breaking news
enginering college
-
ఏపీలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఆద్వర్యంలో ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకుగాను రాష్డ్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నుంచే ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్ధం నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995865456, 7995681678 అందుబాటులో ఉంచారు. (చదవండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం) జనరల్, బీసీ విద్యార్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయిలు ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు. నేడు (శుక్రవారం) ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగననుండగా రేపు (24)న 20,001 ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,001 ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. పీహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ కోటా విద్యార్ధులకి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరగనుంది. -
లక్ష్యసాధనకు కృషి చేయాలి
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుమతి ఉమామహేశ్వరి కేయూక్యాంపస్ : ఉన్నత లక్ష్యాల ను సాధించేం దు కు విద్యార్థినులు కృషి చేయాలని కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుమతి ఉమామహేశ్వరి అన్నారు. సోమవారం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యాసంవత్స రం.. బీటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినులు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం టాస్క్ పాప్ బెన్సన్‌చే విద్యార్థినులకు సైకాలజీ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ నర్సింహారెడ్డి, డాక్టర్ సలీమ్, డాక్టర్ ఎన్.వీణ, డాక్టర్ ఎన్.స్వాతి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.