breaking news
avanthi college
-
అధికారం ఇచ్చే శక్తి యువతకే ఉంది : రామ్‌చరణ్
విజయనగరం జిల్లా : తలుచుకున్న పార్టీకి అధికారం ఇచ్చే శక్తి ఒక్క యువతకే ఉందని సినీ నటుడు రామచరణ్‌తేజ్ అన్నారు. మండలం చెరుకుపల్లిలో రెండురోజులుగా నిర్వహిస్తున్న ఆవెన్సిస్ 2017 ముగింపు కార్యక్రమానికి ఆదివారం రాత్రి ఆయన వచ్చారు. మధ్యాహ్నం 4.30 గంటలకే రామచరణ్ వస్తున్నాడని తెలిసిన యువకులు భారీ సంఖ్యలో అవంతి కళాశాలకు చేరుకున్నారు. అనుకోని కారణాల వల్ల రాత్రి 9గంటలకు వచ్చినా అభిమాన నటుడిని చూసేందుకు యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా ఎదురుచూశారు. వారిని ఉత్సాహపరిచేందుకు సినీ నేపథ్యగాయకుడు యజిన్‌నజర్ సినీగీతాలతో అలరించారు. రామచరణ్ తేజ్ రాగానే మెగాస్టార్, మగధీర అంటూ విద్యార్థులు కేకలు పెట్టారు. వారిని అదుపుచేయడం పోలీసుల వల్ల కాలేదు. వేదికమీదకు వచ్చిన రామ్‌చరణ్‌తేజ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అవంతి కళాశాలకు రావడం, విద్యార్థులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు తలుచుకుంటే జరగనది ఏదీ లేదని, అయితే తలచుకోవడంలేదని అన్నారు. తాను చిన్నప్పటినుంచి స్టార్‌ని కావాలని ఆశపడ్డాను.. దానిని సాధించడంకోసం చాలా కష్టపడ్డానని అన్నారు. విద్యార్థులను చూస్తుంటే కాలేజ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అవంతి యాజమాన్యం తనకు సీటు ఇస్తే చదువు సాగిస్తానంటూ చమత్కరించారు. సినిమాల గురించి మాట్లాడుతూ ఖైదీనెం–150 మంచి పేరు తీసుకువచ్చిందన్నారు. త్వరలో కాటమరాయుడు రానుందని, తను నటిస్తున్న సుకుమారుడు సినిమా కూడా హిట్ చేయాలని అన్నారు. అనంతరం పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అవంతి విద్యాసంస్థల చైర్మన్, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎండి శ్రావణ్ కుమార్, జనరల్ సెక్రటరీ ప్రియాంక, ప్రిన్సిపాల్లు దివాకర్, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
చాంప్స్ కస్తూర్బా, అవంతి కాలేజి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల టీమ్ టైటిల్‌ను అవంతి కాలేజి గెలుచుకుంది. మహిళల టీమ్ టైటిల్‌ను కస్తూర్బా గాంధీ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంగళవారం ఈ పోటీలు ముగిశాయి. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 46 పాయింట్లతో అవంతి కాలేజి జట్టు అగ్రస్థానంలో నిలవగా నిజాం కాలేజి జట్టు (26) రెండో స్థానం, భవాన్స్ కాలేజి (24, సైనిక్‌పురి) జట్టు మూడో స్థానం పొందాయి. అలాగే మహిళల విభాగంలో కస్తూర్బా గాంధీ కాలేజి 68 పాయింట్లుతో తొలి స్థాన ంలో నిలిచింది. గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(జీసీపీఈ, 35.5) రెండో స్థానం, భవాన్స్ కాలేజి (20) మూడో స్థానం పొందింది. ఈ మీట్లో ప్రతిభ కనబర్చిన సైనిక్‌పురి భవాన్స్ కాలేజి అథ్లెట్ ఎం.రత్న కుమార్ 940 పాయింట్లతో ఉత్తమ అథ్లెట్‌గా, కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి, 884) ఉత్తమ మహిళా అథ్లెట్‌గా అవార్డులను అందుకున్నారు. ముగింపు వేడుకలకు ఓయూకు చెందిన భారత అథ్లెట్ నజీబ్ ఖురేషి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందించారు. ఫెనల్స్ ఫలితాలు: మహిళల విభాగం:100 మీ: కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. బి. సాహితి (వెస్లీ కాలేజి), 3.పి.శ్రీలత(కస్తూర్బా గాంధీ కాలేజి). 400 మీ: 1.సి.హెచ్.హర్షిత (లయోలా అకాడమీ), 2. ఎస్.కె.షబ్నమ్ (విల్లా మేరీ కాలేజి), 3.భావన (కస్తూర్బా గాంధీ కాలేజి). 1500 మీ: 1.డి.వైష్ణవి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.జి.లలిత (జీసీపీఈ), 3.అఫ్రీన్ బేగం (విల్లా మేరీ కాలేజి). 100 మీ (హర్డిల్స్): 1.హేమలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.కె.వి.రోషిణి(లయోలా అకాడమీ), 3. లాస్య రెడ్డి (విల్లా మేరీ కాలేజి). ట్రిపుల్ జంప్: 1.కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.పి.సరిత(జీసీపీ), 3.బి.మోనిక (జీసీపీఈ). జావెలిన్ త్రో: 1.కె.రమ్య (భవాన్స్ కాలేజి), 2.కె.మమత (జీసీపీఈ), 3. షహీన్ (జీసీపీఈ). హ్యామర్‌త్రో: 1.యశస్విని (భవాన్స్ కాలేజి), 2. కె. నాగ అనూష (సెయింట్ పాయిస్ కాలేజి), 3. కాజల్ (కస్తూర్బా గాంధీ కాలేజి). ఫురుషుల విభాగం 100మీ: 1.ఈశ్వర్ రెడ్డి (11 సెకన్లు, అవంతి కాలేజి), 2.జి.అనిల్ కుమార్ (రైల్వే కాలేజి), 3.ఎల్.తేజవర్ధన్ రెడ్డి (అరుణోదయ కాలేజి). 400మీ: 1.ఎం.రతన్ కుమార్ (భవాన్స్ కాలేజి), 2. ఎం.జెమ్య(అవంతి కాలేజి), 3.టి.రవి కుమార్ (నిజాం) 1500మీ:1.టి.కృష్ణయ్య (మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజి), 2.ఎస్.దినేష్ కుమార్ (అవంతి కాలేజి), 3.కె.రాములు (వి.వి.కాలేజి). 10,000మీ: 1.బుచ్చయ్య (యూసీపీఈ), 2.డి.హరీష్(జీసీపీఈ), 3.సూర్య ప్రకాష్ (సిటీ గవర్నమెంట్ కాలేజి). 110మీ (హర్డిల్స్): 1.హర్షవర్ధన్ (అరుణోదయ కాలేజి), 2. చంద్రబాబు (భవాన్స్ కాలేజి), 3.ప్రవీణ్ (ఎ.వి.కాలేజి). ట్రిపుల్ జంప్: 1. ప్రవీణ్ (ఎ.వి.కాలేజి), 2. పి.భాను ప్రతాప్ (వసుంధర కాలేజి), 3.పి.ఎన్.సాయి కుమార్ (రైల్వే కాలేజి). జావెలిన్‌త్రో: 1.ఎస్.కిరణ్ కుమార్ (జీసీపీఈ), 2.కుమార్ (మెథడిస్ట్ కాలేజి).