breaking news
E cet
-
ఈసెట్, పీజీసెట్ల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ఈసెట్, పీజీసెట్ల షెడ్యూళ్లు ఖరారయ్యాయి. ఈ రెండు సెట్ల బాధ్యతలు చూస్తున్న కమిటీలు గురువారం ఉన్నత విద్యా మండలిలో సమావేశమై షెడ్యూళ్లను ఖరారు చేశాయి. ఈ నెల 8వ తేదీన ఈ సెట్ల నోటిఫికేషన్లు వెలువడతాయి. ఈసెట్ దరఖాస్తులు 9 నుంచి, పీజీసెట్ దరఖాస్తులు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు సెట్లకు దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాలి. ఈసెట్‌కు దరఖాస్తు రుసుము రూ.250గా నిర్ణయించారు. పీజీసెట్ దరఖాస్తు రుసుము రూ.500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ఈసెట్‌కు కొత్తగా ప్రొద్దుటూరులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీజీసెట్‌కు కాకినాడ కేంద్రంగా రీజనల్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఈ సమావేశంలో ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ లాల్ కిషోర్, కన్వీనర్ ప్రొఫెసర్ బి.భానుమూర్తి, పీజీసెట్ చైర్మన్ డాక్టర్ బి.ప్రభాకర్‌రావు, కన్వీనర్ జీవీఆర్ ప్రసాదరాజు, మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు. -
మే 10న ‘ఈసెట్-2014’
నేడు నోటిఫికేషన్ విడుదల ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కాకినాడ, న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)ను వరుసగా మూడోసారి కూడా జేఎన్టీయూ కాకినాడ నిర్వహించనుంది. సోమవారం జరిగిన ఈసెట్ కమిటీ సమావేశం కాకినాడ జేఎన్టీయూలో జరిగింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.విజయ్ ప్రకాష్, కార్యదర్శి ప్రొఫెసర్ కె.సతీష్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఈసెట్ అడ్మిషన్ల చీఫ్ క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ కె.రఘునాథ్, కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు, కమిటీ సభ్యుడు అజయ్ జైన్, డీఈ డాక్టర్ వి.రవీంద్ర పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్, వర్సిటీ వీసీ డాక్టర్ తులసీరామ్‌దాస్ విలేకరులకు తెలిపారు. మే 10న అనంతపురం, గుంటూరు, హైదరాబాద్ 1, 2, కాకినాడ, నిజామాబాద్, కరీంనగర్, తిరుపతి, విశాఖ, విజయవాడ, వరంగల్, విజయనగరంలలో 78 కేంద్రాల్లో ఈసెట్ జరుగుతుంది. ఈనెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అనుమతించనున్నారు. పరీక్ష రుసుము రూ.300 కాగా అపరాధ రుసుము లేకుండా మార్చి 29 వరకు దరఖాస్తులను అనుమతిస్తారు. ఆపై రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.1,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తులను అనుమతిస్తారు. మే 2 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.