breaking news
Erra Bus
-
‘ఎర్రబస్సు’ మూవీ పోస్టర్లు
-
దాసరి అంటేనే చరిత్ర సృష్టించటం: మోహన్ బాబు
తిరుమల : 'ఎర్రబస్సు' చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. బుధవారం తిరుమల విచ్చేసిన ఆయన దర్శనం అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తన గురువు దాసరి నారాయణరావు, విష్ణు నటించిన ఎర్రబస్సు చిత్రం ...శుక్రవారం విడుదల కానున్నట్లు తెలిపారు. చాలారోజుల తర్వాత దాసరి మళ్లీ నటించారన్నారు. ఎర్రబస్సు సినిమాను అందరూ కచ్చితంగా ఆదరిస్తారన్నారు. ఎర్రబస్సులో దాసరి, విష్ణు ...తాతా మనవళ్లుగా నటించారని, సినిమాను చూసిన ప్రేక్షకులు నవ్వుకోవటంతో పాటు కంటతడి కూడా పెడతారని మోహన్ బాబు అన్నారు. భగవంతుని ఆశీస్సులతోనే ఈ సినిమా నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు. దాసరి నారాయణరావు అంటేనే చరిత్ర సృష్టించటం అని... ఆ ట్రెండ్ అలానే కొనసాగుతుందన్నారు. అప్పట్లో తనకు 'స్వర్గం-నరకం' చిత్రంలో దాసరితో కలిసి నటించే అవకాశం వస్తే ఇప్పుడు విష్ణుకు ఎర్రబస్సు ద్వారా ఆ అవకాశం లభించిందన్నారు. -
‘ఎర్రబస్సు’మూవీ ప్రెస్ మీట్