breaking news
fellow
-
నిద్రలో భుజంపై వాలితే అలా కొడతారా..?
న్యూయార్క్: నిద్రలో భుజంపై వాలిపోయినందుకు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడో వ్యక్తి. మోచేయితో భీకరంగా దాడి చేయగా.. బాధితుడు అక్కడే మూర్చపోయాడు. బాధితుని స్నేహితులు తిరగబడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ దారుణ ఘటన న్యూయార్క్‌లోని మెట్రో రైలులో జరిగింది. మెట్రో రైలు ఫారెస్ట్ హిల్స్ 71వ అవెన్యూ స్టాప్ సమీపంలో సబ్‌వేకు చేరేసరికి ఉదయం 5:30 గంటల సమయం అవుతోంది. నిద్రలో పక్కనే ఉన్న ఓ ప్యాసింజర్ భుజంపై అనుకోకుండా వాలిపోయాడో వ్యక్తి. దీంతో ఆ ప్యాసింజర్ వాగ్వాదానికి దిగాడు. నిద్రలో ఉన్న వ్యక్తి స్నేహితులు ఆ ప్యాసింజర్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహంతో పక్కనే ఉన్న వ్యక్తిని మోచేతితో బలంగా దాడి చేశాడు. అంతే.. ఆయన అక్కడే మూర్చపోయాడు. New York man elbows another passenger on the subway #subwaycreatures #nyc #frailego pic.twitter.com/N6KX6ltBIz — Rama (@EyesWitness00) August 24, 2023 బాధితుని స్నేహితులు గొడవకు దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో మెట్రో ఆ కంపార్ట్మెంట్ రణరంగంగా మారింది. ఆ వెంటనే స్టాప్ రావడంతో అందరూ దిగిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తిని గాలిస్తున్నారు. ఇదీ చదవండి: ఏంటి గురూ..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..? -
స్నేహితుల చెంతకే ప్రభాకర్
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో గాయపడిన యువకుడి మృతి నాడు అమ్మా, నాన్నలు.. నేడు కుమారుడు.. తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం తొగర్రాయి(దుగ్గొండి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న యువకుడు ప్రభాకర్ శుక్రవారం మృతిచెందాడు. మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన స్నేహితులు నల్ల సతీష్, చిలువేరు రాజు, చింతం ప్రభాకర్ ఈనెల 18న గిర్నిబావిలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా అదే రోజు సతీష్, రాజు మృతి చెం దిన విషయం తెలిసిందే. చావుబతుకుల మధ్య ఉన్న చింతం ప్రభాకర్(20)ఆరు రోజు లుగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ మధ్యాహ్నం మృతి చెం దినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతు డి తాత కంతిరి వెంకటనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. నాడు అమ్మా, నాన్నలు.. నేడు కుమారుడు.. తొగర్రాయికి చెందిన కంతిరి వెంకటనర్సయ్య కూతురు పూలను ఊరుగొండ గ్రామానికి చెందిన చింతం సదానందంకు ఇచ్చి పెళ్లి చేశారు. ప్రభాకర్ పుట్టిన ఐదేళ్లకే సదానందం చనిపోయాడు. గత నాలుగేళ్ల క్రితం పూల చని పోయింది. దీంతో ప్రభాకర్‌ను తాత వెంకటనర్సయ్య పెంచుకుంటున్నాడు. కూలీ పనులుకు వెళ్లి జీవనం సాగిస్తున్న ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లయింది. గ్రామంలో ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభాకర్ తాతఅమ్మమ్మల రోదనలు పలువురిని కంట తడి పెట్టించాయి.