breaking news
Delhi batsman
-
యశ్ ధుల్ వీర విజృంభణ.. డబుల్ సెంచరీతో చెలరేగిన ఢిల్లీ డైనమైట్
Yash Dhull Scores Double Century: అండర్-19 ప్రపంచకప్ 2022లో యువ భారత్‌ను జగజ్జేతగా నిలిపిన యశ్ ధుల్.. అరంగేట్రం రంజీ సీజన్లోనే అదరగొడుతున్నాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(113, 113 నాటౌట్) సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ధుల్.. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన డబుల్ సెంచరీ (200; 26 ఫోర్లు)తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ అమన్‌దీప్ కారే (156 నాటౌట్), శశాంక్ సింగ్ (122) శతకాలతో రాణించడంతో 482/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 295 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. ఈ క్రమంలో యశ్ ధుల్, దృవ్ షోరే (100; 13 ఫోర్లు), నితీశ్ రాణా (57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి, మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ధుల్ 29 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ధుల్ 479 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి. చదవండి: శతకం చేజార్చుకున్న ఉస్మాన్ ఖ్వాజా.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ -
జవాన్లే హీరోలు: కోహ్లి
న్యూఢిల్లీ: స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రచారకర్తగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో అధికారులు అతనికి క్యాప్‌ను బహూకరించారు. స్వల్ప స్థాయిలో క్రికెటర్లు దేశానికి సేవ చేస్తున్నా... నిజమైన హీరోలు మాత్రం బీఎస్ఎఫ్ జవాన్లేనని ప్రశంసలు కురిపించాడు. వాళ్ల వల్లే దేశంలో తాము సురక్షితంగా ఉండగలుగుతున్నామని కితాబిచ్చాడు. ‘దేశ సరిహద్దుల్లో ఉన్న అన్ని బీఎస్ఎఫ్ యూనిట్లను సందర్శించే అవకాశం నాకు దక్కింది. ఇక జవాన్లను నేరుగా కలుస్తా. సుదీర్ఘ కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశానికి సేవ ఎలా చేయగలుగుతున్నారో తెలుసుకుంటా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవడంలో తాను విజయవంతమయ్యానని చెప్పిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ ప్రస్తుతం చాలా పరిణతితో వ్యవహరిస్తున్నానని తెలిపాడు.