breaking news
arimilli Radhakrishna
-
సీజ్ ద ఆటో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరుకు చెందిన ఆటో డ్రైవర్ పంజా దుర్గారావుపై రెచ్చిపోయారు. ఆటోపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫొటోలను చూసి ఆటోను వెంబడించి మరీ రోడ్డుపై ఆపి డ్రైవర్‌పై బూతు పురాణంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోకు అడ్డంగా కారు పెట్టి, తణుకు పోలీసులను పిలిపించి స్టేషన్‌కు తీసుకెళ్లమని ఆదేశించారు. ఆటోను సీజ్ చేయించారు. ఎలాంటి కేసు లేకున్నా, రాత్రి ఎనిమిది గంటలైనా ఆటో డ్రైవర్‌ను స్టేషన్లోనే ఉంచడం తణుకులో చర్చనీయాంశమైంది. దుర్గారావు ప్రతిరోజూ కానూరు నుంచి తణుకుకు సర్వీస్ ఆటో నడుపుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అభిమానంతో ఆటోపై వైఎస్ జగన్, కారుమూరి ఫొటోలను వేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉండ్రాజవరం రోడ్డులోకి ఆటో ప్రవేశించింది. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన వాహనంలో వస్తున్నారు. ఎమ్మెల్యే కారును గమనించి దుర్గారావు దారి ఇచ్చాడు. అయినా ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్లకుండా దుర్గారావు నడుపుతున్న ఆటోను అనుసరించింది. ఈ క్రమంలో ఆటోను పూర్తిగా పక్కకు నిలిపి, దారి ఇచ్చినా ఎమ్మెల్యే కారు ముందుకు వెళ్లలేదు. ఒక కిలోమీటరు దాటిన తర్వాత తణుకులోని రాష్ట్రపతి రోడ్డులో ఆటోను ఓవర్టేక్ చేసి, ఎదురుగా కారు నిలిపి.. ఎమ్మెల్యే కిందకు దిగారు. అసభ్య పదజాలంతో దుర్గారావుపై విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపైనా బూతు పురాణంతో రెచ్చిపోయారు. తణుకు టౌన్ సీఐ కొండయ్యకు ఫోన్ చేసి రప్పించారు. రావాలని ఆదేశించిండంతో సీఐ ఆగమేఘాల మీద వచ్చి ఆటో డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎంఈఐ శ్రీనివాస్‌ను కూడా రప్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆటో.. పశ్చిమగోదావరిలోకి వచ్చిందంటూ.. ఆటోను సీజ్ చేసి రూ.3,400 జరిమానా విధించారు. ఆ తర్వాత ఆటోకు విధించిన చలానా మొత్తాన్ని చెల్లించినా, ఎమ్మెల్యే చెబితేనే వాహనం ఇస్తామని రవాణా శాఖా«ధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటలైనా దుర్గారావును విడిచి పెట్టలేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా అనుమతించ లేదు. స్థానిక టీడీపీ నేతలతో దుర్గారావుపై ఫిర్యాదు చేయించేందుకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.ఎమ్మెల్యేది నీతిమాలిన చర్య ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిని మరచి సామాన్య ఆటో డ్రైవర్‌పై ప్రతాపం చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎస్ఐని కింద కూర్బోబెట్టడం, కానిస్టేబుల్‌ను దుర్భాషలాడటం, మహిళ ఛాతీపై గుద్దుకుంటూ వెళ్లిపోవడం లాంటి దిగజారుడు పనులు చేశారని గుర్తు చేశారు. దుర్గారావును ఇబ్బంది పెడితే పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని కారుమూరి హెచ్చరించారు. -
కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
-
కదం తొక్కిన మహిళలు
సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే ఆందోళనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక సీఎం చంద్రబాబు తమనుమోసగించారని ధ్వజం వేల్పూరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇల్లు ముట్టడి దువ్వలో ఎంపీపీ అనంతలక్ష్మి ఘెరావ్ ఇరగవరం/తణుకు రూరల్ : రుణమాఫీ కోరుతూ డ్వాక్రా మహిళలు కదం తొక్కారు. పూటకో మాట చెబుతున్న సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. డ్వాక్రా రుణాలను తక్షణమే పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటిని ముట్టడించారు. రేలంగి నుంచి పాదయూత్రగా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చేరుకున్నారు. వేల్పూరులో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తక్షణమే రుణాల్ని మాఫీ చేయూలని, ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో మాఫీని వర్తింపచేయూలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని, ఒక్క పైసా కూడా చెల్లించవద్దని చెప్పిన చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి రుణమాఫీని రూ.లక్షకు కుదిస్తామనడం సరికాదని, దీనిపై స్పష్టత ఇవ్వకుండా కాలయూపన చేస్తున్న ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మహిళల్ని నమ్మించి మోసగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ విషయంపై స్పష్టత ఇచ్చేంతవరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. మండుతున్న ఎండలో సుమారు గంటన్నరపాటు మహిళలంతా ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించారు. ఒక దశలో మహిళలు ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, తణుకు రూరల్ ఎస్సై కె.గంగాధరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. తణుకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వల్లూరి వెంకటరామ్మోహన్, రేలంగి గ్రామానికి చెందిన ఇరగవరం మండల జెడ్పీటీసీ సభ్యుడు చుక్కా సాయిబాబు, టీడీపీ నాయకుడు బిరదా వీరబాపన్న మహిళలతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే అందుబాటులో లేరని, ఆదివారం రేలంగి గ్రామానికి నేరుగా వచ్చి డ్వాక్రా మహిళల్ని కలుస్తారని సర్దిచెప్పడంతో వెనుతిరిగారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుంటే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. మోసగించడం దారుణం రుణమాఫీ అంటూ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపించారు. ఎన్నో ఆశలు చూపించి చివరకు మోసం చేయడం దారుణం. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిచాక మాట దాట వేస్తున్నారు. -ఎ.రత్నమాల, రత్న గ్రూప్ అప్పులు ఎలా తీర్చేది రుణమాఫీ ఆశ పెట్టకపోతే బ్యాంకోళ్లకు సక్రమంగా డబ్బు చెల్లించేవాళ్లం. పూర్తి రుణమాఫీ అనడంతో డబ్బు కట్టడం మానేశాం. ఇప్పుడు పూర్తిగా రుణమాఫీ చేయకపోతే పేరుకుపోయిన అప్పుల్ని ఎలా తీర్చేది. తక్షణమే పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయాలి. -దిర్శిపో అచ్చమ్మ, కరుణ గ్రూప్ హామీలు గుర్తు లేవా ఎన్నికల్లో మాట ఇవ్వబట్టే కదా నమ్మి ఓట్లు వేశాం. ఇంటింటికీ వచ్చి మీరు ఇచ్చిన హామీలు గుర్తు లేవా. వెంటనే ఇచ్చిన హామీ అమలు చేయండి. పేరుకుపోయిన రుణాలు చెల్లించాలంటే మా కుంటుంబాలపై తీవ్ర భారం పడుతుంది. ఆర్థికంగా నష్టపోతున్నాం. - పాములపర్తి వరలక్ష్మి, గ్రేసమ్మ గ్రూప్ మాట నిలబెట్టు కోవాలి వడ్డీతో కలిపి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నమ్మి ఓటు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఒక్కొ క్క సంఘానికి రూ.లక్ష మాఫీ చేస్తామంటున్నారు. ఆ డబ్బు వడ్డీకైనా సరిపోతుందా. రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసి మాట నిలబెట్టుకోవాలి - సోడదాసి సరోజని, రక్షణ గ్రూప్