breaking news
eedo rakam aado rakam
-
అతిథి పాత్రలో మెరవనున్న సునీల్!
చెన్నై: కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా అదరగొడుతున్న సునీల్.. తన తదుపరి చిత్రంలో అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన 'ఈడోరకం ఆడోరకం' సినిమాలో సునీల్ ఒక గెస్ట్ రోల్లో నటించాడని ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జీ నాగేశ్వర రావు తెలిపారు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్‌లో కూడా సునీల్ తళుక్కుమంటాడట. ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సోనారికా భండోరియా, హెబ్బా పటేల్‌లు కథానాయికలుగా నటించారు. -
కామెడీనే నమ్ముకున్న మంచు వారబ్బాయి
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు వారబ్బాయి, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కెరీర్‌ను మలుపు తిప్పే భారీ బ్లాక్ బస్టర్ అందించటంలో మాత్రం వెనకపడ్డాడు. మొదట్లో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టిపెట్టిన విష్ణు, అవి పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో కామెడీ టర్న్ తీసుకున్నాడు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాలతో మంచి విజయాలు సాధించి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఈ సక్సెస్‌ల తరువాత మరోసారి మాస్ ఇమేజ్ మీద మనసుపడి, యాక్షన్ సినిమాలు చేసే ప్రయత్నం చేశాడు. అనుక్షణం, రౌడీ లాంటి సినిమాలతో పరవాలేదనిపించినా, మాస్ హీరో ఇమేజ్ మాత్రం సాధించలేకపోయాడు. డైనమైట్ సినిమాతో యాక్షన్ హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన విష్ణు, ఇప్పుడు మరోసారి కామెడీ సినిమానే నమ్ముకుంటున్నాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఈడో రకం ఆడో రకం' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ