breaking news
complited
-
డయల్ 100కు ఏడేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఆపద వచ్చినా.. అందరికీ గుర్తుకు వచ్చే నంబరు డయల్ 100. ఈ డయల్ 100 కంట్రోల్ రూముకు శనివారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013 ఏప్రిల్ 11న ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత దీన్ని కూడా విభజించారు. కేవలం నేరాలకు సంబంధించిన కాల్స్ మాత్రమే కాదు.. రోడ్డు ప్రమాదాలు, తగాదాలు, చోరీలు, కొట్లాటలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అగ్ని ప్రమాదాలు ఇలా సమస్య ఏదైనా ముందు ఫోన్ వెళ్లేది ‘100’కే. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో అత్యంత కీలకమైనది డయల్ 100. అందుకే, ఇక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం చాలా అప్రమత్తంగా ఉంటారు. ప్రతి కాల్ని వెంటనే రిసీవ్ చేసుకుంటారు. అందులో కొన్ని అనవసరమైనవి, బ్లాంక్ కాల్స్, ఫేక్ కాల్స్, చిన్నపిల్లలు, ఆకతాయిలు చేసే కాల్స్ అలా అనేక రకమైన కాల్స్ వస్తుంటాయి. 2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్.. ఈ ఏడేళ్లలో కంట్రోల్ రూము సిబ్బంది 15.9 కోట్లు, అంటే దాదాపుగా 16 కోట్ల ఫోన్ కాల్స్ స్వీకరించారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 62 వేల కాల్స్, గంటకు 2,597, నిమిషానికి 43 కాల్స్ చొప్పున కంట్రోల్ రూముకు కాల్స్ వెళ్తున్నాయి. 2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్ వచ్చాయి. అంటే రోజుకు 1.25 లక్షల కాల్స్ ఆన్సర్ చేశారన్నమాట. మూడు షిఫ్టుల్లో పని చేసే ఈ సిబ్బందికి ఆ ఏడాది మొత్తం నిమిషానికి 86 కాల్స్‌కు పైగానే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ కాల్స్‌కు స్పందించిన సిబ్బంది వెంటనే బాధితులు ఎక్కడున్నారో కనుక్కుని వారికి తక్షణ సాయం అందజేశారు. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఫోన్ కాల్స్‌ని విశ్లేషిస్తే.. 2018 నుంచి తగ్గాయి. కానీ, అత్యవసర కాల్స్ పెరగడం గమనార్హం. పోలీసులకు సమాచారం అందించేందుకు ఫోన్లు, హాక్ ఐ, సోషల్ మీడియా మాధ్యమాలు పెరగడం ఇందుకు కారణం. ఏడేళ్లలో డయల్ 100కు వచ్చిన కాల్స్ వివరాలు -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
– గత పాలకులు నాగర్‌కర్నూల్‌ను వెనక్కి నెట్టారు – ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుస్తాం – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి కంటే సాగునీరు రావడంతో ఈ ప్రాంతంలోని రైతాంగం అంతకన్న ఎక్కువ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని అన్నారు. మండలంలో కేఎల్ఐ 40వ కిలోమీటరు నుంచి 85వ కిలోమీటరు వరకు పెండింగ్‌లో ఉన్న కాల్వ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ కేఎల్ఐ ద్వారా చెరువులు, కుంటలు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. గత పాలకుల వల్ల నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వెనక్కి నెట్టేయబడిందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా తెలంగాణ సర్కారు ఉంటే జిల్లాలో రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రా నాయకుల పాలనలో ఎన్నికలకు ముందు, తర్వాత ప్రాజెక్టుల వద్ద కొబ్బరికాయలు కొట్టి తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నారని, వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రైతులు సాగునీరు తెచ్చుకునేందుకు తొందరపడి కాల్వ గట్టు, బ్యాంకింగ్‌లను తొలగించవద్దని, నీరు వచ్చే ప్రతి ప్రాంతానికి నీరు తెస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఇరిగేషన్ సీఈ ఖగేందర్, డీఈ లోకిలాల్, ఎస్పీఎం వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, గంగనమోని కిరణ్, మహమూద్‌ఖాన్, సర్పంచ్‌లు సుమలత, జ్యోతి, ఎంపీటీసీలు యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, సరస్వతమ్మ తదితరులు ఉన్నారు కృష్ణమ్మకు పూజలు కేఎల్ఐ మూడవ లిప్టు ద్వారా నింపిన వడ్డెమాన్ భీమా సముద్రం, పాలెం పల్లెకుంటలో మంత్రి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు.