breaking news
CBSE guidelines issued
-
ఆటలకో పీరియడ్: సీబీఎస్ఈ ఆదేశం
న్యూఢిల్లీ: తన అనుబంధ పాఠశాలలన్నీ వచ్చే సంవత్సరం నుంచి విధిగా రోజూ క్రీడలకే ఒక పీరియడ్ కేటాయించాలని సీబీఎస్ఈ ఆదేశించింది. 9–12 తరగతి విద్యార్థుల్లో శారీరక, మానసిక ఉల్లాసం నింపేలా ఆటలు ఆడించాలని సూచిస్తూ 150 పేజీల మార్గదర్శకాలను విడుదల చేసింది. హెల్త్, ఫిజికల్ విద్య(హెచ్‌పీఈ)ని అకడమిక్స్‌లో భాగం చేస్తూ రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం..పాఠశాలల్లో రోజూ జరిగే ఆటల పీరియడ్‌లో విద్యార్థులంతా మైదానానికి వెళ్లి, బోర్డు పేర్కొన్న జాబితాలోని ఏదో ఒక ఆట లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అందులో విద్యార్థులకు ఇచ్చే గ్రేడ్లను పాఠశాలలు సీబీఎస్ఈ వెబ్సైట్లో పొందుపర్చాలి. విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవ్వాలంటే హెచ్‌పీఈలో పాల్గొనడం తప్పనిసరి. అయితే ఇలా వచ్చే గ్రేడ్లను ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కులకు కలపరు. -
స్కూలు సిబ్బందికి సైకోమెట్రిక్ పరీక్షలు
సీబీఎస్ఈ మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి సీబీఎస్ఈ గురువారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బోధన, బోధనేతర సిబ్బందికి సైకోమెట్రిక్ పరీక్షలు(మానసిక స్థితిని నిర్ధారించే) నిర్వహించాలని తన అనుబంధ పాఠశాలలను ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కోరింది. తమ ఈ మార్గదర్శకాలను పాటించాలని, లేని పక్షంలో పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇటీవల గుర్గావ్, ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యార్థులపై లైంగిక దాడులు జరిగిన నేపథ్యంలో బోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ‘బస్సు డ్రైవర్లు, ప్యూన్, ఇతర సిబ్బందికి సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించి, ఆ సమాచారాన్ని ఆన్లైన్లో బోర్డుకి పంపించాలి’ అని సీబీఎస్ఈ పాఠశాలలకు పంపిన సర్క్యులర్‌లో పేర్కొంది. పాఠశాలల పరిసరాల్లో భద్రతా తనిఖీలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పోలీస్‌లతో వెరిఫికేషన్లు, తల్లిదండ్రులు–ఉపాధ్యాయులతో కూడిన కమిటీల నియామకం, తరచూ తల్లిదండ్రులతో మాట్లాడటం లాంటి చర్యలనూ చేపట్టాలని సూచించింది.