breaking news
eesha gupta
-
‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’
బాలీవుడ్ నటి ఈషా గుప్తా మీద పరువు నష్టం కేసు నమోదయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈషా గుప్తా సోషల్ మీడియాలో.. రోహిత్ విగ్ అనే వ్యక్తి ప్రవర్తించిన తీరు ఎంతో క్రూరంగా ఉందని, తనకెంతో అసౌకర్యంగా, అభద్రంగా అనిపించిందని ఆమె వెల్లడించారు. తన చుట్టు ఇద్దరు గార్డులు ఉన్నా.. అతను చూపులతో స్వైరవిహారం చేశాడని, అలాంటివాళ్లు నాశనమవ్వాలని, అతని ప్రవర్తన వల్ల తాను రేప్‌కు గురవుతున్నట్టు అనిపించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్త, ఈషా గుప్తా మీద పరువు నష్టం కేసు నమోదు చేశాడు. ఈషా చేసిన ఆరోపణల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు తలెత్తుకుని తిరగలేకపోతున్నామని.. ఎంతో మనో వేదన అనుభవించామని తెలిపాడు. తాను మౌనంగా ఉంటే ఈ ఆరోపణలను నిజమని నమ్ముతారని.. అందుకే ఆమె మీద పరువు నష్టం దావా వేసినట్లు తెలిపాడు. (చదవండి : రేప్‌కు గురవుతున్నట్టు అనిపించింది: నటి) ఈ సందర్భంగా రోహిత్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఈషా ఆరోపణల వల్ల రోహిత్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదన అనుభవించారు. రోహిత్ స్నేహితులు, కొలీగ్స్.. అతడిని, అతని కుటుంబ సభ్యులను ప్రశ్నలతో వేధిస్తూ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల ఉండే వారు నా క్లయింట్ వ్యక్తిత్వం పట్ల, నైతికత పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈషా గుప్తా మీద పరువు నష్టం కేసు నమోదు చేశాం. ఆమె నుంచి నష్ట పరిహారం డిమాండ్ చేస్తున్నాం’ అని తెలిపాడు. -
బికినీలో ముగ్గురు బ్యూటీలు
ముగ్గురు ముద్దుగుమ్మలు... అదీ బికినీలో... మరి కుర్రాళ్లకు కనువిందు ఖాయం. నిద్ర ఖరాబు కావడం అంతకన్నా ఖాయం. దర్శక నిర్మాత సాజిద్ ఖాన్ 'హమ్ షకల్' లో డస్కీ బ్యూటీ బిపాశా బసు, నటి మోడల్ ఈశా గుప్తా, మిల్కీ బ్యూటీ తమన్నాలు బికినీలో కనిపించనున్నారు. అయితే ఈ అందాల ఆరబోతంతా సినిమాలోని ఒక సీనులో మాత్రమేనట. ఈ ముగ్గురమ్మలూ తమ శరీరాకృతికి సరిపోయే బికినీలు తామే సెలక్ట్ చేసుకుంటున్నారట. అంతే కాదు సెలెక్ట్ చేసుకున్న బికినీలకు తగిన శరీరాకృతిని సాధించుకునే పనిలో పడ్డారట. తన ప్రతి సినిమాలోనూ ఒక బికినీ సీనును తప్పనిసరిగా ఉంచే సాజిద్ ఈ సినిమాలోనూ అదే ఆచారాన్ని పాటించాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ లు హీరోలు. సినిమాను వాశూ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20 న విడుదలవుతుంది.