breaking news
apthakaryadarshi
-
కృష్ణ జిల్లాలో ఆప్త కార్యక్రమం
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు
– విరామం తర్వాత శ్రీమఠానికి ఆప్త కార్యదర్శి రాక – పీఠాధిపతితో కలిసి ఉత్సవాలకు హాజరు మంత్రాలయం : ఆప్తకార్యదర్శి హోదా శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఎంతో కీలకమైంది. పీఠాధిపతి కార్యాచరణ, మఠం కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో అజమాయిషీ ఉంటుంది. పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రాచార్ పరమపదించిన తర్వాత మఠంలో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రాధాన్యతలో అసమానతల నేపథ్యంలో పీఠాధిపతుల ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్ జూన్ 18న రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాలతో ఉపసంహరించుకున్నారు. తర్వాత శ్రీమఠానికి రాలేదు. చాన్నాళ్ల విరామం తర్వాత ఆదివారం ఆయన మంత్రాలయం వచ్చారు. వేకువజామున మఠం చేరుకుని 8.45 గంటలకు శ్రీరాఘవేంద్రస్వామి మూలబందావన దర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులతో కలిసి టీకారాయలు ఆరాధనోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తన గదిలో మఠం మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్తో 9.54 గంటల వరకు మంతనాలు జరిపారు. 10 గంటలకు పీఠాధిపతిని కలుసుకుని ధార్మిక పర్యటనలో భాగంగా రాయచూరు బయలు దేరారు. పీఠాధిపతి, వారి పూర్వాశ్రమ తండ్రి గియాచార్తోపాటు ఒకే కారులో వెళ్లారు. ప్రై వేట్ కారులో ఆప్తకార్యదర్శి అనుకోని రాక మఠంలో చర్చనీయాంశమైంది. కలుపుగోలుగా ధార్మిక పర్యటనకు వెళ్లడం, టీకారాయలు ఆరాధనలో పాల్గొనడం నిజంగా విశేషమనే కోణంలో చర్చించుకున్నారు.