breaking news
Central Information Commissioner madabhushi Sridhar
-
మృతుని ఖాతాల వివరాలు వారసులకు ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: మృతుని అకౌంట్ల వివరాలను వ్యక్తిగత సమాచారం పేరుతో అతని వారసులకు ఇచ్చేందుకు నిరాకరించ రాదని పేర్కొన్న కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) సంబంధిత అధికారికి జరిమానా విధించింది. చనిపోయిన తన తండ్రికి సంబంధించిన పోస్టాఫీసు అకౌంట్ల వివరాలు అందజేయాల్సిందిగా ఓ వ్యక్తి పోస్టల్ సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అది వ్యక్తిగత సమాచారం కాబట్టి, తాము ఇవ్వలేమంటూ సూపరింటెండెంట్ నిరాకరించారు. దీనిపై బాధితుడు సీఐసీని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ‘హిందూ వారసత్వ చట్టం ప్రకారం మృతునికి దరఖాస్తుదారు చట్టపరమైన వారసుడు. కాబట్టి అతడు వ్యక్తిగత వివరాలు కోరినట్లుగా పరిగణించలేము. తండ్రికి సంబం ధించిన అన్ని అకౌంట్ల వివరాలు తెలుసుకునే హక్కు అతనికి ఉంది. మృతుని కుటుంబానికి పోస్టాఫీసు ఎటువంటి డబ్బు కూడా చెల్లించలేదు. కాబట్టి, దరఖాస్తు దారు అడిగిన మేరకు అకౌంట్లు, నిల్వల వివరాలు అందజే యాల్సిందే’ అని పేర్కొన్నారు. అంతేకాదు, దరఖాస్తుదారును ఇబ్బంది పెట్టినందుకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
కేసీఆర్ 70 వేల పుస్తకాలు చదివారు..
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ వరంగల్ : తెలంగాణసీఎం కేసీఆర్ 70 వేల పుస్తకాలు చదివారని, పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానంతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) వార్షికోత్పవం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ మాట్లాడుతూ పుస్తకాల ద్వారా విజ్ఞానం నేర్చుకోవచ్చన్నారు. దేశంలో విద్య కమ్యూనికేషన్ ద్వారా సాగుతోందన్నారు.kcr అందరు వదిలేసినా... తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమించిన ఏకైక వ్యక్తి తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి అని అన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేంద్ర శాస్త్రి పాల్గొన్నారు.