breaking news
Bihar Deputy Chief Minister
-
డిప్యూటీ సీఎం పోస్ట్.. చిరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తాను దురాశపరుడిని కాదంటున్నారు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్. ఎన్డీఏ కూటమికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి తమకు దక్కకపోవడం పట్ల ఎలాంటి విచారం లేదన్నారాయన. డిప్యూటీ సీఎం పదవి ఎల్జేపీకి రాకపోవడంపై పట్నాలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, జేడీయూ నుంచి విజయ్ కుమార్ సిన్హాలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించిన సంగతి తెలిసిందే.బిహార్ ప్రభుత్వంలో తమకు దక్కిన దానితో సంతోషంగా ఉన్నానని, తనకు దురాశ లేదని చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) అన్నారు. తనపై విశ్వాసం ఉంచి శాసనసభ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇచ్చారని గుర్తుచేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో తమ పార్టీకి రెండు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని తెలిపారు. ఇంతకంటే ఎక్కువ ఆశించడం దురాశ అవుతుందని వ్యాఖ్యానించారు.దురాశపరుడిని కాదు''ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశిస్తే నా కంటే కృతఘ్నడు, దురాశాపరుడు ఎవరు ఉండరు. మా పార్టీకి ఎన్డీఏ ఇంత చేసిన తర్వాత కూడా నేను బాధ పడుతూ ఉంటే.. సంతోషాన్ని ఎలా ఆస్వాదించాలో నాకు తెలియదన్నట్టుగా ఉంటుంద''ని చిరాగ్ పేర్కొన్నారు.విశ్వాసపాత్రుడిగా ఉంటాకష్టకాలంలో తన వెంటే నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి విశ్వాసపాత్రుడిగా ఉంటానని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ''నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు ఆలోచించాలి. 2021లో నా చుట్టూ ఒక్క వ్యక్తి కూడా లేడు. మా పార్టీ చీలిపోయింది. ప్రధానమంత్రి నాపై నమ్మకం ఉంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీకి ఐదు సీట్లు ఇచ్చారు. వారి నమ్మకం కారణంగానే నేను మళ్లీ పుంజుకున్నాను. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన''ని చెప్పారు.ఓడిపోయే సీట్లు ఇచ్చారు.. అయినా గెలిచాంబిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే స్థానాలను ఎల్జేపీకి కట్టబెట్టారనే కామెంట్స్‌పై చిరాగ్ స్పందిస్తూ.. అది నిజమేనని అంగీకరించారు. తమ పార్టీకి చెందిన 29 మంది అభ్యర్థుల్లో 26 మంది ఓడిపోయే స్థానాల్లో పోటీ చేశారన్నది ముమ్మాటికీ వాస్తమని పేర్కొన్నారు. అయితే తమ పార్టీ అంచనాలను తలకిందులు చేసి 19 సీట్లు గెలిచిందని తెలిపారు.చదవండి: బిహార్ కేబినెట్లో బిగ్ సర్ప్రైజ్!తమ పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) ఆశిస్తున్నట్టు ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీయూకు తిరుగులేని ఆధిక్యం లభించడంతో చిరాగ్ డిమాండ్ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇచ్చిన రెండు మంత్రి పదవులతో ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బిహార్ మాజీ ముఖ్యమంత్రికి వచ్చిన కేన్సర్ ఎలాంటిదంటే?
బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం (మే 13) మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరు నెలల క్రితమేకేన్సర్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. గొంతు కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ సీఎం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. అతనుఈ కేన్సర్ లక్షణాలు ఏమిటో? నివారణ మార్గాలేమిటో? ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ శంకర్ తెలియజేశారు.బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ గొంతు కేన్సర్‌కి గురవడంతో.. ఈ వ్యాధి క్రమంగా అతని ఊపిరితిత్తులకు చేరుకుంది. దీంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో గొంతు కేన్సర్ లక్షణాలు, కారణాలు తెలుసుకుందాం.ఇవి.. గొంతు కేన్సర్ లక్షణాలు..– ఒక వ్యక్తికి తరచుగా దగ్గు సమస్య ఉన్నా, ఆహారం మింగడంలో ఎలాంటి ఇబ్బంది కొనసాగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి– ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే గొంతు కేన్సర్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.– దీనినే 'అన్నవాహిక' కేన్సర్ అని కూడా పిలుస్తారు. లక్షణాలు– కేన్సర్ కారణంగా.. గొంతునొప్పితో బాధపడుతున్న వ్యక్తి వాయిస్ ముద్దగా మారుతుంది.– ఆహారం తినేటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతోపాటుగా వాపు కూడా సంభవిస్తుంది.– బాధితుడు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. చెవి నొప్పి కూడా రావచ్చు.– దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది.– అలాగే బరువులో మార్పులు కూడా కనిపిస్తాయి. గొంతు కేన్సర్‌కు కారణమేమిటి?– ఒక వ్యక్తి నిరంతరం ధూమపానం చేయడంతో గొంతు కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది.– పొగాకు సేవించే వారిలోనూ ఈ వ్యాధి సోకే ప్రభావం ఉంది.– అలాగే ధూమపానంతోపాటు , మద్యం సేవించే వారికి కూడా గొంతు కేన్సర్ వస్తుంది.– ఈ వ్యాధి విటమిన్ ఎ లోపం వల్ల కూడా రావచ్చు.మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?– కేన్సర్ ప్రమాదకరమైన ఒక ప్రాణాంతక వ్యాధి.– శరీరంలోని ఏదైనా భాగంలో కేన్సర్ సోకితే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. అశ్రద్ధ వహిస్తే క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది.– గొంతు కేన్సర్ ఆహార నాళ ద్వారాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.– గొంతులో అకస్మాత్తుగా భారం, వాయిస్‌లో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డా. అభిషేక్ శంకర్ తెలిపారు.ఇవి చదవండి: ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి -
పట్నా హాస్పిటల్ లో తేజస్వియాదవ్ ఆకస్మిక పర్యటన
-
డిప్యూటీ సీఎంకు 44వేల పెళ్లి ఆఫర్లు!
-
44వేల పెళ్లి ప్రతిపాదనలు
పట్నా: బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ (26)కు 44 వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. తమ ప్రాంతాల్లో సరైన రహదారులు లేకుంటే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదులు పంపాలని తేజస్వీ ఒక నంబరు ఇచ్చారు. దీంతో ఆ వాట్సాప్ నంబరుకు సమస్యలకు బదులు పెళ్లి ప్రతిపాదనలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రియ, అనుపమ, మనీషా, కాంచన, దేవికా ఇలా 44 వేల మంది యువతులు ప్రతిపాదనలు పంపారు. అంతేకాదు.. వీరంతా తమ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంపారు. శరీర కొలతలు, రంగు, ఎత్తు తదితర సమాచారంతో మెసేజ్‌లు పంపారు. వాట్సాప్ నంబర్ తేజస్వీదిగా భావించి యువతులందరూ ఇలా పెళ్లి ప్రతిపాదనలు పంపారని అధికారులు తెలిపారు. ‘నాకు పెళ్లి అయి ఉంటే చాలా ఇబ్బందుల్లో పడేవాడిని, పెళ్లి కానందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని’ తేజస్వీ చమత్కరించారు. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్ రాజకీయాల్లోకి రాకముందు క్రికెటర్‌గా రాణించారు. తేజస్వితోపాటు లాలూ మరో కొడుకు, ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్‌కు కూడా ఇంకా వివాహం కాలేదు. -
డిప్యూటీ సీఎంకు 44వేల పెళ్లి ఆఫర్లు!
బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇప్పుడక్కడ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఎందుకంటే, ఎక్కడైనా రోడ్లు బాగోకపోతే ఫిర్యాదుచేయాలని ఆయన ఒక నెంబర్ ఇస్తే.. దానికి బదులు ఆయన్ను పెళ్లి చేసుకుంటామంటూ ఏకంగా 44వేల ప్రపోజల్స్ ఆ నంబరుకు వాట్సప్‌లో వచ్చాయట. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ప్రియ, అనుపమ, మనీష, కంచన్, దేవిక.. ఇలా మొత్తం 44 వేల మందికి పైగా అమ్మాయిలు ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకోడానికి సిద్ధమంటూ ప్రతిపాదనలు పంపారు. ఈ నంబరుకు మొత్తం 47వేల మెసేజిలు వచ్చాయని, వాటిలో 44వేలు ఈ పెళ్లి ప్రతిపాదనలేనని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కేవలం 3వేల మెసేజిలు మాత్రమే రోడ్ల గురించి ఉన్నాయి. తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు లాంటి వివరాలన్నింటినీ కూడా ఆ మెసేజిలలో ఇచ్చారు. కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడి.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తేజస్వి యాదవ్ (26).. ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ చిన్న కొడుకు. చాలామంది అది తేజస్వి యాదవ్ సొంత నెంబరు అనుకుని ఈ మెసేజిలు పెట్టేశారట. ఇప్పటికి తాను ఇంకా బ్రహ్మచారిని కాబట్టి సరిపోయింది గానీ, పెళ్లి అయి ఉంటే తాను పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉండేవాడినని తేజస్వి సరదాగా అన్నారు. అయితే తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించే తేజస్వికి గతంలో ఒక విద్యార్థి తనకు రావల్సిన స్కాలర్షిప్ రావట్లేదంటూ ఫేస్బుక్లో ఫిర్యాదుచేయగా, ఆయన సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే ఇప్పించారు. -
'ముఖాన్ని చూసి తీర్పు ఇవ్వకండి'
పట్నా: బిహార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనపై వస్తున్న విమర్శలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి ఆదివారం బదులిచ్చారు. తన పనితీరు చూడకుండనే ముందే తీర్పు చెప్పడం సరికాదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. 'బ్రాండ్ బిహార్'ను మరింతగా పెంచి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గర్వకారణంగా తాను నిలుస్తానని ఆయన ప్రతిన బూనారు. బిహార్ ప్రజలు యువతపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముకాకుండా.. వారికి అభివృద్ధి ఫలాలు అందిస్తానని 26 ఏళ్ల తేజస్వి చెప్పారు. 'ముఖాన్ని చూసి ముందే అంచనాకు రాకూడదు. తీయని అమృతమైనా, చేదు ఔషధమైనా దాని ప్రభావాన్ని చూపించేందుకు కొంత సమయం తీసుకుంటుంది' అని తేజస్వి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తేజస్వి విద్యా అర్హతలు, రాజకీయ అనుభవంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందిస్తూ 'మా కుటుంబంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చూశాను. నాకు అనుభవం లేకపోవచ్చు కానీ ఏమీ తెలియని వాడినైతే కాను. నితీశ్ జీ నేతృత్వంలో ప్రభుత్వం పనితీరును ఇంకా బాగా నేర్చుకుంటాను. నేను అనర్హుడినని ఎలా అంటారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని నేను' అంటూ ఆయన విమర్శకులకు బదులిచ్చారు.


