విద్యుత్‌ను ఆదా చేద్దాం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: విద్యుత్‌ను దుబారా ఖర్చుచేయకుండా పొదుపుగా వాడుకుం దామని ఇంధన పొదుపు సంస్థ రాష్ట్ర సీఈ ఓ చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తు తం బొగ్గు, ఇంధనం సమస్య కారణంగా ఇ ళ్లు, పరిశ్రమలకు విద్యుత్‌ను అందించలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ సమయంలో దేవుడు దయతలచి వర్షాలను బాగా కురి పించడంతో సంక్షోభం నుంచి బయటపడగలిగామని చెప్పారు. సోమవారం స్థానిక రె వెన్యూ సమావేశ మందిరంలో జరిగిన ఎ నర్జీ కన్జర్వేషన్ కమిటీ సమావేశానికి ఆయ న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సం దర్భంగా సీఈఓ మాట్లాడుతూ..పరిస్థితు లు అనుకూలించని కారణంగా 34వేల మి లియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి 12వేల మిలియన్ యూనిట్లు మా త్రమే ఉత్పత్తి అవుతుండేదన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 60లక్షల లోటు ఏర్పడిందన్నా రు. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే వి ద్యుత్ దొరకడమే కష్టంగా మారేదని అన్నా రు. 2001లో ప్రభుత్వం విద్యుత్ పొదుపు చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇందులో భా గంగానే గతేడాది స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్‌ని ఏర్పాటుచేసిందని సీఈఓ వివరించారు. పొదుపుగా వాడితే 15వేల మిలి యన్ల విద్యుత్‌ను ఆదా చేయొచ్చని తెలి పారు. ఆ ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం విద్యుత్‌ఆదాపై ప్రొజెక్టర్ ద్వారా క్లిప్పింగ్స్ అధికారులకు చూపించారు.
విద్యుత్ ఆడిటింగ్ నిర్వహించాలి: కలెక్టర్
ప్రతిఒక్కరూ ఒక్క యూనిట్ విద్యుత్‌ను ఆదాచేస్తే రైతులు వేసిన పంటలకు అంత గా నీరు ఇవ్వొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ కోరా రు. ఇక విద్యుదుత్పత్తిలో చాలా వ్యత్యాసం ఉండగా, ఈ ఏడాది జూరాల నిండటంతో కొంత బయటపడగలిగామని పేర్కొన్నా రు. ఇక ఆదా విషయంలో అధికారులు ప్ర త్యేకంగా అవగాహన కల్పించాలని సూచిం చారు. అదే విధంగా పరిశ్రమల్లో అయితే ప్రతిఏటా విద్యుత్ ఆడిటింగ్ నిర్వహించి పొదుపు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఈ సదాశివారెడ్డిని ఆదేశించా రు. ఇక జిల్లా విషయంలో రైతుల కన్నీళ్లను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత ఆదాచేయాలని కలెక్టర్ కోరారు. ఇక రైతులు కెపాసిటర్లను ఏర్పాటుచేసుకుని ఐఎస్ఐ పంప్సెట్లను వాడుకునేవిధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యం గా మునిసిపాలిటీల పరిధిలో ఉన్న పవర్బోర్లకు కెపాసిటర్లను ఏర్పాటుచేసి విద్యుత్‌ని ఆదాచేయాలని ఆదేశించారు.
విద్యుత్ పొదుపుపై ప్రతిజ్ఞ
‘జపాన్‌లో సునామీ దెబ్బకు విద్యుత్‌కు తీ వ్రనష్టం వాటిల్లింది. కానీ ఆ దేశ అధ్యక్షు డు విద్యుత్‌ను ఆదా చేసుకుని కాపాడుకుం దామని ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు వి ద్యుత్ సంకోభం నుంచి బయటపడ్డారని’ డీఆర్వో రాంకిషన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ దేశంలో పాటు అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుని విద్యుత్‌ని పొదుపు చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. అనంతరం విద్యుత్ పొ దుపుపై అధికారులు ప్రతిజ్ఞచేశారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్ఏ డీ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు.