breaking news
contract termination
-
ఆయనతో ప్రియాంక తెగదెంపులు
సాక్షి, ముంబై : ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ, దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణ నేపథ్యంలో నీరవ్ మోదీ జువెల్లరీలకు బ్రాండు అంబాసిడరీగా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆయనతో తెగదెంపులు చేసుకున్నారు. నీరవ్ మోదీ బ్రాండుతో ఉన్న కాంట్రాక్ట్‌ను ప్రియాంక చోప్రా రద్దు చేసుకున్నట్టు ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనిపై కొన్ని రోజుల క్రితమే ప్రియాంక న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారని ఆమె వ్యక్తిగత కార్యదర్శి పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రియాంక చోప్రా హీరో సిధార్థ్ మల్హోత్రాతో కలిసి నీరవ్ మోదీకి చెందిన జువెల్లరీ కంపెనీ ప్రకటనలో నటించారు. ఇందుకు సంబంధించి పారితోషకాన్ని సదరు కంపెనీ పూర్తిగా చెల్లించలేదు. ఇంతలోనే నీరవ్ మోదీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె సదరు కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసేసుకున్నారు. -
నీరవ్ మోదీపై నటి దావా.. అంతా ఉత్తదే!
సాక్షి, ముంబై : ప్రముఖ వజ్రాల వ్యాపారి, పంజాబ్ బ్యాంక్‌ను నిలువునా ముంచిన నీరవ్ మోదీపై దావా వేసినట్లు వస్తున్న వార్తలపై నటి ప్రియాంక చోప్రా స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నీరవ్‌కు చెందిన డైమండ్ కంపెనీపై దావా వేసిన వార్త అవాస్తవం’ అని అందులో ఆమె పేర్కొన్నారు. అయితే భారీ కుంభకోణం బయటపడిన నేపథ్యంలో ఆ కంపెనీతో ఆమె చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో మాత్రమే ఉన్నారని.. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల సలహాను ఆమె తీసుకుంటున్నారని ప్రియాంక వ్యక్తిగత కార్యదర్శి శుక్రవారం మీడియాకు తెలియజేశారు. గతంలో ప్రియాంక చోప్రా హీరో సిధార్థ్ మల్హోత్రాతో కలిసి నీరవ్ మోదీకి చెందిన నగల కంపెనీ ప్రకటనలో నటించింది. ఇందుకు సంబంధించి పారితోషకాన్ని సదరు కంపెనీ పూర్తిగా చెల్లించలేదు. ఇంతలోనే నీరవ్ మోదీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె సదరు కంపెనీపై దావా వేసేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి. -
ఇన్ఫోసిస్‌కు ఆర్బీఎస్ షాక్..
♦ భారీ కాంట్రాక్టు రద్దు ♦ ఆరు నెలల్లో 3వేల ఉద్యోగాలకు ముప్పు బెంగళూరు: భారీ కాంట్రాక్టును రద్దు చేసుకుంటూ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) ఇన్ఫోసిస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇన్ఫోసిస్‌లో మూడు వేల ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందని, వచ్చే ఆరు నెలల కాలంలో 4 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రిటన్ వరకు విలియమ్స్ అండ్ గ్లిన్ (డబ్ల్యూ అండ్ జీ) బ్యాంకును ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆర్బీఎస్ ఉపసంహరించుకోవడమే కాంట్రాక్టు రద్దుకు దారితీసింది. విలియమ్స్ అండ్ గ్లిన్ ఏర్పాటుకు సంబంధించి ఇన్ఫోసిస్, ఐబీఎం కంపెనీలకు 30 కోట్ల డాలర్ల విలువైన ఐదేళ్ల కాంట్రాక్టును ఆర్బీఎస్ కేటాయించింది. ఇందులో 20 కోట్ల డాలర్ల మేర వ్యాపారం ఇన్ఫోసిస్ నిర్వహించాల్సి ఉంది. కాగా, తాజా పరిణామంపై ఇన్ఫోసిస్ శనివారం ఓ ప్రకటన చేసింది. 3వేల మందికి కోత... విలియమ్స్ అండ్ గ్లిన్ కార్యక్రమానికి సంబంధించి సలహా, అప్లికేషన్ డెలివరీ, టెస్టింగ్ సేవలు అందించేందుకు గాను ఇన్ఫోసిస్ భాగస్వామిగా ఉంది. ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేయరాదన్న ఆర్బీఎస్ నిర్ణయం ఫలితంగా వచ్చే కొన్ని నెలల్లో 3,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది భారత్ నుంచే ఉంటారు’ అని ఇన్ఫోసిస్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఆర్బీఎస్ కాంట్రాక్టు రద్దుతో ఎంత ఆదాయం కోల్పోయే విషయాన్ని ఇన్ఫోసిస్ చెప్పలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్ల డాలర్ల ఆదాయంపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐబీఎం మాత్రం తనకు సంబంధించిన కాంట్రాక్టులో అధిక భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఊహించని పరిణామం ఆర్బీఎస్ కంపెనీ ద్వారా మూడేళ్ల కాలంలో రానున్న ఆదాయంపై ఇన్ఫోసిస్ ఇటీవలే ఓ కార్యాచరణ రూపొందించుకుంది. ఏటేటా ఆదాయంలో 15 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఇంతలోనే ఆర్బీఎస్ తీసుకున్న నిర్ణయంతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... అతి తక్కువ వడ్డీ రేట్ల విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకులు, ఆర్థిక సేవల కంపెనీలకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు బ్రెగ్జిట్ పరిణామం ఆర్బీఎస్ వంటి బ్యాంకులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పరిణామాలతో ఐటీ కంపెనీల బ్యాంకింగ్ సేవల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల అంచనా. అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ 2016లో ఆదాయ అంచనాలను రెండు సార్లు తగ్గించడంతోపాటు, ఆర్థిక సేవల విభాగంలో గడ్డు పరిస్థితులే ఇందుకు కారణంగా పేర్కొనడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మార్పు ఫలితమే ఇది... ఆర్థిక సేవల రంగం మార్పు చెందే దశలో ఉంది. దీంతో బ్యాంకులు అవుట్సోర్స్పై వెచ్చించే వ్యయాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్బీఎస్ విషయానికి వస్తే ఈ ఏడాదిలో 80 కోట్ల పౌండ్ల ఖర్చును తగ్గించుకునే పనిలో ఉంది. - జిమిత్ అరోరా, బ్యాంకింగ్, ఆర్థిక సేవల విభాగం అధిపతి, ఎవరెస్ట్ గ్రూప్ నిర్వహణ లోపమే... ఆర్బీఎస్ ఏళ్ల కొద్దీ నిర్వహణ లోపం ఫలితంగా మూల్యం చెల్లించుకుంటోంది. బ్రెగ్జిట్ కారణంగా విలియమ్స్ అండ్ గ్లిన్ ఆలోచనను పక్కన పెట్టింది. వ్యయాలను తగ్గించుకోవడం అత్యంత ప్రాధాన్య అంశంగా మారిపోయింది. - టామ్ర్యూనర్, ఎండీ, హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్