breaking news
Aled Carey
-
ఒకే ఓవర్లో ఆరు వికెట్లు!
విక్టోరియా:ఒక ఓవర్లో మూడు వికెట్లు తీయడమే గొప్ప. మరి ఒకే ఓవర్ లో ఆరు వికెట్లు తీస్తే అది కచ్చితంగా అద్భుతమే. తాజాగా ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ ఒకే ఓవర్ లో ఆరు వికెట్లు తీసి అదుర్స్ అనిపించాడు. క్లబ్ క్రికెట్ లో భాగంగా గోల్డెన్ పాయింట్ క్లబ్-ఈస్ట్ బల్లారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే గోల్డెన్ పాయింట్ క్లబ్ ఆటగాడు అలెడ్ క్యారీ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. అతని వ్యక్తిగత ఎనిమిది ఓవర్ల వరకూ వికెట్ కూడా సాధించని అలెడ్.. తొమ్మిదో ఓవర్లో చెలరేగిపోయాడు. వరుసగా ఈస్ట్ బల్లారత్ ఆటగాళ్లను అవుట్ చేస్తూ ఆ ఓవర్లో ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈస్ట్ బల్లారత్ జట్టు 40 పరుగులకే చాపచుట్టేసింది. దీనిపై అలెడ్ విపరీతమైన ఆనందం వ్యక్తం చేశాడు. తాను మళ్లీ తిరిగి ఈ ఫీట్‌ను సాధిస్తానని అనుకోవడం లేదన్నాడు. తాను చాలాసార్లు హ్యాట్రిక్ వికెట్లను తీయడానికి దగ్గరగా వచ్చినా, ఆ ఘనతను ఇంతకుముందెప్పుడూ చేరుకోలేదన్నాడు. అయితే ఈ రోజు తనకు అదృష్టం కలిసొచ్చి ఒకేసారి డబుల్ హ్యాట్రిక్ సాధించడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. -
గ్రేట్ బౌలింగ్: 6 బంతుల్లో 6 వికెట్లు!
విక్టోరియా: ఒక ఓవర్లో మూడు వికెట్లు తీయడం, అందులోనూ అది హ్యాట్రిక్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. దిగ్గజ బౌలర్లలో కొందరు మాత్రమే హ్యాట్రిక్ ఫీట్‌ను నమోదు చేస్తుంటారు. కానీ, గోల్డెన్ పాయింట్ క్రికెట్ క్లబ్ బౌలర్ అలెడ్ కారే ఏకంగా ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి డబుల్ హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఈస్ట్ బల్లారట్ జట్టుపై ఈ రికార్డును నెలకొల్పాడు. తొలి ఎనిమిది ఓవర్లలో వికెట్ కూడా పడగొట్టని బౌలర్ అలెడ్ కారే తొమ్మిదో ఓవర్లో అద్భుతం చేశాడు. తొలి బంతికి స్లిప్‌లో క్యాచ్, రెండో బంతికి వికెట్ కీపర్ క్యాచ్, మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ తీసి హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. ఆ తర్వాతి మూడు బంతుల్లో ముగ్గురు బ్యాట్స్మన్లను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించి ఒకే ఓవర్లో రెండో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు కారే. దీంతో ప్రత్యర్ధి జట్టు ఈస్ట్ బల్లారట్ కేవలం 40 పరుగులకే చాపచుట్టేసింది. ఈ అరుదైన రికార్డుపై కారే మాట్లాడుతూ.. నేను కూడా ఈ ఫీట్‌తో షాక్ కు గురయ్యాను. ఇప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. డబుల్ హ్యాట్రిక్ ఫీట్ ను నా తండ్రి చూస్తున్నప్పుడు తీయడం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు.