breaking news
On 19th
-
19న టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 19న టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు జిల్లా టీటీ అధ్యక్షుడు అక్బర్‌సాబ్, కార్యదర్శి కేశవరెడ్డి, కోచ్ ధనుంజయరెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు, జూనియర్ బాలబాలికల టీమ్‌లను ఎంపిక చేస్తామన్నారు. అనంతపురం క్లబ్లో ఉదయం 9 గంటలకు ఎంపిక ఉంటుందని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 3 నుంచి 6 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9492400192 నెంబరును సంప్రదించాలన్నారు. -
19న కృష్ణా బోర్డు సమావేశం
రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల తాగునీటి అవసరాలు, నీటి విడుదల, ప్రాజెక్టుల పరిధిలో టెలీమెట్రీ విధానం వంటి అంశాలను చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 19న సమావేశం కానుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ గురువారం లేఖలు రాశారు. గత నెల 21, 22న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాష్ట్రాల అవసరాలు, నీటి విడుదలపై ఈ సమావేశంలో చర్చించాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా, తమ డెల్టా అవసరాల కోసం మూడు, నాలుగు టీఎంసీలు అవసరం ఉందని ఏపీ కోరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీకి దిగువన 503.9 అడుగుల వద్ద 121.55 టీఎంసీల నీరుంది. ఇందులో ఒక టీఎంసీకి మించి వాడుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటి విడుదల అనివార్యం. ప్రస్తుతం శ్రీశైలంలో 788.4 అడుగుల వద్ద 23.72 టీఎంసీల నీరుంది. ఇందులో 10 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. ఆ నీటిని తమ అవసరాలకు విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు సమావేశంలో కోరవచ్చు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో చుక్క కూడా తేడా రాకుండా నాగార్జునసాగర్, శ్రీశైలం సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద ్ధమైంది. సాగర్, శ్రీశైలం సహా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి, ఏఎంఆర్పీ సహా మొత్తంగా 14 పాయింట్లలో రిజర్వాయర్ల లెవల్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో ప్రవాహాలను గణించేందుకు వీలుగా టెలీమెట్రీ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. దీనిపై సమావేశంలో చర్చించనున్నారు.