breaking news
Dr. Kamineni Srinivas
-
అమరావతిలో ‘ఎస్ఆర్ఎంకు’ 200 ఎకరాలు
- మంత్రి కామినేని వ్యాఖ్య సాక్షి, చెన్నై ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి అమరావతిలో రెండు వందల ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించినట్టు డాక్టర్ కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చెన్నైలోని ఆ వర్సిటీ క్యాంపస్‌కు దీటుగా అమరావతిలో క్యాంపస్ నిర్మాణం జరుగనున్నదన్నారు. చెన్నై శివారులోని ఎస్ఆర్ఎం వర్సిటీలో గురువారం బయో యంత్ర-2016 సదస్సు జరిగింది. ఇందులో మంత్రి కామినేని ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక వైద్యపరిజ్ఞానం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు తగ్గట్టు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నామన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో అమరావతిలో సరికొత్త రాజధాని నిర్మాణం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఇక, ఈ రాజధానిలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం క్యాంపస్ ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. ఇక్కడ ఆ సంస్థకు కనిష్ట ధరకు రెండు వందల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందులో చెన్నై క్యాంపస్‌కు దీటుగా అత్యాధునికతను చాటుకునే విధంగా క్యాంపస్ నిర్మాణానికి ఆ వర్సిటీ చాన్స్‌లర్ పచ్చముత్తు పారివేందర్ చర్యలు తీసుకుంటుండడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని తెలుగు వారందరూ పుష్కరాలకు తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. -
ఐదు ‘రక్షాకవచాలు’ ఒకే టీకాలో..
కాకినాడ క్రైం: శిశువుల సమగ్ర ఆరోగ్యరక్షణకు కేంద్రం సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా క్షయ, పోలియో, కోరింతదగ్గు, కంఠసర్పి, ధనుర్వాతం, పచ్చకామెర్లు, పొంగు వంటి వ్యాధులు రాకుండా ప్రస్తుతం వేస్తున్న అయిదు వ్యాక్సిన్లు (టీకాలు) స్థానంలో ఒకే వాక్సిన్ ‘పెంటా వేలెంట్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను 6, 10, 14 వారాల వయసులో ఇంజక్షన్ రూపంలో తప్పనిసరిగా చిన్నారులకు వేయించాలి. ఇందుకు జిల్లాలోని 109, విలీన మండలాల్లోని ఎనిమిది శీతలీకరణ కేంద్రాల్లో వేక్సిన్‌ను అందుబాటులో ఉంచారు. కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం కాకినాడ పర్లోపేటలోని ఏఎంజీ స్కూల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఈ వ్యాక్సిన్‌తో జిల్లాలోని 79,979 మంది శిశువులు ఈ ఏడాది రక్షణ పొందుతారని జిల్లా యంత్రాంగం అంచనా. పెంటావేలెంట్ టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ఆయా పీహెచ్‌సీలకు, ఆరోగ్యకేంద్రాలకు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది, వైద్యాధికారులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కూడా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెంటా వేలెంట్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. చిన్నారులను రక్షించండి .. ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించే బాధ్యత తల్లిదండ్రులతోపాటు సమాజంలో ప్రతీ ఒక్కరిపై ఉంది. దగ్గరలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేదా ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో ఈ టీకాలు ఉచితంగా లభిస్తాయి. పిల్లలకు వేరుుంచే టీకాల వివరాలను ఎంసీపీ రికార్డుపై నమోదు చేయించాలి. -డాక్టర్ అనిత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి