breaking news
Crime Branch officers
-
మీడియా వార్తలు.. నిలదీసిన వర్మ
సాక్షి, సినిమా : సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల విచారణలో జీఎస్టీని అసలు తాను తీయలేదని వర్మ చెప్పాడంటూ కొన్ని ప్రముఖ మీడియా ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ చిత్ర తెరకెక్కించిన ఘనత తనకే దక్కినప్పుడు.. అందులో తాను భాగస్వామిని కాలేదన్న విషయాన్ని ఎలా ప్రచురిస్తారంటూ నిలదీస్తున్నాడు. ‘అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్న కొందరు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ను అసలు తాను తీయలేదని.. కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించానని చెబుతున్నారు. సినిమా తెరెక్కించిన ఘనత నాదే అయినప్పుడు ఆ వార్తలను నేను ఖండించకుండా ఎలా ఉంటా?’ అని వర్మ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈమేరకు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. కాగా, వర్మ తాను అసలు జీఎస్టీ తీయలేదని.. కేవలం స్క్రిప్టు మాత్రమే అందించానని విచారణలో వెల్లడించినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాయగా.. నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడంటూ మరికొన్ని కథనాలు ప్రచురించాయి. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియో, మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు అందుకున్న వర్మ గత శనివారం సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యాడు. సుమారు 3గంటలకు పైగా వర్మను విచారించిన పోలీసులు ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను సీజ్ చేసి మళ్లీ ఈ శుక్రవారం(23వ తేదీ) విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. For all those false news circulating that I have denied making #GodSexTruth,its only a production and technical process that I was detailing ..How can I deny when I am credited in the film? https://t.co/eJrULnCBUJ — Ram Gopal Varma (@RGVzoomin) 19 February 2018 -
అత్యాచారం కేసులో డీఐజీపై చార్జిషీటు
ముంబై: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై కేసు నమోదైన 9 నెలల తర్వాత చార్జిషీటు దాఖలైంది. డీఐజీ సునీల్ పరాస్కర్ (57) పై బోరివలీ కోర్టులో 724 పేజీల చార్జిషీటు దాఖలు చేసినట్లు క్రైం బ్రాంచ్ అధికారులు తెలిపారు. 58 మంది సాక్ష్యులు, ఫిర్యాదుదారుల వాంగ్మూలాలతో కూడిన అభియోగపత్రాన్ని మంగళవారం మెజిస్ట్రేట్ ముందుంచారు. తదుపరి విచారణ కోసం కేసును సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. జూన్ 12న కోర్టుకు సునీల్ పరాస్కర్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. 2013 డిసెంబర్లో తనపై పరస్కార్ అత్యాచారం చేశారని 25 ఏళ్ల మోడల్ ఆరోపించింది. ఈ మేరకు గతేడాది జూలైలో పరాస్కర్‌పై మాల్వాణీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పలు సెక్షన్ల కింద నమోదైంది. అయితే అరెస్ట్‌కు ముందే మహిళా ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లుందని ఆ బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు పేర్కొంది. వివరాలు.. 2012లో పరాస్కర్ అదనపు కమిషనర్‌గా ఉండగా ఓ కేసుకు సంబంధించి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.