breaking news
East Coast Maritime
-
పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువ: మేకపాటి
-
పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువ: మేకపాటి
సాక్షి, తాడేపల్లి: 2023 డిసెంబర్ నాటికి రామాయంపాడు పోర్టు అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన మారిటైమ్ ఇండియా-2021 సదస్సు నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను10 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని వెల్లడించారు. తూర్పు తీరంలో రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి అదనపు అవకాశాలు కల్పిస్తుందన్నారు. గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న తీర ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి విస్తరణకు అవకాశం తక్కువని వివరించారు. కేంద్రం కొత్తగా మారిటైమ్ పాలసీ-2030ను తీసుకుని వచ్చిందని, మారిటైమ్ నావిగేషన్, మానిటరింగ్ యాప్‌ను కేంద్రం ఆవిష్కరించిందని పేర్కొన్నారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రావాణ సామర్థ్యం పెంచనున్నామని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక నగరాలు, పరిశ్రమలు పెరగనున్నాయని, లైట్ హౌసుల చుట్టూ పర్యాటక అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారని మంత్రి మేకపాటి వివరించారు. చదవండి: ‘మారిటైమ్ ఇండియా’ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ -
విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ బిజినెస్ సమిట్
28, 29 తేదీల్లో నిర్వహణ సాక్షి, విశాఖపట్నం: జాతీయ స్థాయిలో సముద్ర వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో రెండు రోజుల పాటు ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమిట్ నిర్వహించనున్నట్లు మారిటైమ్ గేట్‌వే ఎడిటర్ ఇన్ చీఫ్, పబ్లిషర్ ఆర్.రాంప్రసాద్ బుధవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు ఈ సమిట్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్ట్, విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రధాన ప్రాయోజిత కంపెనీలుగా వ్యవహరిస్తామని సమావేశంలో పాల్గొన్న పోర్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరనాథ్, వీసీటీ వైస్ చైర్మన్ అనిల్ నారాయణ్ తెలిపారు. తూర్పు తీరం(ఈస్ట్‌కోస్ట్)లో మారిటైమ్ బిజినెస్‌ను అభివృద్ధి చేయడంపై ఈ సమిట్‌లో చర్చిస్తామన్నారు. విశాఖలో ఈ తరహా సమావేశం ఇది మూడవది.