breaking news
call letter
-
జాబ్‌కి అప్లై చేసిన 48 ఏళ్లకు కాల్ లెటర్..ఐతే..!
మనకు ఏదైనా రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని పెద్దలు అంటుంటారు. అది నిజమో..! కాదా? అనేది కచ్చితంగా చెప్పలేకపోయినా..కొన్ని రకాలు సంఘటనలు ఎదురైన వెంటనే ఠక్కున ఈ సామెత గుర్తొస్తుంది. దగ్గర వరకు వచ్చి చేజారిందనుకున్న టైంలో కథ ముగిశాక మన చెంతకు చేరితే ఆ బాధ, ఫీలింగ్ వేరేలెవెల్. అసలు ఇదేం అదృష్టం రా బాబు అనిపిస్తుంటుంది. అలాంటి ఘటన లండన్ చెందిన ఒక మహిళకు ఎదురయ్యింది. ఎప్పుడో జాబ్‌కి అప్లై చేస్తే..ఏకంగా 48 ఏళ్ల తర్వాత కాల్ లెటర్ వస్తే ఎలా ఉంటుందో చెప్పండి..అప్పటికీ బాధితురాలి వయసు కూడా దాటిపోతుంది కదా..!. సరిగ్గా ఈ మహిళకు కూడా అలానే జరిగింది. ఆమె పేరు టిజీ హాడ్సన్. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు. ఆమె మాజీ స్టంట్ విమెన్. ఆమె జనవరి 1976లో మోటార్‌సైకిల్ స్టంట్ రైడర్ జాబ్‌కి అప్లై చేసింది. ఆ జాబ్ కోసం హాడ్సన్ స్వయంగా తన చేతులతో టైప్ చేసి పోస్ట్ చేసింది. అయితే రిప్లై కోసం కళ్ల కాయలు కాచేలా ఎదురుచూసింది. ప్రతి రోజు ఆశగా కాల్ లెటర్ వస్తుందనుకుని ఆశగా చూసి నిరాశపడేది. ఇక చివరికి ఆమె ఆఫ్రికాకు వెళ్లి స్నేక్ హ్యాండ్లర్, గుర్రాలను మచ్చిక చేసుకునే నైపుణ్యరాలిగా రాణించింది. ఆ తర్వాతన విమానాలు నడపడం వంటివి నేర్చుకుని ఫైలట్ ట్రైనర్‌గా కొన్నాళ్లు వృత్తిని కొనసాగించింది. అయితే తనకు మాత్రం మోటార్‌సైకిల్‌పై స్టంట్ రైడర్‌గా ఉండటం అంటే ఎంతో ఇష్టమని, అందుకోసం తాను మహిళననే విషయం కూడా వెల్లడించలేదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే తాను మహిళనని తెలిస్తే ఇంటర్వ్యూకి పిలవరేమోనని సంకోచించానంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది. ఆమె సందేహానికి తగ్గట్టు ఆ కాల్ లెటర్ చాలా ఆలస్యంగా వచ్చి ఆమెకు కలను ఆవిరి చేసింది. “స్టెయిన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆ ఆ ఇంటర్వ్యూ లెటర్ టిజీ హాడ్సన్ చెంతకు చేరి ఆమెను షాక్‌కు గురి చేసింది. అంతేగాదు తాను ఆ జాబ్ కోసం అప్లై చేసినప్పుడే మోటర్‌సైకిల్ స్టంట్ రైడర్‌గా ఎన్ని ఎముకలు విరిగినా పట్టించుకోనాని కూడా ఆ లేఖలో రాసుకొచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఆ కాల్ లెటర్ ఇప్పటికీ చెంతకు చేరడం బాధ అనిపించినా..ఎముకలు విరగొట్టుకోకూడదనే ఉద్ధేశ్యంతో దేవుడు ఆమెను మరో వృత్తిన ఎంచుకునేలా చేశాడేమో కదూ..!. ఒక రకంగా ఇది దురదృష్టం లాంటి అదృష్టం కదూ..!(చదవండి: 'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!) -
ఎన్నాళ్లో వేచిన ఉదయం..
సాక్షి, అరసవల్లి: గ్రామ స్వరాజ్య పాలన అందించే అధికార సిబ్బంది నియామకాలకు అంతా సిద్ధమైంది. గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. కీలక విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పల్లె, పట్టణ స్థాయిలో ప్రజలకు పాలన మరిం త చేరువకానుంది. ఈమేరకు జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో ప్రతిభ గల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, కాల్‌లెటర్ల పంపిణీని శనివారం అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టారు. రాత పరీక్షల్లో క్వాలీఫై అయినప్పటికీ, రోస్టర్ పాయింట్ల ప్రకారం రిజర్వేషన్ల ప్రాప్తికి తుది జాబితాను ఆయా శాఖాధికారులే స్వయంగా సిద్ధం చేసి, 1ః1 నిష్పత్తిలోనే కాల్‌లెటర్లను జారీ చేశారు. దీంతో కాల్‌లెటర్ సమాచారం అందుకున్న అభ్యర్థికి దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసినట్టే అని చెప్పవచ్చు. సమయం తక్కువున్న కారణంగా శనివారం రాత్రి నుంచి అభ్యర్థులకు నేరుగా మెయిల్ లేదా ఫోన్లో తెలియజేస్తూ ఈనెల 23 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు రావాలంటూ సమాచారమిచ్చారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జెడ్పీ సీఈవో బి.చక్రధరరావు, డిప్యూటీ సీఈవో ఎం.ప్రభావతి, డీపీవో రవికుమార్‌లు తమ సిబ్బందితో కలిసి కసరత్తును పూర్తి చేశారు. ఇందులో వివిధ ప్రభుత్వశాఖాధికారులు కూడా తమ విభాగాల పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ లిస్టులను తయారు చేసి రోస్టర్ పాయింట్ల ఆధారంగా కాల్‌లెటర్ల పంపిణీకి చర్యలు చేపట్టారు. కాల్‌లెటర్లు లేదా సమాచారం అందుకున్న అభ్యర్థులు వెంటనే తమ సర్టిఫికేట్లు, ధ్రువీకరణ పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 929 సచివాలయాల్లో 7326 పోస్టులు.. జిల్లాలో మొత్తం 1141 గ్రామ పంచాయతీల్లో మొత్తం 835 గ్రామ సచివాలయాలను, శ్రీకాకుళం కార్పొరేషన్, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాల్టీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీల్లో మొత్తం 94 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో మొత్తం 929 సచివాలయాల్లో ప్రస్తుతం 13 విభాగాల పోస్టుల కింద 7326 పోస్టులను తాజాగా భర్తీ చేయనున్నారు. అయితే 1ః1 నిష్పత్తిలో మొత్తం 7326 మందికి మాత్రమే కాల్‌లెటర్లు జారీ అయ్యాయి. వీరందరికీ ఈనెల 23 నుంచి సర్టి ఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుకానుంది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఈనెల 27న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను ఆ యా మండల పరిషత్ అధికారులే ఇవ్వనున్నారు. వచ్చే నెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల వ్యవస్థ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్తగా విధుల్లోకి వస్తున్న ఉద్యోగులం తా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు అదనంగా ఇవే సచివాలయాల్లో ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో మొత్తం 679 ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టుల కింద జూనియర్ లైన్మన్ల (జేఎల్ఎం) పోస్టుల భర్తీ కూడా దాదాపుగా పూర్తయినప్పటికీ కో ర్టు కేసు పెండిం గ్ అంశంగా ఉండడంతో ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదు. త్వరలోనే ఇవి కూడా భర్తీ జరిగే అవకాశముంది. రేపటి నుంచి వెరిఫికేషన్.. జిల్లాలో గ్రామ/వార్డు సచివా లయాల పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైన వెంటనే ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ఎంపిక కమిటీ అధికారులు కాల్ లెటర్లను జారీ చేయడం ప్రారంనించారు. ఈమేరకు సమాచారం అంది న అభ్యర్థుల సర్టిఫికేట్లను ఈనెల 23 నుంచి 25 వరకు పరిశీలన చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రం సమీపంలోని మునసబుపేట గాయత్రి డిగ్రీ కళాశాలలో 16 గదులు, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో 18 గ దులు, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళా శాలలో 19 గదులను సిద్ధం చేశారు. ఈమేరకు అభ్యర్థులకు వీలుగా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ఈనెల 23 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) అధికా రులు నిర్వహించనున్నారు. అయితే అ భ్యర్థులంతా తమ విద్యార్హతలతోపా టు ఇతర ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థి తన రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను (వెనుక సొంత అడ్రస్‌తో), అలాగే మొత్తం సర్టిఫికేట్లన్నీ రెండు సెట్ల జిరాక్స్ కాపీలను కూడా వెంట తీసుకురావాల్సి ఉంది. 1:1 నిష్పత్తిలో కాల్‌లెటర్లు జారీ చేయడంతో పోస్టుకు ఒ క్కరే వెరిఫికేషన్‌కు హాజరుకానున్నారు. ఒకటికి మించిన పోస్టుల్లో ఎంపికైన వారున్నా.. లేదా.. వెరిఫికేషన్‌లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కలిగివున్నా వారి స్థానాల్లో ఉద్యోగాల భర్తీని జి ల్లా ఎంపిక కమిటీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ స్థానాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. అభ్యర్థులూ...అప్లోడ్ చేయాల్సినవి ఇవే...! -పుట్టిన తేది సర్టిఫికేట్ (పదో తరగతి సర్టిఫికేట్) -పరీక్షలకు తగిన విద్యార్హతల మార్కుల లిస్టులు -4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (లోకల్) -రెసిడెన్స్ సర్టిఫికేట్ (తహసీల్దార్ మాన్యువల్‌గా జారీ చేసినది) -కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ (రెండు సంవత్సరాల క్రితం జారీ చేసినదైనా అనుమతిస్తారు) -ప్రతి బీసీ అభ్యర్థికి నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్ (తహసీల్దార్ మాన్యువల్‌గా జారీ చేసిన) -లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ (తహసీల్దార్ మాన్యువల్‌గా జారీ చేసిన) -దివ్యాంగుల ధ్రువీకరణ (ప్రభుత్వ వైద్యులు, సదరం ధ్రువీకరణ) -ఎక్స్–సర్వీస్‌మెన్ (జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి ధ్రువీకరణ) -స్పోర్ట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్లు (సంబంధిత జీవోలననుసరించి) వెరిఫికేషన్ కేంద్రాల్లో ఎవరికి...? ఎక్కడ..? సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కీలకం కావడంతో జిల్లా ఎంపిక కమిటీ అధికారులంతా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎంపిక చేసిన మూడు ప్రైవేటు కళాశాలల్లో ఈమేరకు వివిధ రకాల కేటగిరిలకు చెందిన ఉద్యోగాల అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయనున్నారు. ఈమేరకు ప్రత్యేకంగా బోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రానికి ఒక్కో ఫెసిలిటేటర్‌ను కూడా నియమించారు. 1. శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్ల -పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5 -డిజిటల్ అసిస్టెంట్ -విలేజ్ రెవెన్యూ అధికారి (వీఆర్వో) -ఏఎన్ఎం / హెల్త్ అసిస్టెంట్ -పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 2. గాయత్రి (గురజాడ) డిగ్రీ కళాశాల, మునసబుపేట, శ్రీకాకుళం -మత్స్యశాఖ అసిస్టెంట్ -సెరికల్చర్ అసిస్టెంట్ -వ్యవసాయ శాఖ అసిస్టెంట్ -ఉద్యానవన శాఖ అసిస్టెంట్ -మహిళా పోలీస్ -ఇంజినీరింగ్ అసిస్టెంట్ 3. శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్ల -సర్వేయర్ అసిస్టెంట్ -ఎడ్యుకేషన్ అసిస్టెంట్ -మున్సిపాల్టీల్లో శానిటేషన్ అసిస్టెంట్‌తోపాటు ఇతర పోస్టులు అభ్యర్థులూ... ఆందోళన వద్దు ! ‘సమయం చాలా తక్కువుంది... కుల, నివాస, నాన్ క్రీమీలేయర్ వంటి కొత్త సర్టిఫికేట్లు ఎలా వస్తాయి... అధికారులు ఇస్తారో లేదో... అన్న ఆందోళన వద్దు..’ అంటూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎంపిక కమిటీ కన్వీనర్ జె.నివాస్ అభ్యర్థులకు భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశమందిరంలో అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన ఈమేరకు పలు సూచనలు చేశారు. 1ః1 నిష్పత్తిలో ఉద్యోగాల కోసం మెరిట్లో ఉన్న వారికి శని, ఆదివారాల్లోనే కాల్‌లెటర్లు జారీ చేయాలని, వీరికి ఈనెల 23, 24, 25 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మునసబుపేటలోని గాయత్రి డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలో శ్రీశివానీ, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఈమేరకు వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అలాగే జిల్లాలో అన్ని మండలాల తహశీల్దార్లకు కూడా అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ సర్టిఫికేట్ల జారీని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. -అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా అధికారులు వ్యవహరించాలని, ఎవ్వరినీ ఆందోళనకు గురిచేయొద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 23 నుంచి 25 వరకు జరుగనున్న వెరిఫికేషన్‌లో ఎవరైనా ఏవైనా సర్టిఫికేట్లు తేలేని వారుంటే... వారికి ఈనెల 26వ తేదీ సాయంత్రం వరకు గడువు ఇవ్వాలని, ఈలోగా అభ్యర్థులు సర్టిఫికేట్లను సమర్పించాలని సూచిం చారు. -కులధ్రువీకరణ పత్రం (కమ్యూనిటీ సర్టిఫికేట్) విషయంలో కూడా రెండేళ్ల క్రితం ఇచ్చిన సర్టిఫికేటు అయినా అధి కారులు అనుమతి ఇవ్వాల్సిందే... ఒకవేళ తాజాగా ఇవ్వాల్సి వస్తే... తహశీల్దార్లు మాన్యువల్‌గా ఇవ్వాలి. ప్రతి బీసీ అభ్యర్థికి నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ సర్టిఫికేట్‌ను బీసీ అభ్యర్థులందరికీ తహశీల్దార్లు మాన్యువల్‌గా ఇవ్వాలి -ఒరిజినల్ హాల్టిక్కెట్టును మాత్రం అభ్యర్థి వెంట తప్పనిసరిగా తీసుకురావాలి. -కాల్ లెటర్ రాగానే అభ్యర్థి అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లు, వెరిఫికేషన్‌లో చూపించిన సర్టిఫికేట్లు సరిపడాల్సి ఉంటుంది. -4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లను సమర్పించిన వారు లోకల్‌గానూ గుర్తించాలి. నాన్‌లోకల్‌లో ఉన్న వారు ఆయా ప్రాంత రెసిడెన్స్ సర్టిఫికేట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను కూడా చూపించాల్సి ఉంటుంది. -ఐటిఐ లేదా డిప్లమో చదివిన అభ్యర్థులు, ఇంజినీరింగ్ చదువుతుంటే.. వారి నుంచి సర్టిఫికేట్లను ఆశించలేమని, అలాంటి సందర్భాల్లో మానవతా దృక్పథంతో ధ్రువీకరించుకుని అవకాశమివ్వాలని సూచించారు. -అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా, అలాగే అర్హులకు అవకాశంలో తేడాలు లేకుండా రోస్టర్ జాబితా నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వరకు అధికారులు శ్రద్ధగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. -
ఇంటర్వ్యూ రోజే కాల్‌లెటర్
పోస్టాఫీస్ అధికారుల నిర్లక్ష్యం నిరుద్యోగికి శాపం కరీంనగర్: పోస్టల్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుద్యోగికి శాపమైంది. హుస్నాబాద్ పట్టణానికి చెందిన చుక్క తిరుపతి కోర్టులో అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హైదరాబాద్‌లో ఈ నెల 22న జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈ నెల 14న కాల్‌లెటర్‌ను స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. కాల్‌లెటర్ ఈ నెల 16న హుస్నాబాద్ పోస్టాఫీస్‌కు వచ్చింది. పోస్టుమ్యాన్ లీవ్‌లో ఉండగా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. అప్పటికి తిరుపతి పలుమార్లు కాల్‌లెటర్ కోసం పోస్టాఫీస్‌లో వాకబు చేసినా రాలేదనే సమాధానం చెప్పారు. తిరిగి విధులకు చేరిన పోస్ట్‌మెన్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కాల్‌లెటర్ తిరుపతికి అందించాడు. తిరుపతి దాన్ని తెరిచి ఆతృతగా చూడగా 22న ఇంటర్వ్యూకు రావాలని ఉండగా, ఇదే రోజు కాల్‌లెటర్ అందడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. కాల్‌లెటర్ వచ్చి ఆరు రోజులు గడిచినా సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయానని ఎస్పీఎం సంపత్‌ను నిలదీశాడు. పోస్ట్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.