క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడీ
చెన్నై: సింగిల్స్‌లో శుభారంభం చేసిన భారత టెన్నిస్ యువతార రామ్‌కుమార్ రామనాథన్ డబుల్స్ విభాగంలోనూ మెరిశాడు. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లో 2-6, 7-6 (7/5), 10-5తో నాలుగో సీడ్ అర్తెమ్ సితాక్-మార్కస్ డానియల్ (న్యూజిలాండ్)పై సంచలన విజయం నమోదు చేశాడు.
స్పెయిన్‌లో శిక్షణ పొందే రామ్‌కుమార్, జర్మనీలో ప్రాక్టీస్ చేసే బాలాజీ డబుల్స్ మ్యాచ్‌లో సమన్వయంతో రాణించారు. తొలి సెట్‌ను చేజార్చుకున్నా, రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్నారు. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో రామ్‌కుమార్-బాలాజీ జంట పైచేయి సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో డబుల్స్ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్-జీవన్ (భారత్) ద్వయం 4-6, 6-3, 10-5తో ని కొలస్ (అమెరికా)-కాస్టిలో (చిలీ) జంటను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది.
మరోవైపు సింగిల్స్ రెండో రౌండ్లో రామ్‌కుమార్‌తో ఆడాల్సిన ప్రపంచ 12వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో అండర్సన్ స్థానంలో కుద్రయెత్సెవ్ (రష్యా)కు చోటు లభించింది. గురువారం జరిగే మ్యాచ్‌లో కుద్రయెత్సెవ్తో రామ్‌కుమార్ ఆడతాడు.