breaking news
Air Space Violation
-
ప్రయాణికులకు అలర్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లే అన్ని విమానాల సస్పెన్షన్‌ను ఎయిర్ ఇండియా సోమవారం(మార్చి 2) రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రయాణీకులకు సూచనలు చేసింది.ఈ క్రమంలో ఢిల్లీ, ముంబై, తిరుచిరాపల్లి సహా పలు విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి సంస్థలు కూడా తాత్కాలికంగా వాటి సర్వీసులను నిలిపివేశాయి. దీంతో, యూరప్ వెళ్లే విమానాలు సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆదివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.దాడులు, గగనతల పరిమితులు, భద్రత దృష్ట్యా భారత్ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలు రద్దయినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకొనే విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో’ తెలిపింది. పశ్చిమాసియాకు వెళ్లే దాదాపు 184 అంతర్జాతీయ విమానాలను పాకిస్థాన్ రద్దు చేసింది. అటు పశ్చిమాసియా దేశాల్లోనూ 1,800కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) వెల్లడించింది.మరోవైపు.. ఆదివారం కువైట్, అబుదాబీ, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆయా విమానాశ్రయాల్లోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది. -
భారత్‌తో పెట్టుకుంటే ఇంతే.. పాకిస్తాన్‌కు చావు దెబ్బ!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, నిర్ణయాలు వల్ల ఆ దేశానికే ఊహించని షాక్ తగిలింది ఈ కారణంగా కేవలం రెండు నెలల కాలంలో పాక్‌కు ఏకంగా రూ.1,240 కోట్ల నష్టం వాటిల్లినట్టు డాన్ పత్రిక ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో.. భారత్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్‌పై కక్షగట్టిన పాక్.. తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంతో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు రూ.1240కోట్లు(భారత కరెన్సీ) నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారతపై ఆంక్షల నేపథ్యంలో రోజుకు 100-150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది.దీని కారణంగా విమానాల రాకపోకలు 20శాతం తగ్గిపోయాయని వెల్లడించింది. ఫలితంగా పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది. మరోవైపు.. ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది.Pakistan's ministry of Defence informed National Assembly on Friday that Pakistan lost Rs 4.1 billion in 2 months due to closure of airspace for Indian aircraftIn 2019, a similar closure led to an estimated Rs7.6 billion ($54 million) revenue loss to Pakistan#OperationSindoor pic.twitter.com/BdLlZVmPB2— Anmol (@anmol_kaundilya) August 9, 2025పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులోభాగంగా సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతోపాటు పాక్ పౌరులు తక్షణమే భారత్‌ను విడిచివెళ్లాలని ఆదేశించింది. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి.. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. -
మా గగనతలంపై మీ విమానాలొద్దు: పాకిస్తాన్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరాన్ని కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్’ పౌర విమానాలను తమ గగనతలం మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్ మంగళవారం స్పష్టంచేసింది. గతంలో గోఎయిర్‌గా పిలవబడిన గో ఫస్ట్ పౌర విమానయాన సంస్థ ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచి శ్రీనగర్–షార్జా నగరాల మధ్య డైరెక్ట్ విమానసర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలిపే విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ఆ విమానాలన్నీ పాక్ మీదుగా రాకపోకలు సాగించాయి. అయితే తాజాగా తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్ కరాఖండీగా చెప్పేసింది. దీంతో మంగళవారం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. దీంతో విమానం మరో 40 నిమిషాలపాటు ప్రయాణించాల్సి వచ్చింది. హఠాత్తుగా తమ నిర్ణయం మార్చుకున్నందుకు సరైన కారణాలను పాకిస్తాన్ ఇంతవరకు భారత్‌కు తెలియజేయలేదు. దీనిపై గో ఫస్ట్ సంస్థ నుంచి సైతం ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్ Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్ వినీషా! -
గగనతల నిషేధాన్ని పొడిగించిన పాక్
ఇస్లామాబాద్: భారత సరిహద్దుల్లోని గగనతలంపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ వరుసగా రెండోసారి పొడిగించింది. మరో రెండు వారాల పాటు ఈ మార్గంలో వాణిజ్య విమాన సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. దీంతో పాక్...భారత సరిహద్దుల్లోని తన గగనతలంపై వాణిజ్య విమానాలు వెళ్లకుండా నిషేధం విధించింది. మే 15తో ఇది ముగియడంతో... ఈ నెల 30 వరకు నిషేధాన్ని పొడిగించింది. తాజాగా వచ్చేనెల 14 వరకు తమ గగనతలంపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం కారణంగా యూరోప్, ఆగ్నేయాసియా విమానాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
సియాచిన్‌లో పాక్ యుద్ధ విమానాలు!
-
సియాచిన్‌లో పాక్ హడావుడి!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన మిరేజ్ తరహా యుద్ధ విమానాలు సరిహద్దుల్లోని సియాచిన్ గ్లేసియర్ సమీపంలో తిరిగినట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడం కలకలం రేపింది. భారత భూభాగంలో ఉన్న సియాచిన్ ప్రాంతం సమీపంలో పాక్ వైమానిక దళ చీఫ్ తిరిగారని మీడియా చెప్పుకొచ్చింది. అయితే, ఈ కథనాలను భారత వైమానిక దళం నిర్ద్వంద్వంగా ఖండించింది. సియాచిన్లోని భారత గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ సరిహద్దుల్లోని స్కర్దు ప్రాంతంలో ఉన్న ఖాద్రి వైమానిక స్థావరాన్ని సందర్శించారని పాక్ మీడియా పేర్కొన్నది.ఇక్కడ ఫైటర్ జెట్ వైమానిక దళం యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నది. ఇక్కడ ఉన్న తమ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలన్నింటినీ భారత ముప్పును ఎదుర్కొనేందుకు పాక్ క్రియాశీలం చేసినట్టు మీడియా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్ ఎయిర్ చీఫ్ అమన్ తానే స్వయంగా మిరాజ్ జెట్ విమానాన్ని నడుపుతూ.. సియాచిన్ సమీపంలోకి చొచ్చుకొచ్చినట్టు కథనాలు వండివార్చింది. ఈ కథనాలను భారత్ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ల చొరబాట్లకు నేరుగా సహకరిస్తూ కాల్పులకు దిగుతున్న పాక్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని పాక్ సైనిక పోస్టు భారత్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళాలు పాక్ సైనిక పోస్టుపై దాడులు నిర్వహించిన వీడియోను ఆర్మీ విడుదల చేసింది. అయితే, ఈ దాడిని తోసిపుచ్చుతున్న పాక్.. తాజా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించాలనుకోంటోంది. ఈ నేపథ్యంలోనే సియాచిన్ గగనతలంలోకి తమ విమానాలు వచ్చాయంటూ కథనాలు ప్రచురించడం గమనార్హం. పాకిస్తాన్‌తో యుద్ధం?


