breaking news
Cartridge
-
విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్‌ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్‌లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది. -
అదృష్టమే!
తూటా ‘డెరైక్షన్’ మారితే తీవ్ర ప్రభావం త్రుటిలో తప్పిన ముప్పు {పాణాలతో బయటపడిన డాక్టర్ ఉదయ్ కుమార్ సిటీబ్యూరో: హిమాయత్ నగర్లో సోమవారం నాటి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ఉదయ్ కుమార్ కోలుకుంటున్నారు. మంగళవారం ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు తూటా శకలాలు తొలగించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తగిలిన తూటా ఏమాత్రం ‘అటు-ఇటు’గా వెళ్లినా పెను ప్రభావం ఉండేదని... ఆ ప్రకారం చూస్తే త్రుటిలో ముప్పు తప్పినట్లేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 45 డిగ్రీల కోణంలో ఫైరింగ్ కాల్పుల ఉదంతం జరిగింది హైఎండ్ కారుగా పరిగణించే ఓక్స్ వ్యాగన్లో. ఈ కారులో ముందు సీట్ల కంటే వెనుక సీట్లు కొద్దిగా ఎత్తులో ఉంటాయి. డ్రైవింగ్ సీటులో ఉదయ్, దాని పక్కన ఉండే సీటులో సాయికుమార్ కూర్చున్నారు. వెనుక సీటులో ఎడమ వైపు కూర్చున్న శశి.. తన రివాల్వర్‌ను కుడిచేత్తో పట్టుకొని, వెనుక నుంచి ఉదయ్‌పై కాల్చారు. వెనుక సీటు ఎత్తుగా ఉండటంతో ఉదయ్ ఎడమ చెవి వెనుక భాగం నుంచి 45 డిగ్రీల కోణంలో (పై నుంచి కిందికి) దూసుకు వచ్చిన తూటా దంతాలకు తగలకుండా దవడను తాకింది. పిల్లెట్స్గా మారిన బుల్లెట్ శశికుమార్ వినియోగించింది .32 లెసైన్స్డ్ రివాల్వర్. నాన్ ప్రొహిబిటెడ్ బోర్ (క్యాలిబర్)గా పరిగణించే ఈ తుపాకీలో వాడే తూటాలను సీసంతో (లెడ్) తయారు చేస్తారు. తుపాకీ ట్రిగ్గర్ నొక్కినప్పుడు హేమర్ ధాటికి ప్రైమర్ ప్రేరేపితమై బుల్లెట్ కేస్‌లో ఉండే గన్ పౌడర్‌ను మండిస్తుంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే ముందు భాగంలో ఉండే బుల్లెట్ దూసుకుపోతుంది. గన్ పౌడర్ మంటతో లెడ్ తూటా వేడెక్కి ఉంటుంది. ఇది చెవి పక్క నుంచి లోపలకు ప్రవేశించిన ఒత్తిడి, దవడకు తగిలినప్పుడు కలిగే ఒత్తిడి ఫలితంగా ఛిద్రమైపోయి పిల్లెట్స్గా మారింది. వీటిలో కొన్ని ఉదయ్ దవడ భాగంలో ఉండిపోగాా... మరికొన్ని పొట్టలోకి వెళ్లాయి. ఏమాత్రం ‘డెరైక్షన్’ మారినా... తుపాకీ నుంచి బయటకు వచ్చిన తూటా ప్రయాణించే దిశను డెరైక్షన్ అంటారు. శశికుమార్ కాలుస్తున్నప్పుడు ఏ మాత్రం డెరైక్షన్ మార్చినా... పొరపాటునో...ఆందోళన... కంగారు నేపథ్యంలోనో మారినా... ఉదయ్‌పై తీవ్ర ప్రభావం ఉండేది. ఏ వైపునకు డెరైక్షన్ మారితే... ఏం జరిగేదంటే? కుడి వైపు: వెన్నెముక, పుర్రె కలిసే భాగంలో మెడకు పైన సెరిబ్లమ్ అనే భాగం ఉంటుంది. తూటా కనుక కుడి వైపు ప్రయాణించి ఈ భాగాన్ని తాకితే... సర్వైకల్ ఎమిస్టైర్గా పిలిచే ప్రాంతం ఛిద్రమయ్యేది. ఇదే జరిగితే నాడీ వ్యవస్థ కుప్పకూలి బాధితుడు తక్షణం కోమాలోకి వెళ్లిపోతాడు.పై వైపు: ఈ తూటా డెరైక్షన్ 45 డిగ్రీల కోణంలో పైకి ఉండి ఉంటే... అక్కడ ఉండే మెదడుకు సంబంధించిన కీలక భాగం దెబ్బతినేది. అలా జరిగితే గాయం ఎడమ వైపు అయిన నేపథ్యంలో కుడి కాలు, చెయ్యితో పాటు ఇతర అవయవాలు చచ్చుబడిపోయే ప్రమాదం ఉండేది. కింది వైపు: శశికుమార్ కాల్చిన తూటా తలిగిన ప్రాంతానికి కుడి వైపు, కాస్త కింద నుంచి దూసుకుపోతే అక్కడ ఉండే బ్రెయిన్ స్టెమ్గా పిలిచే భాగం దెబ్బతినేది. శరీరానికి సంబంధించిన శ్వాస, రక్తప్రసరణ వ్యవస్థలను నియంత్రించే ఈ వ్యవస్థకు ఏం జరిగినా ప్రాణాలకే ముప్పు వాటిల్లేది.