breaking news
EPF pensioner
-
EPF పెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) షాకిచ్చింది. ప్రతి నెలా చివరి రోజు కంటే రెండ్రోజుల ముందే (28, 29వ తేదీ) ఇచ్చే పెన్షన్ డబ్బులు...జూలై నెల గడిచినా జాడలేకపోవడంతో పెన్షనర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో శుక్రవారం (జూలై 31) ఈపీఎఫ్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున పెన్షనర్లు ప్రత్యక్షమయ్యారు. పెన్షన్ డబ్బులు రాకపోవడంపై ఆరా తీశారు. అయితే అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం వారిని మరింత ఆందోళనకు గురి చేసింది.కాగా, ఈపీఎఫ్ఓ తాజాగా నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కొన్ని కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడడంతో పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ దీన్ని అధికారికంగా ధుృవీకరించడం లేదు. దేశవ్యాప్తంగా 82.11లక్షల మంది పెన్షనర్లున్నారు. తాజాగా నెలకొన్న సాంకేతిక సమస్యలతో వీరందరికీ పెన్షన్ అందలేదని తెలుస్తోంది.దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో అత్యధికంగా తెలంగాణ రీజియన్ పరిధిలో దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ప్రతి నెలా అందే పెన్షన్ అత్యంత పరిమితమే. రూ.1500 నుంచి సర్వీసుకు తగినట్లు రూ.7వేల వరకు గరిష్టంగా అందుతుంది. నెలవారీ వ్యక్తిగత ఖర్చులు, మందుల కొనుగోలు, ఇతరత్రా చిన్న అవసరాలకు ఈ డబ్బుల మీదే ఆధారపడుతుంటారు.తాజాగా జూలై నెల పెన్షన్ డబ్బులు అందకపోవడంతో వారంతా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఎప్పటిలోగా చెల్లింపులు చేస్తారనే స్పష్టత లేకపోవడంతో పెన్షనర్లు తీవ్ర గందరగోళంలో పడ్డారు. తక్షణమే పెన్షన్ డబ్బులు విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈపీఎఫ్ఓ తగిన చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు కోరుతున్నారు. -
సొంతింటి కల నెరవేరుస్తాం
పీఎఫ్ కేంద్ర కమిషనర్ వీపీ జాయ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పీఎఫ్ ఖాతాదారులందరికీ సొంతింటి కల నెరవేరుస్తామని పీఎఫ్ కేంద్ర కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. ఇందుకు కనీసం పదిమంది ఖాతాదారులు ఒక బృందంగా ఏర్పాటు కావాలన్నారు. ఉద్యోగులు పీఎఫ్ కింద జమ చేసుకున్న మొత్తంలో గరిష్టంగా 90 శాతాన్ని రుణ రూపంలో ఇస్తామని, నెలవారీగా చెల్లించే పీఎఫ్ మొత్తాన్ని వాయిదాల కింద జమ చేసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ పింఛన్దారుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల ప్రతి ఖాతాదారుడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. సోమవారం పీఎఫ్ ప్రాంతీయాధికారి విజయ్ కుమార్తో కలసి మీడియాతో మాట్లాడారు. పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానానికి ఉద్యోగి పీఎఫ్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.


