breaking news
Charuhasan
-
ఆస్పత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ సోదరుడు
ప్రముఖ నటుడు, దర్శకుడు చారు హాసన్‌ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఈయన కుమార్తె, ఒకప్పటి హీరోయిన్ సుహాసిని చెప్పుకొచ్చింది. దీపావళి పండగ ముందు అంటే గురువారం రాత్రి చారు హాసన్.. అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'దీపావళికి ముందే మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు' అని సుహాసిని తన్ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, కమల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
మరోసారి డాన్‌గా కమల్ హాసన్ సోదరుడు.. 93 ఏళ్ల వయసులోనూ అదే జోష్
నటుడు కమల్ హాసన్ సోదరుడు నటి సుహాసిని తండ్రి అయిన చారుహాసన్ ఇంతకుముందు పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఈమధ్య దాదా 87 అనే చిత్రంలో డాన్‌గా ప్రధాన పాత్ర పోషించి అందరినీ విస్మయపరిచారు. చారు హాసన్ వయసు ప్రస్తుతం 93 ఏళ్లు ఈ వయసులోనూ ఆయన మరోసారి డాన్‌గా తెరపై కనిపించబోతున్నారు. ఇంతకుముందు దాదా 87, పౌడర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన విజయ్ శ్రీ.జీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం హర. కోయంబత్తూర్ ఎస్పీ మోహన్ రాజ్, జీ మీడియా జయ శ్రీ విజయ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. విలన్ పాత్రల్లో సురేష్ మీనన్, నటి వనిత విజయ్ కుమార్ నటించగా, నటి కుష్బూ, యోగిబాబు, మొట్టై రాజేంద్రన్, సింగం పులి, దీప, మైమ్ గోపి, శ్యామ్స్, కౌశిక్ ,అనిత్రా నాయర్, సంతోష్ ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పాఠశాలల్లో చదువుకుంటున్నప్పటి నుంచే బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై అవగాహన కలిగించాలనే కాన్సెప్ట్‌తో దీన్ని నిర్మించామన్నారు. ఇకపోతే నటుడు చారుహాసన్ ఈ చిత్రంలో ఒక మంచి డాన్ గా నటించినట్లు చెప్పారు. ఆయన ఒక సామాజిక బాధ్యత కలిగిన డాన్ పాత్రను పోషించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.