breaking news
Duraimurugan
-
ప్రభుత్వ లిక్కర్ కిక్కెక్కట్లేదు : మంత్రి కామెంట్స్
చెన్నై: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో(టాస్మాక్షాపులు) దొరికే లిక్కర్‌తో కిక్కు సరిపోక ప్రజలు సారా(అరకు) తాగుతున్నారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టాన్ని బలోపేతం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా దురైమురుగన్ మాట్లాడారు. టాస్మాక్ మద్యం దుకాణాల్లో దొరకే మందు కొందరికి సాఫ్ట్ డ్రింక్‌లా అనిపిస్తోందన్నారు. తమిళనాడులో పూర్తిగా మద్యాన్ని నిషేధించడం కుదరదని స్పష్టం చేశారు. పొరుగు స్టేట్స్లో మద్యం దొరుకుతున్నపుడు తమిళనాడులో పూర్తి మద్య నిషేధం అమలు చేయడం సాధ్యం కాదన్నారు.రోజంతా కష్టపడి పనిచేసుకునేవాళ్లు అలసట మరిచిపోయి నిద్రపోవాలంటే మద్యం అవసరమన్నారు. కాగా, దురైమురుగన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వ అసమర్థత వల్లే ఇటీవల కల్లకురిచిలో కల్తీసారా తాగి చాలా మంది మరణించారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మండిపడ్డారు. -
ఆస్పత్రిలో దురైమురుగన్
► గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిక ► అపోలో వద్దకు డీఎంకే నేతలు సాక్షి, చెన్నై : డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత, సీనియర్ నాయకుడు దురైమురుగన్ గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎంకే వర్గాలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. డీఎంకేలోని సీనియర్ నాయకుల్లో దురైమురుగన్ ముఖ్యుడు. అధికారంలోకి వచ్చినప్పుడుగానీ, పార్టీ పరంగాగానీ, ప్రతి పక్షంలో ఉన్నా గానీ, ఆయనకు ప్రాధాన్యతను ఆ పార్టీ అధిష్టానం ఇవ్వడం జరుగుతున్నది. దీంతో డీఎంకేలో కరుణానిధి, అన్భళగన్, స్టాలిన్ తదుపరి స్థానాన్ని ఆయనకు కేటాయించారు. మంచి వాక్చాతుర్యం , పరిస్థితులకు అనుగుణంగా స్పందించే తత్వం కల్గిన దురైమురుగన్ డీఎంకే కార్యదర్శి, శాసనసభా పక్ష ఉప నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం తిరుచ్చిలో జరగనున్న ఓ కార్యక్రమం నిమిత్తం చెన్నైలోని ఇంటి నుంచి విమానాశ్రయానికి బయలు దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయన సృ్పహ తప్పి కింద పడ్డారు. దీనిని గుర్తించిన భద్రతా సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, ఆగమేఘాలపై అంబులెన్సలో అపోలో ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు రావడంతోనే ఆయన సృ్పహ తప్పినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. దురైమురుగన్ను విమానాశ్రయం నుంచి అపోలో ఆసుపత్రికి తరలించిన సమాచారంతో డీఎంకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. హుటాహుటిన ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, నేతలు రాజ, జగత్క్ష్రకన్లతో పాటు పలువురు నేతలు అక్కడికి పరుగులు తీశారు. వైద్యులతో సంప్రదింపులు జరిపి, దురైమురుగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.