ఈ స్క్రీమర్ వేగం... కేక! | This skrimar speed | Sakshi
Sakshi News home page

ఈ స్క్రీమర్ వేగం... కేక!

Nov 14 2015 12:59 AM | Updated on Sep 3 2017 12:26 PM

ఈ స్క్రీమర్ వేగం... కేక!

ఈ స్క్రీమర్ వేగం... కేక!

హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఎంత టైమ్ పడుతుంది? విమానమెక్కితే ఒకట్రెండు స్టాప్‌లతో దాదాపు 20 గంటలు.

హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఎంత టైమ్ పడుతుంది? విమానమెక్కితే ఒకట్రెండు స్టాప్‌లతో దాదాపు 20 గంటలు. అంతేనా? ఇలాకాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కితే అదేరోజు మధ్యాహ్నం లంచ్‌కు న్యూయార్క్‌లో ఉండగలిగతే? అబ్బో భలే ఉంటుంది. ఇంకొన్నేళ్లు ఆగండి. ఈ పని మీరూ చేయవచ్చు. ఎందుకంటే స్క్రీమర్ విమానాలు వచ్చేస్తున్నాయి మరి! కెనెడా ఇంజినీర్ ఛార్లెస్ బంబార్డియర్ డిజైన్ చేసిన ఈ  విమానం గంటకు ఏకంగా 7673 మైళ్ల వేగంతో దూసుకెళుతుంది. ఈ వేగాన్ని అందుకునేందుకు ఈ విమానం టేకాఫ్ కోసం రన్‌వేకు బదులుగా రైల్లే పట్టాల్లాంటి నిర్మాణాన్ని వాడుకుంటుంది. ఈ దశలోనే విమానానికి అమర్చిన కొన్ని చిన్నసైజు రాకెట్లు ఇంధనాన్ని మండిస్తూ వేగాన్ని మరింత పెంచుతాయి.

ఆ తరువాత అత్యధిక శక్తిని అందించే స్క్రామ్‌జెట్ ఇంజిన్లు రంగంలోకి దిగుతాయి. వీటన్నింటి ఫలితంగా స్క్రీమర్ ద్వనికి పదిరెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించడం వీలువుతందని అం చనా. ఇంకోలా చెప్పాలంటే దాదాపు నాలుగు వేల మైళ్ల అట్లాంటిక్ మహా సముద్రాన్ని అరగంటలో దాటేయాలన్న ది స్క్రీమర్ ఉద్దేశం. 75 మంది ప్రయాణించగల స్క్రీమర్ సాంకేతిక, ఆర్థిక సమస్యలను అధిగమించి వాస్తవరూపం దాలిస్తే... వైమానికరంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు!

Advertisement
Advertisement