breaking news
Echo - Cardiogram
-
అరుదైన వ్యాధికి ఎక్మో చికిత్స: 11 నెలల చిన్నారిని కాపాడిన అంకుర వైద్యులు
హైదరాబాద్: అంకుర ఆసుపత్రి కూకట్పల్లిలో ECMO (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) ఉపయోగించి అరుదైన వైరల్ మయోకార్డిటిస్తో బాధపడుతున్న శిశువు ప్రాణాలను కాపాడారు. ఈ టెక్నాలజీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కృత్రిమ గుండె , ఊపిరితిత్తులా పనిచేస్తుంది 11 నెలల చిన్నారి గజర్ల మోక్షిత్ తీవ్రమైన ఫుల్మినెంట్ వైరల్ మయోకార్డిటిస్ (గుండె తీవ్రమైన వాపు) తో బాధపడుతున్నాడు. సకాలంలో జోక్యం చేసుకొని ఆసుపత్రి బృందం ఎక్మో చికిత్స అందించి, బాలుడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.జలుబు, దగ్గు ,యు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో జూన్ 2న స్థానిక ఆసుపత్రిలో మోక్షిత్ ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రెండు ఆసుపత్రిలు అతనికి చికిత్స చేసేందుకు నిరాకరించారు.కానీకూకట్పల్లిలోని అంకుర ఆసుపత్రి నిపుణులు తక్షణమే స్పందించి సరియైన చికిత్స అందించారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి."పదకొండు నెలల వయసున్న ఆ శిశువు బర్త్ వైయిటట్ బరువు 3 కిలోగ్రాములు ఉన్నాడని, పుట్టుకతో వచ్చేఅసాధారణ జబ్బులేవీ లేనప్పటికీ,గత కొన్ని రోజులుగా, ఆ బిడ్డ తీవ్రమైన లక్షణాలతో కనిపించాయనీ కూకట్పల్లిలోని అంకురా హాస్పిటల్లోని సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ తంజిలా తెలిపారు. అయితే సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్లైన డాక్టర్ సుజిత్ టి,,డాక్టర్ నవీద్ తో కూడిన క్రిటికల్ కేర్ బృందం సాయంతో సకాలంలో సరియైన చికిత్స అందించామన్నారు.ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనేది రోగి ప్రాణాపాయం క్రమంలో కృత్రిమ గుండె ,ఊపిరితిత్తులుగా పనిచేస్తుంది. ఈ అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు రోగి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి , నయం కావడానికి వీలు కల్పిస్తుందని ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ థామస్ మాథ్యూ వివరించారు. శిశువు ఐదు రోజులు ECMO సపోర్ట్పైనే ఉన్నట్టు వెల్లడించారు. దీనికి తోడు COVID-19 పాజిటివ్, కాళ్ళ సిరల్లో రక్తం గడ్డకట్టడంలాంటి పరిస్థితిని కూడా అంకురా ఆసుపత్రిలోని వైద్య బృందం చాకచక్యంగా వ్యవహరించిన వైద్య బృందం IVIG, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీఅర్రిథమిక్ మందులు , యాంటీకోగ్యులెంట్లు, పలు సార్లు రక్తమార్పిడి లాంటి చికిత్సఅను అందించింది. ఫలితంగా మోక్షిత్ గుండె పనితీరు క్రమంగా మెరుగుపడింది . ECMO ,మెకానికల్ వెంటిలేషన్ నుండి విజయవంగా బయటపడ్డాడు. జూన్ 19న అతను డిశ్చార్జ్ అయ్యాడని అంకురం యాజమాన్యం వెల్లడించింది. -
పొట్ట ఉబ్బటం కిడ్నీ సమస్యకు సంకేతమా?
నాకు 55 ఏళ్లు. మొదట్నుంచీ నేను కొంచెం లావుగానే ఉంటాను. కానీ ఈమధ్య కాలంలో పొట్ట మాత్రం విపరీతంగా ముందుకు వస్తూ ఉంది. ఉదయం వేళల్లో కాళ్ల వాపు, ముఖం వాపు కూడా ఉంటోంది. గత 20 ఏళ్లుగా నాకు మద్యం అలవాటు ఉంది. నా స్నేహితులంతా కిడ్నీ చెడిపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడతాయని అంటున్నారు. ఇతరత్రా నాకు ఎలాంటి సమస్యా లేదు. గత మూడేళ్లుగా హైబీపీ కూడా ఉంది. నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? పొట్ట విపరీతంగా ఉబ్బితే కిడ్నీ సమస్య ఉన్నట్లా? దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - డి.ఎస్.ఎమ్., కరీంనగర్ సాధారణంగా పొట్టతోపాటు, శరీరం కూడా పెరిగితే స్థూలకాయం అంటారు. కానీ ముఖం మీద, కళ్ల చుట్టూ వాపు రావడం, పాదాల్లో వాపు వంటి లక్షణాలు స్థూలకాయంలో ఉండవు. కిడ్నీ, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నవాళ్లలో మాత్రమే ఇలాంటి వాపు కనిపిస్తుంటుంది. ఒకవేళ పై సమస్యల కారణంగా పొట్టలో కూడా నీరు చేరితే, పొట్ట ఉబ్బుతుంది. ఈ కండిషన్ను అసైటిస్ అంటారు. అయితే ఈ కండిషన్లో కాళ్లూ, చేతులు స్థూలకాయంలో ఉన్నంత లావుగా ఉండకుండా, మామూలుగానే ఉంటాయి. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లలో పొట్ట వాపు కంటే కళ్ల చుట్టూ వాపు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి క్రియాటినిన్ అనే కిడ్నీ పరీక్ష, ఎల్.ఎఫ్.టి. అనే కాలేయ పరీక్ష, ఎకో-కార్డియోగ్రామ్ అనే గుండె పరీక్ష చేయించుకుంటే... మీ లక్షణాలు దేనికి సంబంధించినవో తెలుస్తుంది. మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్ను సంప్రదించి, పై పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్