breaking news
CTOs
-
భారీ షాక్, జొమాటోకు సీటీవో గుంజన్ గుడ్ బై!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ కోఫౌండర్, సీటీవో గుంజన్ పటిదార్ తన పదవికి రాజీనామా చేశారు. స్టార్టప్ నుంచి మార్కెట్ కేపిటల్ వేలకోట్ల విలువైన సంస్థగా జొమాటోను తీర్చిదిద్దిన వారిలో పటిదార్ ఒకరంటూ మార్కెట్ రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జొమాటో తెలిపింది. గత పదేళ్లకుపైగా గుంజన్ తన సామర్ధ్యంతో సంస్థ కేపిటల్ వ్యాల్యూని,విలువల్ని పెంచేలా టెక్నాలజీ, మహిళా ఉద్యోగుల్ని నిష్ణాతులైన నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇలా ఆయన సంస్థకు చేసిన సేవలు వెలకట్టలేవని ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే కంపెనీ నుంచి ఎందుకు నిష్క్రమిస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. తలోదారి చూసుకుంటున్నారు సంస్థ పనితీరు, కోవిడ్ భయాలు, ఆర్ధిక మాంద్య ప్రభావం..లేదంటే ఇతర కారణాలు కావొచ్చు. గతేడాది నుంచి జొమాటోలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగులు ఆ సంస్థ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. తలోదారి చూసుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో గతేడాది నవంబర్‌లో మరో కోఫౌండర్ మోహిత్ గుప్తా జొమాటోకు గుడ్‌బై చెప్పారు. నాలుగున్నరేళ్ల క్రితం జొమాటోలో చేరిన గుప్తా..2020లో దాని ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈఓ పదవి నుంచి సహ వ్యవస్థాపకుడిగా ప్రమోషన్ పొందారు. ఇప్పటికే ఇంటర్సిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్,సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తాలు రాజీనామా చేసిన వారిలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
బెజవాడ రెస్టారెంట్లలో సీటీవోల తనిఖీలు
విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖాధికారులు గురువారం నగరంలోని 15 రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విజయవాడ రాజధానిగా మారినప్పటికీ రెస్టారెంట్ల నుంచి పన్నుల రాబడి పెరగకపోవడంతోపాటు పుష్కరాల సందర్భంగా ఆశించిన రాబడి రాకపోవడంతో ఆగ్రహించిన ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సీటీవో స్థాయి అధికారుల్ని 15 బృందాలుగా ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. బందరురోడ్డు, ఏలూరురోడ్డు, మొగల్రాజపురంలోని రెస్టారెంట్లతో పాటు రెండు మూడు బ్రాంచీలు కలిగిన రెస్టారెంట్లపైన అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు జరిగాయి. పుష్కరాల్లో అంత సీన్ లేదు పుష్కరాల సందర్భంగా రెస్టారెంట్లలో ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పుష్కరాల రోజుల్లో అక్షయప్రాత, టీటీడీ, దుర్గగుడి వంటి ధార్మిక సంస్థలు పెద్దఎత్తున అన్నదాన ప్రసాదాలు వితరణ చేశాయని, అనేక స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేయడంతో కొన్ని రెస్టారెంట్లు సాధారణ రోజుల్లో కంటే తక్కువ వ్యాపారాలు చేసినట్లు తెలిసింది. అందువల్లనే పన్నులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ కట్టలేదు. ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న ఒకటి, రెండు రెస్టారెంట్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.