breaking news
child save
-
జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం
చిన్న పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వారికి ఏదో ఒక రూపంలో అపాయం జరుగుతూనే ఉంటుంది. క్షణ కాలంలో తీవ్రగాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాగా, ఈ వీడియోలో ఓ తండ్రి అజాగ్రత్త కారణంగా తన కూతురు కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటనలో తండ్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ప్రకారం.. ఓ చిన్నారి రోడ్డుపై ఉన్న సముద్ర సింహంపై ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సముద్ర సింహం సడెన్గా చిన్నారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు చిన్నారి తండ్రి పక్కనే ఉండి చోద్యం చూస్తూ నిలబడ్డాడు. ఇలా అజాగ్రత్తగా ఉండటం వల్లే సముద్ర సింహం.. చిన్నారిపై దాడి చేయబోయిందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టుపిడ్ ఫెలో పిల్లల్ని చూసుకునేది ఇలానేనా అని ఓ నెటిజన్లు కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉండగా.. సముద్ర సింహాలు చాలా ప్రశాంతమైన జీవులు. సాధారణంగా అవి ఎవరీని ఏమీ అనవు. కానీ, వాటి జోలికి వెళ్లి విసిగిస్తే మాత్రం వెంబడించి మరీ దాడి చేస్తాయి. కొద్ది రోజలు క్రితం అమెరికాలోని ఓ బీచ్లో రెండు సముద్ర సింహాలు పర్యటకులను పరిగెత్తించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Putting your kid on a wild sea lion’s back for The Gram is some horrendous parenting. pic.twitter.com/NRbxlixf4P — kereD (@i__m__kered) July 13, 2022 ఇది కూడా చదవండి: బాహుబలి ఏనుగు అంటే ఇలా ఉంటది.. ట్రెండింగ్ నిలిచిన వీడియో -
పోలీసుల సమయస్ఫూర్తితో బాలుడికి తప్పిన ప్రమాదం
-
బాలుణ్ణి కాపాడినందుకు అవార్డు
మెల్బోర్న్: మతసంప్రదాయానికి విరుద్ధమని తెలిసినా గాయపడ్డ బాలుడికి కట్టుకట్టడానికి తలపాగా ఉపయోగించిన సిక్కు యువకుడిని న్యూజిలాండ్ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. హర్మాన్ సింగ్కు ‘డిస్ట్రిక్ట్ కమాండర్స్ సర్టిఫికెట్’ను శుక్రవారం మనకావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రదానం చేశారు. బాధితులపై సింగ్ చూపిన సహానుభూతి ప్రశంసనీయార్హమైనదని కౌంటీ పోలీసుశాఖ ఉన్నతాధికారి అన్నారు. డీజన్ పహియా అనే బాలుడు మే 15న నడుచుకుంటూ స్కూలుకు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. అతడి తల నుంచి విపరీతంగా రక్తం కారడాన్ని చూసి సింగ్ వెంటనే తలపాగా తీసి కట్టుకట్టి ప్రాథమిక చికిత్స చేశారు.