breaking news
Chinkara
-
నల్లమలలో అరుదైన చింకారా
సాక్షి, నాగర్కర్నూల్: నాజూకైన శరీరం, బెదురు కళ్లు, రింగులు తిరిగిన కొమ్ములతో కృష్ణజింకలను పోలి ఉండే చింకారా అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి. దేశంలో అరుదుగా కన్పి0చే ఈ ఇండియన్ గజల్ ఎక్కువగా గుజరాత్లో కొంతభాగం విస్తరించిన థార్ ఎడారితో పాటు కర్ణాటకలోని యాడహల్లి అభయారణ్యంలో మాత్రమే కన్పిస్తాయి. ఇలాంటి అరుదైన చింకారాల గెంతులకు నల్లమల అటవీప్రాంతం నెలవైంది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మద్దిమడుగు రేంజ్లో పదుల సంఖ్యలో చింకారాలు ఉన్నాయి. అయితే అతి సున్నితమైన చింకారాల మనుగడకు వేట, మానవసంచారం రూపంలో ముప్పు పొంచి ఉంది. అంతరించిపోతున్న దశలో చింకారా జాతి దేశంలోనే అరుదైన చింకారా జాతి జింకలు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. దట్టమైన అడవిలో కాకుండా పూర్తిగా గడ్డి మైదానాలు, పొదలతో కూడిన అడవుల్లో నివసించేందుకే చింకారాలు ఇష్టపడతాయి. జనావాసాలు, మనుషులకు ఇవి దూరంగా ఉంటాయి. మనుషులు కన్పిస్తే చాలు భయంతో బెదిరిపోతాయి. చిన్నచిన్న శబ్దాలకు కూడా గజగజ వణికిపోతాయి. అతి సున్నితమైన ఈ జీవులకు వేట, మానవ సంచారం, ఇతర జంతువులతో ముప్పు ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో చింకారాలు కీలకంగా పని చేస్తాయి. ఈ ప్రాంతాల్లో మానవ సంచారాన్ని తగ్గించేందుకు, వేటను నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.చింకారాలు అతి సున్నితమైనవి దేశంలో అరుదైన చింకారాలు నల్లమలలో ఉన్నాయి. జింక జాతికి చెందిన ఈ ప్రాణులు అతి సున్నితమైనవి. మనుషులు కని్పస్తే బెదిరిపోతాయి. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యంలో వీటి పాత్ర కీలకం. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ జిల్లాజనసంచారం, ఆవుల మందలతో ముప్పునల్లమలలోని మద్దిమడుగు అటవీరేంజ్ పరిధిలో చింకారాల ఉనికి కన్పిస్తుండగా, ఈ ప్రాంతంలో జనసంచారం క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుంది. నల్లమలలో వేలసంఖ్యలో వదులుతున్న ఆవుల మందలతో కూడా చింకారాలకు ముప్పు పొంచి ఉంది. చిన్నచిన్న మొక్కలు, నేలపై తక్కువ ఎత్తులో ఉండే గడ్డి మాత్రమే చింకారాల ఆహారం కాగా, ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సంచరిస్తున్న ఆవుల మందలతో ఆహారపు పోటీ నెలకొంది. ఆవులను మేపేందుకు స్థానిక గ్రామాల నుంచి కాకుండా నల్లగొండలోని కంబాలపల్లి, చందంపేట పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఆవుల మందలను కృష్ణాతీరంలోని నల్లమలలో వదులుతున్నారు. జంతువుల నుంచి వన్యప్రాణులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధులకు చింకారాలు లోనయ్యే అవకాశం ఉంది. అరుదైన చింకారాల సంరక్షణకు అటవీశాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రాజస్థాన్ లో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు!
జైపూర్: ఇక రాజస్థాన్ రాష్ట్రంలో రెండు జంతువులకు అధికారిక గుర్తింపు లభించనుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర జంతువుగా కృష్ణజింక ఉండగా, ఒంటెను కూడా అదే జాబితాలో చేర్చారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా ఒంటెకు గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒంటెలను మాంసం కోసం వధిస్తూ ఉండడం, అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండడంతో ఆ జాతి సంతతి క్రమేపీ తగ్గిపోతోంది. దీంతో వాటిని పరిరక్షణకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత జూలై నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో థార్ అడవిల్లో కనిపించే ఒంటెలను క్రమేపీ వేరే ప్రాంతాలకు తరలిస్తుండటంతో ఆ జాతి మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది.