువులు చిందరబందరగా ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.