breaking news
E-visas
-
మరో 8 నగరాల్లో ఈ–వీసాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా నగరాలకు చెందిన పర్యాటకులకు బయో మెట్రిక్ విధానంలో ఈ–వీసా మంజూరు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ 8 నగరాల్లో ఒట్టావా (కెనడా), సెయింట్ పీటర్స్బర్గ్, వ్లాడివోస్తక్ (రష్యా), మ్యూనిచ్ (జర్మనీ), బ్రస్సెల్స్ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్ (హంగేరి), జగ్రీబ్ (క్రొయేషియా) ఉన్నాయి. ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్ వివరాలు ఇస్తే చాలు ఈ–వీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ–వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
పర్యాటక అభివృద్ధికి 'ఈ-వీసా' విధానం
దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది పరిచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అందులోభాగంగా ఈ - వీసా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. దేశంలోని తోమ్మిది విమానాశ్రయాలలో దశలవారీగా ఈ వీసా విధానాన్ని అమలు చేస్తామన్నారు. 2014 -15 సంవత్సర ఆర్థిక బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ - వీసా విధానంతో 'వీసా ఆన్ ఎరైవల్' సులభతరం అవుతుందని జైట్లీ అభిప్రాయపడ్డారు.