breaking news
cruel husband
-
భార్య అందంగా లేదని...
-
భార్య అందంగా లేదని...
విజయవాడ: అందంగా లేదంటూ భార్యను అంతమొందించేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త. విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలు.... అనుపమ్, శిరీషకు రెండేళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఆరు నెలల పాప ఉంది. భార్య అందంగా లేదన్న కారణంతో మంగళవారం ఉదయం శిరీషపై కిరోసిన్ పోసి నిప్పటించి చంపేందుకు ప్రయత్నించాడు. మంటల్లో చిక్కుకున్న శిరీష భర్తను పట్టుకోవడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. శిరీషకు దాదాపు ఒళ్లంతా కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అనుపమ్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. పెళ్లికి ముందే అనుపమ్ కు ఓ అమ్మాయితో పరిచయం ఉందని తెలిసింది. పెళ్లైన తర్వాత కూడా అతడు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే శిరీషపై అతడు హత్యాయత్నం చేసినట్టు సమాచారం.