Top Stories
ప్రధాన వార్తలు
వైఎస్సార్సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్), చాణక్య (పార్థదాస్) తేల్చాయి. జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే, ఎగ్జిట్ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్సీపీ, 10–12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్ లాబొరేటరీ, జన్మత్ పోల్, సీపీఎస్ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని క్యూ మెగా అమేజీ పొలిటికల్ సొల్యూషన్స్ సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ తెలిపారు. 22 పార్లమెంట్ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, ఎన్డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్ఎక్స్, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్డీటీవీ, న్యూస్–18 వంటి జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్‌కింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
సాక్షి, అమరావతి: ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్ సీపీ పట్ల పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జూన్ 4న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు తమవైపే నిలిచారనే విషయం ఎగ్జిట్ పోల్స్‌లో తేలిందన్నారు. శనివారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలను సమాజంలో ఆత్మగౌరవంతో నిలబెట్టారని, సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు కుటుంబాన్ని నడిపించగల శక్తిని అందించారన్నారు. సీఎం జగన్ వల్లే తమకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో మహిళలు వారి కుటుంబాలు పోలింగ్‌కు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. ఐదేళ్లలో తమ కుటుంబాల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించడంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరగడంతో కొన్ని సర్వే సంస్థలకు వైఎస్సార్ సీపీపై క్షేత్ర స్థాయిలో ఉన్న సానుకూలత కనిపించలేదన్నారు. పాజిటివ్ అజెండా పని చేసింది.. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం మొత్తం పాజిటివ్ కోణంలో నిర్వహించాం. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగాం. చంద్రబాబు మరోసారి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ 2014లో మాదిరిగా మోసం చేసేందుకు వస్తున్నాడని గుర్తు చేశాం. టీడీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడారు. సీఎం జగన్ అంతు చూస్తామని, అధికారంలోకి వచ్చేశామంటూ విర్రవీగారు. సొంతంగా పోటీ చేయలేక కూటమి కట్టారు. మా నాయకుడు మాత్రం పాజిటివ్ అజెండాతో ప్రజలను ఓట్లు అడిగారు. పాజిటివ్ అజెండా పని చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసీ ఒత్తిడికి తలొగ్గితే ఎలా? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు ఏపీ సీఈవోపైకి దండయాత్రలా వెళ్లి బెదిరించలేదా? ఆ తర్వాత ఈవీఎంలు మోసం చేశాయంటూ దు్రష్పచారం నడిపారు. అలాంటి పార్టీకి చెందిన వాళ్లు ఈ రోజు మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పోస్టల్ బ్యాలెట్ విషయలో టీడీపీ గందరగోళం సృష్టించాలని యత్నించింది. ఏ రూల్స్ అవసరం లేకుండా నేరుగా పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవాలన్న టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మేం కోర్టుకెళ్లాం. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మా ఏజెంట్లకు చెప్పాం. తిరస్కరించాల్సిన ఓటును చెల్లుబాటయ్యేలా టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని చెప్పాం. దీనికే నాపై కేసులు మోపడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టుకు వెళ్తాం.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం. జూలై 2023లో ఈసీ స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. అందులో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు, తిరస్కరణ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీల్ లేకుంటే కనీసం హోదా వివరాలైనా రాయాలని ఉంది. పోలింగ్ అయ్యాక అది అవసరం లేదని ఈసీ చెప్పడం అనైతికం. వాళ్లిచ్చిన నిబంధనలను వాళ్లే తుంగలో తొక్కితే ఎలా? చంద్రబాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు. అందుకే చంద్రబాబు కుట్రలు.. గత ఐదేళ్లలో పౌర సేవలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ప్రజలపై ఉండదనుకుంటే అది భ్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్ సీపీకి వస్తాయనే భయంతో పవన్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్‌తోనూ కలసి ఎన్నికలకు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చి లాభపడాలని నానా గడ్డి కరిచి విష ప్రచారం చేశారు. ఆయన ఇన్ని చేసినా మాపట్ల ప్రజల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. ఇటీవల ఎన్నికల రిగ్గింగ్ మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ జరుగుతున్నట్టుంది. బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు బాగా తగ్గుతుండటంతో దక్షిణాదిలో పెరుగుతున్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వారికి నచ్చిన లెక్కలేసి చెబుతున్నారు. మాకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వైఎస్సార్ సీపీకి కచ్చితంగా అనుకూలించింది. ఐదేళ్లలో మేం ప్రజలకు మంచి చేశాం. టీడీపీకి ఎందుకు అనుకూలంగా సర్వేలు వచ్చాయో వాళ్లు చెప్పగలరా? మరో రెండు రోజులు వారికి నచ్చిన అంకెలు చెప్పుకుంటూ ఆనందం పొందాలంటే పొందొచ్చు.
Exit polls 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా స్థానాలు కచి్చతంగా లభిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలుసున్న తర్వాతే ఈ సంఖ్య చెబుతున్నామని వెల్లడించారు. తమది ప్రజల సర్వే అని, బీజేపీది ప్రభుత్వ సర్వే అని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల సరళి, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై రెండున్నర గంటలపాటు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కె.సి.వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, రాఘవ్ చద్ధా, జేఎంఎం నాయకులు చంపయ్ సోరెన్, కల్పనా సోరెన్, డీఎంకే నేత టి.ఆర్.బాలు, జమ్మూకశీ్మర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డి.రాజా, సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ హాజరు కాలేదు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. ఫలితాల పేరిట బీజేపీ మీడియా మిత్రులు తప్పుడు అంకెలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా కౌంటింగ్ హాళ్లనుంచి బయటకు వెళ్లొద్దంటూ తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించామని ఖర్గే తెలిపారు. ఇండియా కూటమిలో తామంతా ఐక్యంగా ఉన్నామని, తమను విభజించే ప్రయత్నం చేయవద్దని మీడియాను కోరారు. బీజేపీ 220 సీట్లకే పరిమితం: కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా, బీజేపీకి 220 సీట్లు వస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మొత్తం 235 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తమ కూటమి ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు.
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.తన 39వ పుట్టినరోజున దినేశ్ కార్తిక్ ఈ మేరకు ఇన్‌స్టా ఉద్వేగపూరిత పోస్ట్‌తో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా. దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్ కార్తిక్ సుదీర్ఘ నోట్ రాశాడు.2004లో అరంగేట్రంతమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్ సర్వేఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్ లాబొరేటరీపోల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్ స్టార్ట్ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్ చాణక్య ఆపరేషన్ చాణక్య ప్రకారం.. కాంగ్రెస్ 7, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్ ఆఫ్ ఇండియాటైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్ఎస్ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్ 24న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది.
దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం.. రేవంత్‌కు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేసీఆర్..ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని అమరుల త్యాగాల పర్యావసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షంగా ప్రచారం చేస్తున్న మీ భావదారిద్య్రాన్ని నేను మొదట నిరసిస్తున్నానని లేఖల పేర్కొన్నారు.‘‘1969 నుంచి 5 దశాబ్దాలు భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది వాస్తవం ఇది సత్యం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ఉక్కుపచ్చలారని యువకులు కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకొని ఇవ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కషత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోతుంది. మలిదశ ఉద్యమంలో వందలాదిమంది యువకులు ప్రాణాలు బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీ దే’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నించింది తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయం శక్తిగా మలిచింది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలేశాం. మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీరోగమన దిశలో వెళ్తోంది’’ అని కేసీఆర్ లేఖలో మండిపడ్డారు.‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్దీజ్ఞ ఉత్తేజ కరమైన సందర్భమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్న ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో నేను పాల్గొనడం సమంజసం కాదని టిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది. పైన పేర్కొన్న కారణాల విద్య ప్రజా జీవితాన్ని క్రమక్రమంగా కల్లోలం లోకి నెట్టుతున్న మీ పాలనను మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లు అడుగడుగున అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరిని నిరసిస్తున్నాం. ఇందుచేత రేపటి దశాబ్ది ఉత్సవాలలో నేను పాల్గొనడం లేదు’’ అంటూ లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు.
లెక్క కుదిరింది
కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్)కి, షిప్ ఓనర్ (ప్రోడ్యూసర్)కి మధ్య మంచి రిలేషన్ ఉండాలి. షిప్ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. ‘దిల్’ రాజు, అనిల్ రావిపూడిమూడోసారి ‘దిల్’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో సుప్రీమ్ (2016), ‘రాజా ది గ్రేట్’ (2017), ‘ఎఫ్ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్ 3’ (2022) వంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్–‘దిల్’ రాజు కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్ హీరో. హిట్ చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్–అనిల్ రావిపూడి–‘దిల్’ రాజు కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్ సుకుమార్–మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్–మైత్రీ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్–నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కాంబినేషన్లో ‘పుష్ప 2: ది రూల్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.∙సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. సునీల్, రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్), అమిగోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్ నారంగ్, రామ్మోహన్ కాంబినేషన్లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ (2021) సూపర్ హిట్టయింది. నాగ్ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్ బేనర్లో నాగ్ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి రెండు హోమ్ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ఉన్నాయి. అశ్వినీదత్ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సార్’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్లో తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. శ్రీకాంత్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్’ చిత్రం తర్వాత డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని–పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో ‘మిరాయ్’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరో, హీరోయిన్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘ఈగల్’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్–విశ్వప్రసాద్ కాంబినేషన్లో ‘మిరాయ్’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటిస్తున్న ‘మిరాయ్’లో మంచు మనోజ్ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డిఈసారి ‘జై హనుమాన్’తో...సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఇక ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ–చైతన్య–నిరంజన్ రెడ్డి కాంబినేషన్లో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి.
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు
పాపులర్ సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ మరింత తీవ్రమైంది.బోర్డ్ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్మెంట్పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.
తప్పక చదవండి
- కర్నూలు నుంచి ‘ఏపీఈఆర్సీ’ కార్యకలాపాలు
- ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాలు
- మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
- దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం!
- Shraddha Kapoor: బహు భాషిణి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
సినిమా
మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్‌కు పెళ్లి అచ్చి రావడం లేదు. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. విడదీయలేని బంధం అనుకునేలోపే మనస్పర్థల వల్ల 2015లో విడాకులు తీసుకున్నారు. తర్వాత దుబాయ్‌లో జరిగిన పార్టీలో నిఖిల్ పటేల్ అని వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కానీ అప్పటికే భార్యతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తున్నాడు. ఏడాది తిరిగేసరికే..అటు దల్జీత్.. ఇటు నిఖిల్.. ఇద్దరూ సింగిల్ పేరెంట్సే అవడంతో పిల్లల గురించి మాట్లాడుకున్నారు. ఈ కబుర్లు కాస్తా ప్రేమకు దారితీశాయి. దీంతో ఇద్దరూ గతేడాది మార్చిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఏడాది తిరిగేసరికే ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగైంది. మౌనం ఆవహించింది. కొడుకును తీసుకుని దల్జీత్ పుట్టింటికి వచ్చేసింది. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. భర్త చీటింగ్ చేశాడని సోషల్ మీడియాలో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పెళ్లి వీడియో షేర్ చేసిన నటినెట్టింట ఇంత రచ్చ చేసిన ఆమె శనివారం నాడు గతేడాది జ్ఞాపకాలు అంటూ నిఖిల్‌తో జరిగిన పెళ్లి వీడియో షేర్ చేసింది. అందులో హల్దీ, పెళ్లి, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి. నాన్నకు తోడు దొరికిందంటూ నిఖిల్ కూతురు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. పదిహేను నెలల క్రితం అన్న క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేసిన నటి కొద్ది క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేసింది. అప్పటికే అది చూసిన నెటిజన్లు.. అక్కడే ఆగిపోకు.. ముందుకు సాగాలికదా.. అతడు నిన్ను మోసం చేశాడు.. కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.చదవండి: ఉన్నదంతా స్టార్ హీరోలకే.. మిగతా యాక్టర్స్‌కు ఏం మిగలట్లేదు!
సుకుమార్ షాకింగ్ నిర్ణయం.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్!
ఆగస్ట్ 15.. బన్నీ ఫ్యాన్స్‌కి నిజంగా పండగ రోజే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ అదే రోజు రిలీజ్ కాబోతుంది. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. అయితే విడుదల తేది దగ్గర పడినా.. ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం బన్నీ అభిమానుల్ని కలవరపెడుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్ట్ 15న బొమ్మ పడుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానాలు తల్లెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో డైరెక్టర్ సుకుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ని మార్చాలని భావిస్తున్నాడట.సాధారణంగా సుకుమార్ తన ప్రతి సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ప్లాన్ చేస్తాడట. అలా పుష్ప 2 కోసం కూడా ఇప్పటికే రెండు క్లైమాక్స్‌లు సిద్ధం చేసుకున్నాడట. రెండింటిలో ఒకటి యాడ్ చేయాలని భావించాడట. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్‌లు కాకుండా వేరేది యాడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో..క్లైమాక్స్ కూడా పార్ట్ 3కి సెట్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నాడట. ఒకవేళ అదే నిజమైతే సుకుమార్ మళ్లీ రీషూట్‌కి వెళ్తాడా? లేదా ఇప్పటికే ఫిక్స్ అయిన వాటి నుంచి బెస్ట్ క్లైమాక్స్‌ని యాడ్ చేస్తారా? అనేది తెలియాక ఫ్యాన్స్ టెన్షపడుతున్నారట. ఒకవేళ రీషూట్‌కి వెళ్తే మాత్రం పుష్ప 2 ఆగస్ట్ 15కి రిలీజ్ కావడం కష్టమే అని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికి కెవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేశారు. ఇంకా నాలుగు పాటలను రిలీజ్ చేయాల్సి ఉంది. ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా చేయాలి. ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో క్లైమాక్స్ చేంజ్ అని వార్తలు వినిపించడం బన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.
బీచ్ ఒడ్డున చెత్త ఎత్తిన హీరోయిన్ పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్డే చాన్నాళ్ల తర్వాత బయట కనిపించింది. గత కొన్నాళ్లుగా చేసిన సినిమా చేసినట్లు ఫ్లాప్ కావడంతో ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతానికైతే హిందీలో ఒక్క మూవీ చేస్తుందంతే. అలాంటిది ఇప్పుడు ఓ క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొని తన వంతు బాధ్యత నిర్వర్తించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?)ముంబయి బ్యూటీ పూజా హెగ్డే.. 12 ఏళ్ల క్రితమే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పలు తెలుగు సినిమాలు ఈమెకు స్టార్ హీరోయిన్ హోదా తీసుకొచ్చాయి. ఎంత వేగంగా సక్సెస్ వచ్చిందో అంతే ఫాస్ట్‌గా మూవీస్ వరసగా ఫెయిలయ్యాయి. దీంతో దక్షిణాది నుంచి ఫేడౌట్ అయిపోయింది. ఇప్పుడు హిందీలో 'దేవ' అనే మూవీ చేస్తోంది. ఇది హిట్ కావడం పూజాకి చాలా ముఖ్యం.ఇకపోతే తాజాగా ముంబయిలోని జుహూ బీచ్‌లో శనివారం నిర్వహించిన క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో పూజా పాల్గొంది. చెత్త ఎత్తి పర్యావరణ పరిశుభ్రతలో భాగమైంది. సినిమాలు లేకపోవడం వల్ల ఇలా కాస్త ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్‌లో కనిపిస్తోంది.(ఇదీ చదవండి: తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?)"Yeh Dekho Kya ho gaya" says #PoojaHegde looking beautiful in a white 🤍 crop top and a blue 💙 pair of jeans as she talks to the paps 📸 and attends a beach cleanup drive ⛱️☀️ in Mumbai 📍 She's absolutely stunning! 😍 pic.twitter.com/v2xuKg6h0E— Take One Filmy (@TakeOneFilmy) June 1, 2024
12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది కింది స్థాయి నుంచి పైకి వచ్చినవారే! అలాంటివారిలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఒకరు. ఎన్నో కష్టాలను దాటుకుని గొప్ప స్థాయికి ఎదిగాడు. తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య నయనతార, కవల పిల్లలతో కలిసి హాంకాంగ్ ట్రిప్పుకు వెళ్లాడు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ కుటుంబంతో చుట్టేస్తున్నాడు.12 ఏళ్ల తర్వాత..ఈ క్రమంలో తాజాగా డిస్నీల్యాండ్ రిసార్ట్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. 12 ఏళ్ల క్రితం కాళ్లకు చెప్పులు వేసుకుని కేవలం వెయ్యి రూపాయలతో ఇక్కడ నిల్చున్నాను. పోడా పొడి షూటింగ్ కోసం అనుమతివ్వమని అర్థించాను. పుష్కరకాలం తర్వాత మరోసారి నా లవ్లీ బేబీస్ నయనతార, ఉయిర్, ఉలగ్‌తో డిస్నీలాండ్ రిసార్ట్‌లో అడుగుపెట్టాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ఎంతో భావోద్వేగంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉంది. జీవితం ఎంత అందమైనదో కదా.. నిజంగా ఆ దేవుడు చాలా మంచివాడు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పొడా పోడి. ఈ సినిమాలోని అప్పన్ మవనే వాడ పాట సాంగ్ షూటింగ్ అంతా హాంకాంగ్‌లోని డిస్నీల్యాండ్ రిసార్ట్‌లోనే జరిగింది. ఇందులో శింబు హీరోగా వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) చదవండి: జాతరలో మాస్ స్టెప్పులేసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
ఫొటోలు
రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్ చహర్ భావోద్వేగం (ఫొటోలు)
Vignesh-Nayanthara Hong Kong Vacation: ఫ్యామిలీతో నయనతార సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
సాగరిక ఘట్జ్ హ్యాండ్ పెయింటింగ్ కళ్ళుతిప్పుకోలేరు.. (ఫోటోలు)
T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)
Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
క్రీడలు
ప్రిక్వార్టర్స్ చేరిన రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో కజకిస్తాన్ స్టార్ రిబాకినా, రెండో సీడ్ సబలెంక అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–4, 6–2తో వరుస సెట్లలో ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)ను చిత్తు చేయగా, రెండో సీడ్ సబలెంక (రష్యా) 7–5, 6–1తో బడొసా (స్పెయిన్)పై నెగ్గింది. ఆ్రస్టేలియా ఓపెన్ రన్నరప్, ఏడోసీడ్ క్వినెన్ జెంగ్‌కు రష్యా ప్లేయర్ ఎలీనా అవనెసియాన్ షాకి చ్చింది. మూడో రౌండ్లో అన్సీడెన్ ఎలీనా 3–6, 6–3, 7–6 (10/6)తో చైనా స్టార్‌ను ఇంటిదారి పట్టించింది. మరో మ్యాచ్‌లో వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రొసొవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో క్లో పాక్వెట్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్, అల్కరాజ్ ముందంజ వేశారు. మూడోరౌండ్లో నిరుటి సెమీఫైనలిస్ట్, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 3–6, 6–4, 6–2, 4–6, 7–6 (10/3)తో టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)పై శ్రమించి నెగ్గాడు. స్పెయిన్ స్టార్, మూడో సీడ్ కార్లొస్ అల్కరాజ్ 6–4, 7–6 (7/5), 6–3తో 27వ సీడ్ సెబాస్టియన్ కొర్డా (అమెరికా)పై గెలుపొందగా, సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–3, 6–1తో జాంగ్ జిజెన్ (చైనా)ను ఓడించాడు. ఆ్రస్టేలియా ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–6 (7/4), 7–5, 1–6, 6–4తో థామస్ మచక్ (చెక్ రిపబ్లిక్)పై చెమటోడ్చి విజయం సాధించాడు. శ్రీరామ్ బాలాజీ ముందంజ భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. పురుషుల డబుల్స్‌లో మిగెల్ వరేలా (మెక్సికో)తో జోడీకట్టిన బాలాజీ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో భారత్–మెక్సికన్ ద్వయం 6–4, 3–6, 6–2తో డాన్ ఆడెడ్–థియో అరిబేజ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది.
గాయత్రి–ట్రెసా జోరుకు సెమీస్‌లో బ్రేక్
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో భారత ద్వయం 21–23, 11–21తో ప్రపంచ నాలుగో ర్యాంకు జోడీ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో గాయత్రి–ట్రెసా జంట తొలి గేమ్‌లో నాలుగో సీడ్ ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడింది. ఒక దశలో 5–10తో వెనుకబడిన వీరు చక్కటి ఆటతో స్కోరును 16–16 వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జపాన్ జోడి 20–18తో గేమ్ పాయింట్ వద్ద నిలిచినా...భారత ద్వయం సులువుగా తలవంచలేదు. చివరకు ఈ గేమ్‌లో పోరాడి ఓడింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్ జంట జోరుకు ఎదురు నిలువ లేకపోయింది. చెలరేగిన ఈ జోడి 20–6తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకుపోయింది. గాయత్రి–ట్రెసా పట్టుదలగాఆడి మరో 5 పాయింట్లు సాధించినా...ఆ తర్వాత పరాజయం తప్పలేదు. తాజా ఫలితంతో జపనీస్ ద్వయం ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్íÙప్లో గాయత్రి–ట్రెసా జోడీ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.తన 39వ పుట్టినరోజున దినేశ్ కార్తిక్ ఈ మేరకు ఇన్‌స్టా ఉద్వేగపూరిత పోస్ట్‌తో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా. దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.తను స్వతహాగా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ అయినప్పటికీ తన కెరీర్ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్ కార్తిక్ సుదీర్ఘ నోట్ రాశాడు.2004లో అరంగేట్రంతమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!
T20 WC: బంగ్లాతో మ్యాచ్.. కోహ్లి లేకుండానే! ఓపెనర్‌గా సంజూ విఫలం
టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య శనివారం నాటి వార్మప్ మ్యాచ్‌కు న్యూయార్క్ వేదికైంది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.విరాట్ కోహ్లి మినహా మిగిలిన పద్నాలుగు మంది ఆటగాళ్లు బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో భాగమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు.అయితే, రెండో ఓవర్లోనే అవుటై పూర్తిగా నిరాశపరిచాడు. బంగ్లాదేశ్ పేసర్ షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న సంజూ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఇక వన్‌డౌన్‌లో రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 33 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ 19, పంత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.మరోవైపు బంగ్లాదేశ్ జట్టు పదమూడు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు విశ్రాంతినిచ్చినట్లు కెప్టెన్ నజ్ముల్ షాంటో వెల్లడించాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.బంగ్లాదేశ్: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం.
బిజినెస్
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్లో స్టాక్‌సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్‌కలర్‌లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్లో పాల్గొన్న తన ట్రూప్ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్-రాధికల రెండో ప్రీవెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్‌షిప్‌లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్ ప్రయాణం సాగుతుంది.అనంత్ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024
భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..
ఎలక్ట్రానిక్ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్ఫేమ్3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్ ఇండియా1ను 2015, ఏప్రిల్1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.
నేడు సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్ స్టార్‌లైనర్ పనిచేస్తోంది.ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చెందిన హార్మోనీ మాడ్యుల్ సబ్‌సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు.
వీడియోలు
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
నో డౌట్ పక్కా సీఎం జగన్
వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం
జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..
హిమాచల్ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం
ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం
మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం
ఫ్యామిలీ
అటెన్షన్... లుంగీ ఇన్ లండన్
దక్షిణ భారతంలో లుంగీతో కనిపించడం వింతేమీ కాదు. అయితే లండన్‌లో కనిపిస్తే మాత్రం వింతే. ఆ వింతే ఈ వీడియోను వైరల్ అయ్యేలా చేసింది. వలేరి అనే తమిళియన్ రంగు రంగుల లుంగీలు ధరించి లండన్ వీధుల్లో, పాపుల్లో ‘రీల్స్’ చేసి అక్కడి ప్రజల రియాక్షన్‌ను రికార్డ్ చేసింది. ‘వియరింగ్ లుంగీ ఇన్ లండన్’ కాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్‌గా అభివర్ణించారు.
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్‌బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్‌లు, ఫైబర్లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలుఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ బోర్డర్లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు
పాపులర్ సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ మరింత తీవ్రమైంది.బోర్డ్ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్మెంట్పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.
న్యూస్ పాడ్‌కాస్ట్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్‌కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్ఐని ప్రశ్నించడంతో.. ఇన్స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఒక్క కేసే క్లోజ్ చేస్తామని.. కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్)
ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య..
ఏలూరు: ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెకు నిశ్చితార్థం కావడంతో ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పనిచేస్తున్న కాలేజీకి సమీపంలోనే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తనూ గొంతు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు యువకుడిని ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. వివరాలివీ..సర్టిఫికెట్ల కోసమని వచ్చి..ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్నగ్రేస్ (22) సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేసింది. అక్కడే జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ముసునూరుకు చెందిన తొట్టిబోయిన ఏసురత్నం (23) కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నట్లు సమాచారం. గురువారం మ.12.30 గంటల సమయంలో ఏసురత్నం తన డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్లు తెలిసింది. రత్నగ్రేస్ తను పనిచేస్తున్న కాలేజీ సమీపంలోకి రాగానే.. ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి ఏసురత్నం ఆమెను తీసుకెళ్లాడు.పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది. ఇద్దరం చనిపోదామని చెబుతూ కత్తి తీసి కోసుకోవాలన్నాడు. కానీ, ఆమె వద్దని వారించడంతో ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఆమె జుట్టు పట్టుకుని గొంత వద్ద ఇష్టారాజ్యంగా పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే విగత జీవిగా మారిన రత్నగ్రేస్ను చూస్తూ నిందితుడు కూడా పీక కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు.ఏలూరు త్రీటౌన్ సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్ఐ రామారావు çఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విజయవాడలో వెంటిలేటర్‌పై ఉన్నట్లు సమాచారం. యువతికి ఈ నెల 26న వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. ఆమె పనిచేస్తున్న విద్యాసంస్థలో తనతో పాటు ఫ్యాకల్టీగా పనిచేసే వ్యక్తితో వివాహం నిర్ణయించారని సమాచారం.ఎన్నిసార్లు వారించినా.. నిందితుడు ఏసురత్నం గతంలో తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధించేవాడని.. తన కుమార్తెను వేధించవద్దని ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతను లెక్కచేయకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడి వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రత్నగ్రేస్, ఏసురత్నం ఇద్దరూ డిగ్రీలో కలిసి చదువుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కావడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో 17 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందని.. ఇంతలో తమ కుమార్తె హత్యకు గురికావటంతో వారు భోరున విలపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఘటన వివరాలు సేకరిస్తున్నట్లు ఏలూరు త్రీటౌన్ ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు చెప్పారు.