breaking news
chandarkhani peak
-
ఆ ఎనిమిది మంది పర్వతారోహకులు క్షేమం!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో రెండు రోజుల క్రితం చాందర్‌ఖానీ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి మంచులో చిక్కుకున్న ఎనిమిదిమంది పర్వత అధిరోహకులు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్) ఏరియల్ సర్వే చేస్తున్న సమయంలో అదృశ్యమైన వారిలో తొలుత ఆరుగురిని గుర్తించి హెలికాప్టర్లో రక్షిత స్థావరానికి తరలించినట్టు డిప్యూటీ కమిషనర్ హన్స్‌రాజ్ చౌహన్ వెల్లడించారు. ఆ తరువాత మరో ఇద్దరిని గుర్తించగా.. వారు క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. కాకపోతే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారిద్దరినీ అక్కడినుంచి తరలించలేకపోయామని తెలిపారు. శనివారం రిస్క్య టీం హెలికాప్టర్లో అదృశ్యమైన విద్యార్థుల జాడ గుర్తించేందుకు తీవ్రంగా గాలించిన సంగతి తెలిసిందే. అయితే దట్టంగా మంచు కురుస్తుండటంతో 3600 మీటర్లు ఎత్తు ఉన్న చాందర్‌ఖానీ శిఖరం వద్దకు రిస్క్యూ టీం చేరుకోలేకపోయినట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు. దాంతో మరోసారి ఆదివారం సహాయక బృందం మోహరించి అదృశ్యమైన విద్యార్థుల కోసం ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, పంజాబ్ సంగ్రూర్ టౌన్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు గురువారం చాందార్‌ఖానీ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాన్ని అధిరోహించే సమయంలో ఆ విద్యార్థులు మంచులో చిక్కుకుని అదృశ్యమైన సంగతి తెలిసిందే. -
అదృశ్యమైన పర్వతారోహకుల జాడ లేదు!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో రెండు రోజుల క్రితం చాందర్‌ఖానీ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి అదృశ్యమైన ఎనిమిదిమంది పర్వత అధిరోహకుల జాడ ఇంకా తెలియలేదు. శనివారం రిస్క్య టీం హెలికాప్టర్లో అదృశ్యమైన విద్యార్థుల జాడ గుర్తించేందుకు తీవ్రంగా గాలించింది. అయితే దట్టంగా మంచు కురుస్తుండటంతో 3600 మీటర్లు ఎత్తు ఉన్న చాందర్‌ఖానీ శిఖరం వద్దకు రిస్క్యూ టీం చేరుకోలేకపోయినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో మరోసారి ఆదివారం సహాయక బృందం మోహరించి అదృశ్యమైన విద్యార్థుల కోసం గాలించనుంది. కాగా, పంజాబ్ సంగ్రూర్ టౌన్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు గురువారం చాందార్‌ఖానీ పర్వతారోహణకు వెళ్లారు. శిఖరాన్ని అధిరోహించే సమయంలో ఆ విద్యార్థులు మంచులో చిక్కుకున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు డిప్యూటీ కమిషనర్‌తో అక్కడి రెవెన్యూ శాఖ మంత్రి కౌల్ సింగ్ సంప్రదించి జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆజ్ఞాపించారు.