breaking news
enqiry
-
ముగిసిన కవిత సీబీఐ విచారణ.. దాదాపు 7 గంటలకు పైగా సాగిన విచారణ
-
వీఆర్‌లో ఉన్న ఎస్సైపై విచారణ
ఏలూరు (సెంట్రల్): ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఎస్సై సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి కేసు నమోదు చేయకపోవడంపై జిల్లా ఎస్సీ విచారణకు ఆదేశించారు. విధుల్లో అలసత్వంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల జరిగిన సమీక్షలో పెదపాడు ఎస్సైను ఎస్పీ భాస్కర్‌భూషణ్ వీఆర్‌లో పెట్టారు. నాలుగు రోజు క్రితం జిల్లా సరిహద్దులోని అప్పనవీడులోని ఓ ఇంట్లో కొందరు నేతలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆ ఇంటినే పేకాట స్థావరంగా మార్చేశారు. విషయం తెలుసుకున్న పెదపాడు ఎస్సై నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుతో కలిసి దాడి చేసినట్టు సమాచారం. అయితే పేకాటలో పట్టుబడిన వారిని పోలీస్‌స్టేçÙ¯ŒSలో అప్పగించకుం డా స్వాధీనం చేసుకున్న సుమారు రూ.2 లక్షల నగదు తీసుకుని వెళ్లినట్టు ఎస్పీకి తెలియడంతో ఎస్బీ అధికారులతో విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తెలితే పెదపాడు ఎస్సైను సస్పెండ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. -
సీసీఎస్ ముందుకు అవుట్ లుక్ జర్నలిస్ట్
హైదరాబాద్: ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పై అవమానపరుస్తూ కథనాన్ని రాసిన అవుట్ లుక్ జర్నలిస్టు మాధవి టాటాను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మంగళవారం పోలీసులు ఎదుట హాజరయ్యారు. 41 ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ...విచారణ హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదాస్పద కథనం మహిళా జర్నలిస్టు మాధవి టాటా పేరుతో ప్రచురితమైంది. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను అవమానించే విధంగా ఔట్లుక్ ఆంగ్ల పత్రిక ఒక కథనంతో పాటు కార్టూన్ వేయడంపై ఆమె భర్త అకున్ సబర్వాల్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు 509 ఐసీసీ, ఐటీ యాక్ట్ 67 సెక్షన్‌తో పాటు 3 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద ఔట్లుక్ యాజమాన్యంతో పాటు, ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంగ్లీష్ మ్యాగ్జైన్ ఔట్లుక్ ఒక వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా గాసిప్ కాలంలో పత్రిక ప్రచురించిన అసభ్యకర కార్టూన్ పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.