breaking news
Charles Bombardier
-
కొత్తరకం పోలీసు సూపర్ బైక్స్ కమింగ్‌సూన్...
ప్రమాదాలకు తావులేకుండా డ్రైవర్‌లెస్ కార్లు, డ్రైవర్‌లెస్ బస్సులు ఇలా డ్రైవర్‌తో సంబంధం లేని పూర్తిగా టెక్నాలజీతో నడిచే సేవలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. పలు వాహన కంపెనీలు సైతం ఈ కొత్త తరం డ్రైవర్ లెస్ వాహనాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. వీటిని రోడ్లపైకి విజయవంతంగా తీసుకురావడానికి టెక్నాలజీ కంపెనీలతోనూ జతకడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్తరకం డ్రైవర్‌లెస్ వాహనం మన ముంగింట్లోకి రాబోతుంది. అదేమిటంటే డ్రైవర్‌లెస్ పోలీసు సూపర్ బైక్.. సూపర్ ఫాస్ట్‌గా పేరొందనున్న ఈ వాహనం 24/7 సమయాలో జాతీయరహదారులపై చక్కర్లు కొడుతూ.. స్పీడ్ లిమిట్‌ను క్రాస్ చేసిన వాహనదారులకు చెక్ పెట్టేలా ఇది రూపొందుతోంది. ఇంటర్‌సెప్టర్ డ్రోన్ పోలీసు 01 పేరుతో ఇది మార్కెట్లోకి రానుంది. అయితే ఈ బైక్‌ను ఏ కంపెనీ రూపొందిస్తోందో తెలుసా? తర్వాతి తరం వాహనాలు రూపొందించడమే తమ డ్రీమ్‌గా సేవలందిస్తున్న లాభాపేక్ష లేని బొంబార్డియర్ దీన్ని ప్రవేశపెట్టబోతోంది. ఇది టెక్నాలజీలో ఓ సహజ పరిణామమని కెనడియన్ మెకానికల్ ఇంజనీర్ చార్లెస్ బొంబార్డియర్ పేర్కొన్నారు. నేటి ఉత్పత్తులకు కొత్తరకం ఆలోచనలతో ముందుకు రావడమే తమ లక్ష్యమని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎన్నో రోజులుగా ట్రాఫిక్ కెమెరాలు వాడుకలో ఉన్నాయని, కానీ పబ్లిక్ వర్క్ సిస్టమ్స్‌లో కనీస అవసరాలకు కొత్తగా మెరుగైన పరిష్కారాలు తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ సూపర్ బైక్ పెట్రోలింగ్ చేసేటప్పుడు లైసెన్స్ ప్లేట్లను స్కాన్ చేయడం, రియల్ టైమ్ వీడియో ఉపయోగించి నేరాలు రికార్డు చేయడం వంటివి చేయనుంది. ఒకవేళ ఉల్లఘనలు రికార్డు అయితే, డ్రోన్ ఆటోమేటిక్‌గా వారికి నోటీసులు జారీచేయనుంది. హైడ్రోజన్ లాంటి కర్బన్ రహిత ఉద్గారాల ద్వారా ఇది రూపొందుతోంది. -
ఈ స్క్రీమర్ వేగం... కేక!
హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఎంత టైమ్ పడుతుంది? విమానమెక్కితే ఒకట్రెండు స్టాప్‌లతో దాదాపు 20 గంటలు. అంతేనా? ఇలాకాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కితే అదేరోజు మధ్యాహ్నం లంచ్‌కు న్యూయార్క్‌లో ఉండగలిగతే? అబ్బో భలే ఉంటుంది. ఇంకొన్నేళ్లు ఆగండి. ఈ పని మీరూ చేయవచ్చు. ఎందుకంటే స్క్రీమర్ విమానాలు వచ్చేస్తున్నాయి మరి! కెనెడా ఇంజినీర్ ఛార్లెస్ బంబార్డియర్ డిజైన్ చేసిన ఈ విమానం గంటకు ఏకంగా 7673 మైళ్ల వేగంతో దూసుకెళుతుంది. ఈ వేగాన్ని అందుకునేందుకు ఈ విమానం టేకాఫ్ కోసం రన్‌వేకు బదులుగా రైల్లే పట్టాల్లాంటి నిర్మాణాన్ని వాడుకుంటుంది. ఈ దశలోనే విమానానికి అమర్చిన కొన్ని చిన్నసైజు రాకెట్లు ఇంధనాన్ని మండిస్తూ వేగాన్ని మరింత పెంచుతాయి. ఆ తరువాత అత్యధిక శక్తిని అందించే స్క్రామ్‌జెట్ ఇంజిన్లు రంగంలోకి దిగుతాయి. వీటన్నింటి ఫలితంగా స్క్రీమర్ ద్వనికి పదిరెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించడం వీలువుతందని అం చనా. ఇంకోలా చెప్పాలంటే దాదాపు నాలుగు వేల మైళ్ల అట్లాంటిక్ మహా సముద్రాన్ని అరగంటలో దాటేయాలన్న ది స్క్రీమర్ ఉద్దేశం. 75 మంది ప్రయాణించగల స్క్రీమర్ సాంకేతిక, ఆర్థిక సమస్యలను అధిగమించి వాస్తవరూపం దాలిస్తే... వైమానికరంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు!