breaking news
Capital of Kakatiya
-
ఉయ్యాలా.. జంపాలా
వరంగల్ అర్బన్ : కాకతీయుల రాజధానిగా ఎన్నో చరిత్రాత్మక ప్రదేశాలకు నెలవైన ఓరుగల్లు సిగలో మరో నగ చేరనుంది. దశాబ్దాలుగా నానుతున్న భద్రకాళి గుట్ట-పద్మాక్షి గుట్ట రోప్‌వే ప్రతిపాదనలకు అధికారులు దుమ్ము దులిపారు. దీనికి సంబంధించి ఐదేళ్ల క్రితం నాటి ప్రాజెక్టు రిపోర్టులో కొద్దిపాటి మార్పులు చేసి.. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలు ముగియగానే టెండ ర్ల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇదంతా పూర్తరుు రోప్ వే నిర్మాణం జరిగితే వరంగల్ నగర వాసులే కాదు, ఇక్కడకు వచ్చే పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి సొంతమవుతుందనే చెప్పాలి. రూ.20 కోట్లతో.. వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలోని గుట్టల మీద నుంచి హన్మకొండలోని పద్మాక్ష్మి గుట్ట వరకు రోప్ వే నిర్మించాలని దశాబ్దం క్రితం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) అధికారులు భావించారు. ఆ తర్వాత ఐదేళ్లకు బీఓటీ పద్ధతిపై కోల్‌కత్తాకు చెందిన దామోదర్ రోప్‌వే కంపెనీకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణరుుంచారు. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్ట్ స్కీం కింద ఈ ప్రాజెక్టు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం కేంద్రప్రభుత్వం, 70 శాతం కంపెనీ భరించేలా, ‘అపిట్కో’తో డిజైన్ చేరుుంచేందుకు ఒప్పందాలు జరిగారుు. ఆ తర్వాత సాంకేతిక అడ్డంకులు, తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. కలెక్టర్ చొరవతో.. జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ వాకాటి కరుణ ‘పద్మాక్షి’ రోప్ వే నిర్మాణానికి తాజాగా చొరవ తీసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో ఈ రోప్ వే నిర్మాణం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చని భావించిన ఆమె ‘కుడా’ వీసీ, బల్దియూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో చర్చించారు. గతంలో మాదిరిగా కేంద్రప్రభుత్వం, నిర్మాణ కంపెనీల పొత్తు ఉండకుండా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) పద్ధతిలో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఐదేళ్ల క్రితం నాటి ప్రాజెక్టు డిజైన్‌లో చిన్నచిన్న మార్పులు చేరుుంచేందుకు నిపుణులతో చర్చించి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితమే ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు, చేర్పులు చివరి దశకు చేరినా... తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల హడావుడి ఉండడంతో వారం తర్వాత టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. రూ.20 కోట్లు, 1.1 కిలోమీటర్లు భద్రకాళి గుట్ట-పద్మాక్షి గుట్ట రోప్‌వే కోసం సుమారు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ రోప్‌వేను 1.1 కిలోమీటర్ల దూరంతో నిర్మించనుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతి పెద్ద రోప్‌వేగా నిలవనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, విశాఖపట్నంలో రోప్ వే ఉండగా వీటి దూరం 0.3 నుంచి 0.5 కిలోమీటర్లు మాత్రమే! ఈ మేరకు వరంగల్‌లో 1.1 కిలోమీటర్ల నిడివితో దీన్ని నిర్మించనుండడం విశేషం. అటు హృదయ్.. ఇటు రోప్‌వే.. కేంద్రప్రభుత్వం హృదయ్ పథకం కింద వరంగల్‌ను ఎంపిక చేసి తొలి ఏడాది రూ.41.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఇందులో ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల కాగా, ఈ నిధులతో భద్రకాళి బండ్‌ను అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. భద్రకాళి బండ్ పటిష్టత, ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యూరుు కూడా! అలాగే, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పూడిక తీసి కట్టను అభివృద్ధి చేసే ప్రారంభమయ్యూరుు. ఆ తర్వాత కట్ట, ఆ పక్కనే పార్క్‌లో రంగురంగుల విద్యుత్ దీపాలు, పిల్లల ఆట వస్తువులు, ఇతర రిక్రియేషన్ పనులు చేపడుతారు. ఇక రోప్ వే కూడా పూర్తరుుతే వరంగల్‌లోని భద్రకాళి ఆలయూనికి వచ్చే భక్తులు, పర్యాటకులు... నగరాన్ని విహంగ వీక్షణం చేస్తూ పద్మాక్ష్మి గుట్టపైకి చేరుకోవచ్చు. తద్వారా ప్రజలకు సరికొత్త అనుభూతి సొంతం కానుందనే చెప్పాలి!! -
ఓ.. మై గాడ్
⇒1,135 ఎకరాల భూమి మాయం ⇒ఆలయాల భూములు అన్యాక్రాంతం ⇒సన్నూరు, మడికొండలో భారీ ఆక్రమణలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాకతీయుల రాజధాని వరంగల్ జిల్లా విభిన్న కళా సంపదతో నిర్మించిన ఆలయాలకు ప్రసిద్ధి. కాకతీయలు, వారికి ముందు పాలకులు, ఆ తర్వాత కీలక స్థానాల్లో ఉన్న వారు జిల్లాలో ఎన్నో ఆలయాలను నిర్మించారు. నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేందుకు మాన్యాలుగా వేల ఎకరాల భూములను సైతం ఆలయాలకు కేటాయించారు. భూములకు డిమాండ్ పెరగడం... దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో జిల్లాలోని ఆలయ భూములు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. దేవుడి పేరిట ఉన్న భూములు ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులుగా మారిపోయాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 814 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 298 ఆలయాలకు మాన్యాలు(ఆస్తులు)గా 4783.16 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లో 1,135 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. నగరం, నగర శివారులోని ఆలయాల భూములదీ ఇదే పరిస్థితి. ఆలయ భూముల పరిరక్షణ కోసం రెండేళ్ల క్రితం అధికారులు చొరవ చూపారు. 230 ఆలయాలకు చెందిన 3,663 ఎకరాలనుఆలయాల ఆస్తులుగా పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు మారిపోవడంతో ఆలయ భూముల పరిరక్షణ చర్యలు అగిపోయూయి. ఈ క్రమంలో ఆలయాల భూములను పరిరక్షిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని దేవాదాయ శాఖ భూముల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. పరిశీలనల అనంతరం జిల్లాలోని ఆలయాల భూములపై దేవాదాయ శాఖ ఇటీవల నివేదిక రూపొందించింది. ఇందులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం.. ⇒రాయపర్తి మండలం సన్నూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 782.23 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ తాజా నివేదిక ప్రకారం 692.31 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. 600 ఏళ్ల క్రితం ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. గతంలో రెండో తిరుపతిగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు దాతల విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ⇒హన్మకొండ మండలం మడికొండలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి 466.20 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ నివేదిక ప్రకారం 417.29 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. గతంలో ఆస్తులతో ఓ వెలుగు వెలిగిన ఇక్కడి ఆలయానికి ఇప్పుడు 40 ఎకరాలు కూడా లేని పరిస్థితి ఉంది. ⇒వరంగల్ నగర పరిధిలోని రామన్నపేటలో శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి 10 ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు మొత్తం భూమి కబ్జాకు గురైందని, 16, 17, 18, 20 సర్వే నంబర్లలో ఈ భూమి ఉందని దేవాదాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ⇒వరంగల్రంగంపేటలోని శ్రీహనుమాన్ ఆలయానికి 728, 730 సర్వే నంబర్లలో 5.38 ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరమైందని దేవాదాయ శాఖ రికార్డులే చెబుతున్నాయి. ⇒రామన్నపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 3, 4, 11, 12 సర్వే నంబర్లలో 5.06 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 4.30 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురైందని దేవాదాయ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నారుు. ⇒ఖిలా వరంగల్‌లోని శ్రీస్వయంభువు శంభులింగేశ్వరస్వామి ఆలయానికి 2072 సర్వే నంబరులో 3.09 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ నివేదిక ప్రకారం 33 గుంటల భూమి కబ్జాకు గురైంది. ⇒మట్టెవాడలోని శ్రీవేణగోపాలస్వామి ఆలయానికి 499 సర్వే నంబరులో 4.21 ఎకరాల భూములున్నాయి. ఇందులో నాలుగు గుంటల భూమి కబ్జాకు గురైనట్లు రికార్డులు చెబుతున్నాయి.