breaking news
aavu puli madhyalo prabhas pelli
-
'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పూర్తయింది!
'కాలకేయ' ప్రభాకర్, ఏ.రవితేజ, అశ్విని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’. రెడ్ కార్పెట్ రీల్ బ్యానర్లో రవి పచ్చపాల ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఎస్.జె. చైతన్యకృష్ణ దర్శకుడిగా టాలీవుడ్ పరిశ్రమకు పరిచియం అవుతున్నాడు. శైలజ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్యకృష్ణ మాట్లాడుతూ.. టైటిల్ చూసి రకరకాలుగా స్పందించిన వారు ఈ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇది చక్కటి ప్రేమకథ. ఈ మూవీలో హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానిగా కనపడతాడు. ‘బాహుబలి’లో కాలకేయగా నటించిన ప్రభాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. సాధారణంగా ఏడ్పించే సీన్లలో వాడే గ్లిజరిన్‌ని మెదటిసారిగా ఈ సినిమాలో నవ్వించటానికి వాడాల్సి వచ్చిందన్నాడు. అలాగే రియల్ గ్యాంగ్‌స్టర్స్‌ని ఈ చిత్రంలో చూపించాం. ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. త్వరలో టీజర్‌ని, అతి త్వరలో ఆడియోని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఏ.రవితేజ, ప్రభాకర్, అశ్విని చంద్రశేఖర్, భానుశ్రీ, వేణు, అప్పారావు తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం ఎమ్.టి.కవిశంకర్ అందిస్తుండగా, సహ నిర్మాతలుగా నగరం సునీల్, మధుమణి వ్యవహరిస్తున్నారు. -
వెండితెర మీద ప్రభాస్ పెళ్లి
ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతీ విషయంలో ఓ హాట్ టాపిక్లా చక్కర్లు కొడుతోంది. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చకు వస్తున్న ఓ అంశం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి. ఇప్పటికే 35 మార్క్‌ను కూడా దాటేసిన ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాకపోవటంతో ప్రభాస్ పెళ్లిని ఏకంగా సినిమా టైటిల్‌గా వాడేస్తున్నారు. బాగా చర్చ జరుగుతున్న విషయం కావటంతో ఇలాంటి టైటిల్ అయితే పబ్లిసిటీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమా విషయానికి వస్తే, బాహుబలి సినిమాలో కాలకేయ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్. ఇప్పటికే సుమంత్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న ప్రభాకర్ ఇప్పుడు మరో సినిమాలో కీ రోల్లో నటిస్తున్నాడు. 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్‌జె చైతన్య దర్శకుడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టైటిల్‌పై ప్రభాస్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.