breaking news
chile earthquake
-
Chile Quake: కుదిపేసిన భారీ భూకంపం
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో Earthquake in Chile చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్‌లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు. ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. Strong 6.2-magnitude earthquake hits central Chile, close to La Serena pic.twitter.com/1RrnyAe3Uq — BNO News (@BNONews) September 7, 2023 #Chile 🇨🇱 Reacciones al sismo Magnitud 6.3. pic.twitter.com/hZq7ruWuo4 — InfoSismologic (@EarthquakeChil1) September 7, 2023 Tremors felt and can be seen… Coquimbo in San Juan #Sismo #Temblor #temblor #terremoto #Chile #LaSerena pic.twitter.com/LJEd2dY0a9 — Shadab Javed (@JShadab1) September 7, 2023 #Chile #Chilenos Momento del Sismo M6.6 Percibido en La Serena, #Chile. (Septiembre 06, 2023). #Temblor #Earthquake #Climagram #Coquimbo pic.twitter.com/xZRi7sR437 — 𝔸𝕝𝕖𝕛𝕒𝕟𝕕𝕣𝕠 𝔽𝕣𝕚𝕒𝕤 ♚ ✖️ (@FriasAlejandro_) September 7, 2023 -
చిలీలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.8గా తీవ్రత నమోదు
చిలీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చింది గానీ, దీనివల్ల సునామీ ముప్పు ఏమీ లేదని నేవీ అధికారులు చెబుతున్నారు. భూకంపం కేంద్రం చిలీలోని కోక్వింబో నగరానికి దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని అమెరికా వాతావరణ కేంద్రం తెలిపింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. సమీపంలోని తీరప్రాంతాల్లో చిన్నపాటి సునామీ రావొచ్చని చిలీ నౌకాదళ అధికారులు హెచ్చరిక జారీచేసినా, తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినట్లు సోషల్ మీడియాలో వినవచ్చింది. -
చిలీ భూకంపంలో 10 మంది మృతి
శాండియాగో: చిలీలో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో నమోదైన చిలీ భూకంప ప్రభావం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలని కూడా తాకింది. గురువారం న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే..అయితే జపాన్ కూడా సునామీ దాడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే 30సెం.మీ ఎత్తున్న అలలు జపాన్ దక్షిణ తీరాన్ని తాకాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావం అంతగా ఉండకపోయినా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంతో ఉండాలని సూచించారు. తీరం వెంబడి నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.