breaking news
chirala beach
-
బీచ్‌లో బాలయ్య సందడి.. భార్యతో కలిసి జీప్ డ్రైవింగ్.. వీడియో వైరల్
అఖండ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ఈ సారి సంక్రాంతి వేడుకను తన సోదరి పురందేశ్వరి ఇంట్లో జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లిన బాలయ్య.. గత రెండు రోజులుగా అక్కడే సందడిగా గడుపుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం గుర్రం ఎక్కి హంగామా చేసిన బాలయ్య.. ఆదివారం ఉదయం చీరాల బీచ్‌లో హల్చల్ చేశారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా చీరాల చీచ్కు వెళ్లారు బాలయ్య. ఈ సందర్భంగా బాలకృష్ణ ఓపెన్ టాప్ జీప్‌ను నడిపారు. భార్య వసుంధర ఫ్రంట్సీట్లో కూర్చోగా.. తాను వేగంగా జీప్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వ్యభిచార వృత్తిలోకి విద్యార్థినులు !!
చిన ముంబైగా పేరుగాంచిన చీరాల ఇప్పుడు వ్యభిచారంలో కూడా మొదటి స్థానంలో ఉంది. సముద్రతీర ప్రాంతాల్లోని రిసార్టుల్లో గుట్టుచప్పుడు కాకుండా అనలేంగానీ బహిరంగంగానే వ్యభిచారం జరుగుతోంది. ఎప్పటిలాగే పోలీసులు అడపాదడపా తనిఖీలు నిర్వహించి చిన్నాచితక వ్యభిచారిణులు, విటులను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగంగా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్న పెద్దోళ్లు మాత్రం తప్పించుకుంటున్నారు. గుంటూరు, విజయవాడ, నరసరావుపేట వంటి నగరాల నుంచి విద్యార్థినులు కూడా వచ్చి పొడుపు వృత్తి సాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చీరాల.. సంప్రదాయాలకు, చేతివృత్తులకు ప్రధాన కేంద్రం. అంతేకాదు వస్త్ర వ్యాపారంలో రెండో ముంబైగా పేరుగాంచింది. ఇప్పుడు వ్యభిచారంలో కూడా చీరాల వార్తల కెక్కుతోంది. సముద్రతీర ప్రాంతంలో రిసార్టుల ముసుగులో పెద్దఎత్తున హైటెక్ వ్యభిచారం నిర్విరామంగా సాగుతోంది. పోలీసుల రైడింగ్‌లో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్న పెద్ద పెద్దోళ్లు తప్పించుకుంటుంటే సామాన్యులు చిక్కుతున్నారు. ముఖ్యంగా వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, గెస్ట్‌హౌస్‌ల్లో నిత్యం గాజుల మోత మార్మోగుతోంది. ఇటీవల ఒక్క టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో వ్యభిచారం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తపేటలో రోజుకోరకంగా వ్యభిచారం సాగుతోంది. సెలవు రోజుల్లో కాస్త సేద తీరేందుకు కుటుంబ సమేతంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటైన గెస్ట్‌హౌస్‌లు ఇప్పుడు వ్యభిచార కేంద్రాలుగా మారిపోయాయి. ఒకప్పుడు చాటుమాటున జరిగే వ్యభిచారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కింది. గతంలో వారాంత రోజులైన శని, ఆదివారాల్లో మాత్ర మే వ్యభిచారం జరిగేది. ప్రస్తుతం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నరసరావుపేటలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం చీరాలలోని వాడరేవు, రామాపురాల్లోని గెస్ట్‌హౌస్‌లకు కొందరు జల్సా చేసేందుకు వస్తున్నారు. వ్యభిచారం ఏ స్థాయిలో జరుగుతోందంటే రెండు నెలల కాలంలో చీరాల టూటౌన్, రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలోనే 12 కేసులు నమోదుకాగా 18 జంటలను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. విద్యార్థినులే అధికం చీరాల వాడరేవులో ఉన్న అన్నీ గెస్ట్‌హౌస్‌ల్లో వ్యభిచారం కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, కొందరు వ్యాపారులు ఎక్కువగా వస్తుంటారు. అన్ని సౌకర్యాలతో పాటు జూదం, వ్యభిచారం చేసుకొనేందుకు గెస్ట్‌హౌస్‌లు అనుకూలంగా ఉన్నాయి. దీనికితోడు పోలీసుల దాడులు కూడా పెద్దగా లేకపోవడంతో రోజురోజుకూ వ్యభిచారం ఎక్కువైంది. వివిధ ప్రాంతాల నుంచి కేవలం వ్యభిచారం చేసేందుకే విటులు ఇక్కడికి వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యభిచారిణుల్లో విద్యార్థినులే అధికంగా వస్తుండటం గమనార్హం. వాడరేవులోని మూడు గెస్ట్‌హౌస్‌లపై ఈపూరుపాలెం ఎస్సై రాంబాబు ఆదివారం దాడి చేశారు. విజయవాడ, గుంటూరుకు చెందిన మూడు జంటలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాయి. నెల క్రితం వాడరేవు, కొత్తపేటలో పోలీసులు దాడులు చేయగా నాలుగు జంటలు పట్టుబడ్డాయి. చీరాల వాడరేవు, కొత్తపేట ప్రాంతాలు ఇప్పుడు వ్యభిచారానికి అనుకూలంగా ఉన్నాయి. కొందరు వ్యభిచారిణులను తమతో పాటు తెచ్చుకుంటుండగా మరికొందరికి గెస్ట్‌హౌస్ నిర్వాహుకులే సరఫరా చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే చీరాలలో వ్యభిచారాన్ని అంతం చేయడం అంత కష్టమేమీ కాదని స్థానికులు చెబుతున్నారు.