breaking news
deputation extension
-
టీటీడీ ఈవో ధర్మారెడ్డి సర్వీసు రెండేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి/తిరుమల: టీటీడీ ఈవో (ఎఫ్ఏసీ) ఏవీ ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఆయన డెప్యుటేషన్‌ను మరో రెండేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల విన్నవించింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి ఏవీ ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను పొడిగించింది. 2022, మే 14 నుంచి రెండేళ్లపాటు ఆయన డెప్యుటేషన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ –ట్రైనింగ్ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఆయన ఏడేళ్లుగా డెప్యుటేషన్‌పై ఉన్నారు. టీటీడీలో ధర్మారెడ్డి తెచ్చిన సంస్కరణలు.. ► భక్తులకు మహాలఘు దర్శనం, భక్తులు కోరుకున్న అన్ని లడ్డూలు, పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం, వసతి గదుల నిర్మాణం, అతి పెద్ద అన్నప్రసాద సముదాయం, దళారీల ఏరివేతలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ► శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి రెండేళ్లలో రూ.360 కోట్లను భక్తుల నుంచి విరాళాలుగా స్వామి వారికి అందించారు. ► వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో 1,000కి పైగా ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ► కొత్త అన్నదానం కాంప్లెక్స్ (రూ.30 కోట్లు) నిర్మాణం రోజువారీ భోజన సామర్థ్యాన్ని రోజుకు 10 వేల నుంచి లక్షకు పైగా పెంచారు. ► మాడ వీధులను విస్తరించి వాటి చుట్టూ గ్యాలరీలను నిర్మించారు. దీంతో రథసప్తమి, బ్రహ్మోత్సవాలు మొదలైన ప్రత్యేక రోజుల్లో 2 లక్షల మంది యాత్రికులు ఊరేగింపు దేవతలను చూసేందుకు వీలు కలుగుతోంది. ► ఆర్జిత సేవల టికెట్లను కంప్యూటరీకరించారు. ► 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతుల ఆమోదంతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించారు. ► విరాళం ప్రాతిపదికన అలిపిరి ఫుట్‌పాత్ (రూ.25 కోట్లు)పై పైకప్పు పునర్నిర్మించారు. è బర్డ్ ఆసుపత్రిలో సేవల పరిధిని విస్తరించారు. -
డీఎండబ్ల్యూవోల డిప్యుటేషన్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఏడుగురు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు(డీఎండబ్ల్యూవో)కు మరో ఏడాదిపాటు డిప్యుటేషన్‌ను పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్లను గతేడాది ఏడాది కాలం కోసం డిప్యుటేషన్‌పై మైనార్టీ సంక్షేమ శాఖకు కేటాయించారు. ప్రస్తుతం డీఎండబ్ల్యూవోలుగా పనిచేస్తున్న ఆర్.కుముదిని(ఖమ్మం), ఎస్.శిరీషా(మహబూబ్‌నగర్), శ్రీరాములు(నల్లగొండ), చంద్రశేఖర్(నిజామాబాద్), భాగ్యమ్మ(వరంగల్), కె.లక్ష్మీకిరణ్(ఏపీఎంఎఫ్‌సీ), బి.హరిప్రియ (ఏపీ వక్ఫ్‌బోర్డు లీగల్ ఓఎస్డీ)ల డిప్యుటేషన్ గడువు ముగిసింది. దీంతో మరో ఏడాదిపాటు పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.