breaking news
banjarahills road number 3
-
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలను రోడ్డుమీదకు తీసుకు వస్తుండటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిసున్నా.. తాగి వాహనాలు నడిపే వారిని జైలుకి పంపిస్తున్నా వారిలో ఇంకా మార్పు రావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయటమే కాకుండా.. అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను మరువక ముందే తాజాగా నగరంలో మరో రెండు చోట్ల కార్లు బీభత్సం సృష్టించాయి. కర్మన్‌ఘాట్ కర్మన్‌ఘాట్ చౌరస్తాలో ఆదివారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీన్ని బట్టి అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో మల్లికార్జున్(డ్రైవింగ్), సాయిరామ్, సాయినాథ్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు కళ్యాణ్ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో గాయాలపాలైన కళ్యాణ్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో సాయిరామ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా.. కళ్యాణ్, సాయినాథ్‌లు పిలిప్స్ కంపెనీ లో మార్కెటింగ్ చేస్తున్నారు. మల్లికార్జున్ ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. గుర్రం గూడలో ఓ గెట్ టు గెదర్ పార్టీకి వెళ్ళి చంపాపేట్కి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు కళ్యాణ్ తెలిపారు. స్థానికల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ కాగా ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మరో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రాయల్ టిఫిన్స్ హోటల్లోకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత అందులో ఉన్న యువకులు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. కారు నెంబర్ ఆధారంగా యువకులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీకెండ్ కావడంతో ఫుల్లుగా తాగి రోడ్డు మీదకు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
బంజారా 'కిల్స్'.. రోడ్ నంబర్ 3
- హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్: మంగళవారం మధ్యాహ్నం.. సమయం 1.30 గంటలు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 ప్రాంతం.. సాగర్ సొసైటీ చౌరస్తా వైపు నుంచి దూసుకొచ్చిన ఓ కారు ఒక్కసారిగా అదుపుతప్పింది.. డివైడర్‌ను బలంగా ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది.. అదే వేగంతో అవతలివైపు రోడ్డులో తలకిందులుగా బోల్తాపడింది.. ఈ ఘటనలో ఫసాహత్ అలీ (19) అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దాదాపు ఏడాది కిందట చిన్నారి రమ్య కుటుంబాన్ని చిదిమేసిన ప్రమాద స్థలానికి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. కాలేజీ ప్రారంభమైన రోజే.. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌లో నివసించే ఫసాహత్ అలీ (19) ఇక్కడి రోడ్ నంబర్ 3లోని ముఫకంజా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో వారి తరగతులు మంగళవారమే ప్రారంభమయ్యాయి. కాలేజీకి వెళ్లిన ఫసాహత్ అలీ.. మధ్యాహ్నం భోజనం కోసం తోటి విద్యార్థులు బనీష్ జావేద్ (19), వాహిద్ (19)లతో కలసి తన ఐ–20 (టీఎస్ 09 ఈబీ 6049) కారులో బయటికి వచ్చాడు. రోడ్ నంబర్ 3లోని గ్రీన్ మసీదు పక్కన ఉన్న ఆల్ సీజన్స్ రెస్టారెంట్లో వారు భోజనం చేశారు. అనంతరం తిరిగి కాలేజీకి బయలుదేరారు. ఈ సమయంలో ఫసాహత్ వాహనం నడుపుతుండగా.. పక్కన సీటులో జావేద్, వెనుక వాహిద్ కూర్చున్నారు. సీటు బెల్టు కూడా పెట్టుకోని ఫసాహత్ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆటోను తప్పించే క్రమంలో.. ఫసాహత్ రోడ్ నంబర్ 2లో కాస్త ముందు వరకు వెళ్లి.. సాగర్ సొసైటీ చౌరస్తాలో కారును యూటర్న్ తీసుకున్నాడు. ఖైరతా బాద్ మండల కార్యాలయం దాటాక ఉన్న చిన్న మలుపు వద్ద కారు వేగాన్ని పెంచాడు. అయితే అక్కడ రోడ్డుకు ఎడమ వైపు బస్టాప్ ఉంది. దాంతో ప్రయాణికులెవరైనా ఎక్కుతా రనే ఉద్దేశంతో ఓ ఆటో నెమ్మదిగా వెళు తోంది. ఈ ఆటోను ఓవర్టేక్ చేసేందుకు ఫసాహత్ కారును ఒక్కసారిగా కుడివైపునకు తిప్పాడు. ఆ సమయంలో గంటకు 100 కిలో మీటర్లకుపైగా వేగంతో దూసుకెళ్తుండటం, అక్కడ రోడ్డు పల్లంగా ఉండటంతో.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మూడు పల్టీలు కొట్టి అవతలి వైపు రోడ్డులో బోల్తా పడింది. కారు తలకిందులుగా బలంగా నేల కు కొట్టుకోవడంతో డ్రైవింగ్ సీటులో ఉన్న ఫసాహత్ తల పగిలింది. దాంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పక్కన కూర్చున్న బనీష్కు తీవ్రగాయాలయ్యాయి. వెనుకాల కూర్చున్న వాహిద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తప్పిన పెను ప్రమాదం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2, 3 ప్రాంతాలు నిత్యం విపరీతమైన రద్దీతో ఉంటాయి. అయి తే తాజా ప్రమాదం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జరగడంతో రోడ్డుపై వాహనాల రద్దీ తక్కువగా ఉంది. లేకుంటే ఈ కారు అవతలివైపు రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడి ఉండేది. దాదాపు ఏడాది కింద రోడ్ నంబర్ 3లోనే అతివేగంగా వెళుతున్న ఓ కారు.. డివై డర్‌ను ఢీకొని పల్టీకొట్టి అవతలివైపు వెళుతున్న మరో కారుపై పడింది. ఆ ఘటనలో చిన్నారి రమ్య, ఆమె బాబాయి, తాతలు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కూడా. కానీ మంగళవారం మధ్యాహ్నం వాహనాల రద్దీ ఎక్కువగా లేని సమయంలో ప్రమాదం జరగడంతో ఇతరులెవరికీ ముప్పు వాటిల్లలేదు. అప్పటికీ కొద్ది క్షణాల ముందు రెండు మూడు వాహనాలు ప్రమాద ప్రాంతానికి సమీపంగా వెళ్లాయి. (సీసీ టీవీలో రికారై్డన ప్రమాద దృశ్యాలు.. పల్టీకొట్టిన కారు) అదో మాయ ‘దారి’! బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2, రోడ్ నంబర్ 3 రెండూ కలిసే ఉంటాయి. దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గాన్ని కైఫీ అజ్మీ రోడ్‌గా కూడా పిలుస్తారు. నిత్యం రద్దీగా ఉండటంతో పాటు ప్రముఖులు ప్రయాణించే ఈ రోడ్డులో అనేక ఇంజనీరింగ్ లోపాలున్నాయి. చాలా చోట్ల ఎగుడుదిగుడుగా ఉంటుంది. మలుపుల వద్ద కూడా ఓ వైపు పల్లంగా ఉంటుంది. దీంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పే అవకాశం ఉంటుంది. ఏడాది కింద రమ్య ఉదంతం సమయంలోనూ.. డ్రైవింగ్æ నిర్లక్ష్యంతో పాటు రోడ్ ఇంజనీరింగ్ లోపం కూడా ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. అయినప్పటికీ ఆ లోపాలను సరిచేయడంపై దృష్టి పెట్టలేదు. దీంతో ఈ రహదారి తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. ‘రెస్పాన్స్’టైమ్ ఉంటే.. ‘సాహత్ అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. వాహనాన్ని నిలిపేసేందుకు (బ్రేక్ వేసేందుకు) అవసరమైన ‘రెస్పాన్స్ టైమ్’లేనందునే అదుపు తప్పిందని వివరిస్తున్నారు. వాహనం నడిపేవారు సాధారణంగానే ముందున్న పరిస్థితులను గమనిస్తుంటారు. ఎదురుగా వాహనాలు, గుంతలు, మలుపులు.. వంటివి ఉన్నప్పుడు బ్రేక్ వేయడానికో, పక్కకు తప్పించడానికో ప్రయత్నిస్తారు. ఇలా వాటిని గుర్తించడానికి, బ్రేక్ వేయడం/మలుపు తిప్పడం వంటి స్పందనకు మధ్య కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా ‘రెస్పాన్స్ టైమ్’అంటారు. ఈ రెస్పాన్స్ టైమ్‌లోనే వాహనం కొంత మేర ముందుకు వెళ్లిపోతుంది. వాహనం వేగాన్ని, రోడ్డు పరిస్థితిని బట్టి రెస్పాన్స్ టైమ్‌లో ఎంతదూరం ముందుకు వెళుతుందనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంటే.. రెస్పాన్స్ టైమ్‌లో ఎక్కువ దూరం ముందుకు వెళుతుంది. బ్రేక్ వేసేలోపే ప్రమాదానికి గురవుతుంది.