breaking news
Alanaati Ramachandrudu Movie
-
ఓటీటీలో 'అలనాటి రామచంద్రుడు'.. వారిద్దరికీ ఫస్ట్ సినిమానే
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అయిన సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. మోక్ష హీరోయిన్గా నటించారు. ఈ మూవీతో వీరిద్దరూ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.‘అలనాటి రామచంద్రుడు’ సినిమా ఆగష్టు 2 విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. సుమారు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, కేశవ్ దీపక్, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో కనిపించారు.కథేంటంటే.. సిద్ధు(కృష్ణ వంశీ) ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుంచి ఇతరులో మాట్లాడాలన్నా..స్టేజ్‌పై స్పీచ్ ఇవ్వాలన్నా చాలా భయం. ధరణి(మోక్ష) ఎక్స్ట్రావర్ట్. ఒంటరిగా ఉన్నా..తనచుట్టు నలుగురు పోగయ్యేలా చేసే రకం. ఇద్దరిది ఒకే కాలేజీ. తనకు పూర్తి భిన్నంగా ఉన్న ధరణి అంటే సిద్ధుకి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక..తన మెమెరీస్ని రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో దాచుకుంటాడు. దరణితో స్నేహం ఏర్పడినా తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. అంతలోనే ధరణికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని..అతని పేరు విక్రమ్(సుప్రజ్) అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దు ఏం చేశాడు? అసలు ధరణికి విక్రమ్ ఎలా పరిచయం అయ్యాడు? విక్రమ్‌తో కలిసి మనాలి వెళ్లాలనుకున్న దరణి..ఒంటరిగానే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సిద్దు మనాలి ఎందుకు వెళ్లాడు? ధరణి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అసలు సిద్ధు తన ప్రేమ విషయాన్ని ధరణికి చెప్పాడా?లేదా? చివరకు సిద్దు, ధరణిలు ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. -
‘అలనాటి రామచంద్రుడు’ మూవీ రివ్యూ
టైటిల్: అలనాటి రామచంద్రుడునటీనటులు: కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లి, స్నేహమాధురి శర్మ తదతరులునిర్మాత: హైమావతి, శ్రీరామ్ జడపోలుదర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డిసంగీతం: శశాంక్ తిరుపతిసినిమాటోగ్రఫీ: ప్రేమ్ సాగర్ఎడిటర్: జే సి శ్రీకర్విడుదల తేది: ఆగస్ట్ 2, 2024ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అభిరుచి మారింది. కంటెంట్ బాగుంటే చాలు హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోవడం లేదు. అందుకే ప్రస్తుతం మన దర్శకనిర్మాతలు కంటెంట్‌ను నమ్ముకొని కొత్త నటీనటులతో సినిమాలు తీస్తున్నారు. అలా కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రమే ‘అలనాటి రామచంద్రుడు’. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఓ మంచి లవ్‌స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సిద్ధు(కృష్ణ వంశీ) ఇంట్రోవర్ట్. చిన్నప్పటి నుంచి ఇతరులో మాట్లాడాలన్నా..స్టేజ్‌పై స్పీచ్ ఇవ్వాలన్నా చాలా భయం. ధరణి(మోక్ష) ఎక్స్ట్రావర్ట్. ఒంటరిగా ఉన్నా..తనచుట్టు నలుగురు పోగయ్యేలా చేసే రకం. ఇద్దరిది ఒకే కాలేజీ. తనకు పూర్తి భిన్నంగా ఉన్న ధరణి అంటే సిద్ధుకి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక..తన మెమెరీస్ని రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో దాచుకుంటాడు. దరణితో స్నేహం ఏర్పడినా తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడిపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటాడు. అంతలోనే ధరణికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని..అతని పేరు విక్రమ్(సుప్రజ్) అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దు ఏం చేశాడు? అసలు ధరణికి విక్రమ్ ఎలా పరిచయం అయ్యాడు? విక్రమ్‌తో కలిసి మనాలి వెళ్లాలనుకున్న దరణి..ఒంటరిగానే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సిద్దు మనాలి ఎందుకు వెళ్లాడు? ధరణి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అసలు సిద్ధు తన ప్రేమ విషయాన్ని ధరణికి చెప్పాడా?లేదా? చివరకు సిద్దు, ధరణిలు ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ప్రేమ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే లవ్‌స్టోరీలో కొంచెం వైవిధ్యం ఉంటే చాలు సినిమాను ఆదరిస్తారు ప్రేక్షకులు. దర్శకుడు చిలుకూరి ఆకాశ్ రెడ్డి కూడా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథకి ఫాదర్ సెంటిమెంట్ యాడ్ చేసి అన్నివర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కథను రాసుకున్నాడు. అయితే అనుకున్న కథను అంతే ఆసక్తికరంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సంభాషణల్లో ఉన్న డెప్త్.. సన్నివేశాల్లో కనిపించలేదు. డాటర్-ఫాదర్ సెంటిమెంట్ సీన్లను మాత్రం చక్కగా తీర్చిదిద్దాడు. ఆ సీన్లన్నీ అలా గుర్తుండిపోతాయి. అయితే హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ మాత్రం రొటీన్‌గానే ఉంటుంది. కాలేజీ సీన్లు, తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌కి చెప్పేందుకు హీరో చేసే ప్రయత్నాలు అన్నీ రొటీన్‌గానే ఉంటాయి. హృదయాలను హత్తుకునే పాటలు.. మంచి నేపథ్య సంగీతం కారణంగా కథనం రొటీన్‌గా సాగినా ఫస్టాఫ్ బోర్ కొట్టదు. కానీ సెకండాఫ్‌లో కథనాన్ని నెమ్మదిగా సాగిస్తూ.. బోర్ కొట్టించేలా చేశాడు. మనాలిలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ముఖ్యంగా వాళ్ల చిన్ననాటి ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. మనాలి నుంచి హీరోహీరోయిన్లు తిరిగి వచ్చిన తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. ఒకనొక దశలో ఇంకా శుభం కార్డు పడట్లేదే అనిపిస్తుంది. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్..ఇద్దరూ కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. ఇంట్రోవర్ట్ సిద్ధు పాత్రకి కృష్ణవంశీ న్యాయం చేశాడు. మొదటి సినిమానే అయినా.. చక్కగా నటించాడు. ఇక ధరణి పాత్రలో మోక్ష ఒదిగిపోయింది. తెలుగులో తొలి సినిమాతోనే మంచి పాత్ర లభించింది. డ్యాన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ పాత్ర గుర్తుండిపోతుంది. సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. శశాంక్ తిరుపతి సంగీతం సినిమాకు ప్లస్ అయింది. హృదయాలను హత్తుకునే పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సన్నివేశాన్ని తెరపై రిచ్‌గా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
హృదయాన్ని హత్తుకునేలా ‘అలనాటి రామచంద్రుడు’ టీజర్
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరైన టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ‘మా అమ్మ ఎప్పుడు చెప్పేది.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా.. ఆ ప్రేమని చనిపోయింతవరకూ వదులుకోకూడదు’ అనే డైలాగ్ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమకథని చాలా కొత్తగా, మనసుని హత్తుకునేలా చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి. ‘’ఆ రాముడు సీత కోసం ఒక్కసారే యుద్ధం చేశారు. కానీ నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా’, ‘కాలిపోతున్న కాగితానికి ఎంత ప్రేమ చూపించినా తిరిగిరాదు’, ‘చందమామను చేరుకోవడం ఆ పావురానికి గమ్యం అయితే.. నిన్ను చేరుకోవడమే నా గమ్యం ధరణి’ అనే డైలాగ్స్ ప్రేమకథని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. కృష్ణ వంశీ టీజర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మోక్ష అందం, అభినయంతో అలరించింది. దర్శకుడు ఆకాష్ రెడ్డి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీని ప్రజెంట్ చేస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. శశాంక్ అందించిన నేపధ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది.